గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జనవరి 2010, శనివారం

ద్రౌపది నవల రచయితపై చర్య తీసుకోవాలి' ప్రజాశక్తిలోని వార్త.


యార్లగడ్డ రచించిన ద్రౌపది నవల స్త్రీజాతికే అవమానకరంగా సభ్య సమాజంలో భారతీయ మహిళ పాత్రను, సత్శీలతను ప్రశ్నార్థకంలో పడేయడం ద్వారా ప్రస్తుతమున్న మన సామాజిక సమస్యలు చాలవన్నట్టుమరో గందరగోళానికి తెరతీసినట్టౌతోంది.

ఈ నవల రచయిత తనకు గల హక్కనుకొని, వ్రాసి ఉండి ఉండవచ్చును గాక, ఎవార్డు ప్రకటించడంలోనే మన కంతుపట్టని అంతర్జాతీయ  కుతంత్రం ఉండకపోదని జనం అనుకోవడం కర్ర్ణాకర్ణిగా వినిపిస్తోంది.
ఐతే ఈ విషయంలో విశాఖపట్టణం లో భాషా సంవర్ధక శాఖ ఉపాధ్యక్షులు శ్రీ సూర్యారావుగారు చేస్తున్న డిమేండ్ ను గూర్చి ప్రజాశక్తి దినపత్రిక ఈ రోజు ప్రచురించింది. ఆ ప్రచురణ పాఠాన్ని యథాతథంగా మీ ముందుంచుతున్నాను.
ఔచిత్యానౌచిత్యాలు పాఠకులకంతుపట్టనిదేమీ కాదు. మీరూ ఆలోచించండి.
ఇక సూర్యారావుగారు మున్నగు వారేమన్నారో చదవండి.

ద్రౌపది నవల రచయితపై చర్య తీసుకోవాలి'

ద్రౌపది నవల రచయితపై చర్య తీసుకోవాలని తెలుగు భాషా సంవర్ధన సమితి ఉపాధ్యక్షులు సూర్యారావు అన్నారు. ద్రౌపది సవలలోని కొన్ని అంశాలను తెలియజేసేందుకు విజెఎఫ్‌ ప్రెస్‌ క్లబ్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో రామాయణం, భారతానికి అత్యున్నత స్థానం ఉందని, దానిని దిగజార్చేలా నవల రచించారన్నారు. ముఖ్యంగా స్త్రీ పాత్రను కించపరిచేలా రచించిన యార్లగడ్డపై చర్య తీసుకోవాలన్నారు. భారతీయ శిక్షణా మండలి కో-ఆర్డినేటర్‌ విశ్వేశ్వరం మాట్లాడుతూ, యార్లగడ్డ రచించిన ద్రౌపది నవలలో శ్రీకృష్ణుడు, ద్రౌపదిల మధ్య సంబంధాన్ని కించపరిచారన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని సఖీ,సఖులుగా చిత్రీకరించడం దారుణ మన్నారు. ఇలాంటి సంస్కృతి దక్షిణ భారతంలో చెల్లదన్నారు. స్త్రీ జాతిలో ద్రౌపదికి ఉన్నతమైన, పవిత్రమైన స్థానం ఉందన్నారు. అటువంటి ద్రౌపదిని వేశ్యగా అభివర్ణించడం దురదృష్ణకరమన్నారు. ద్రౌపదిని వేశ్యగా చిత్రీకరించిన రచయితకు కేంద్ర సాహిత్య పురస్కారం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వెంటనే పురస్కారాన్ని రద్దుచేయాలని కోరారు. ద్రౌపది నవల ఇతర బాషలోకి అనువదించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పౌరాణిక కధలను ఉన్నవి ఉన్నట్టుగానే ఉంచాలని, వాటిలో మార్పులు తీసుకురా కూడదన్నారు. విలేకరుల సమావేశం లో న్యాయవాది, విశాఖ సరస్వతి వేదిక, విశాఖ సాహితీ సంస్థల ప్రతినిధులు భవానీశంకరుడు, డాక్టర్‌ రాజేశ్వరి శంకర్‌లు పాల్గొన్నారు.
చదివారుకదా! ఇదండీ సంగతి.
జైహింద్.
Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

అన్నగారు! ద్రౌపది నవల వ్రాసింది యార్లగడ్డ కాదు ఎర్రగడ్డ. ఇలాంటి దివాళాకోరు రచయితలను వెనకేసుకొచ్చే దిక్కుమాలిన మేధావులు కూడా ఉన్నారు. ఇది హైందవ సమాజానికే తలవంపులు.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

చాలా బాగాచెపారు సోదరా!
హైందవాన్ని మంటలో కలిపే అంతర్జాతీయకుట్రగా మీకనిపించటంలేదూ?
కలి ప్రభావం ఇంత వేగంగా మన హైందవమ్ పై పడుతుందనుకో లేదు.
అంతా ఆ దైవ లీల. అలాగనిఉపేక్షించరు మహర్షులు.
తప్పక ప్రతిఘటన ఉంటుంది.
మనం చేయగలిగినంత మనం ప్రయత్నం చేద్దాం.
ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.