సన్మార్గ వర్తులారా!
మనమీ సమాజంలో ఎందరో తల్లిదండ్రులు తమ సంతతి వలన మంచి పేరు ప్రతిష్టలు పొందుతూ పొంగిపోతూ ఉంటుండగా పాపం మరి కొందరు మాత్రం వారి పిల్లల చెడు ప్రవర్తన వలన సమాజంలో సిగ్గుతో చావలేక బ్రతుకుతుండడం చూస్తూంటాం కదా!
అట్టి దుశ్చరితులవలన కలిగే హాని చక్కగా ఈ క్రింది శ్లోకం వివరించుచున్నది. గమనింపుడు.
శ్లో:-
ఏకేనాzపి కు వృక్షేణ కోటరస్థిత వహ్నినా
దహ్యతే తద్వనం సర్వం. కు పుత్రేణ కులం యథా.
ఆ:-
చెట్టు తొఱ్ఱ నుండి పుట్టిన యగ్ని, తా
చెట్టుతోడ వనము చుట్టి, కాల్చు.
దుష్ట పుత్రకుండు దురిత వహ్నిని గొల్పి
వంశ మెల్లఁ గాల్చు పగిది నిలను.
భావము:-
ఒక చెడ్డ చెట్టు తొఱ్ఱలో నిప్పు గనుక పుట్టినచో ఆ నిప్పువలన ఆ చెట్టే కాక వనమంతాకూడా కుపుత్రుఁడు వలన వంశమంతయూ దహింపఁబడు విధముగా దహింపఁబడును.
చూచారు కదండీ! ఎంత చక్కటి ఉపమానమో. మన మంచితనంతో ఎదుటివారిలోని దుర్మార్గాన్ని రూపుమాపే ప్రయత్నంమనం చేయఁ గలిగితే కొందరు తల్లిదండ్రులనైనా దుఃఖానికి దూరం చేసినవారమౌతాంకదా.
జైహింద్
Print this post
సప్త చిరంజీవులు.
-
జైశ్రీరామ్.
సప్త చిరంజీవులు.
*శ్లో. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మ...
17 గంటల క్రితం
4 comments:
మాష్టారూ! మీరు శ్లోకం తో పాటు ఆ సందర్భం లేక,అది ఏ గ్రంథం లోనిదో చెప్తే ఇంకా బావుంటుందేమో.
వాసూ!
అనుశృతంగా నేను గ్రహించిన శ్లోకమిది.
ఏ గ్రంథంలోదో తెలియదు. తెలిసినవాటిని తప్పక తెలియఁజేస్తాను.
మాష్టారు మీ పోస్ట్ గురించి ఇన్బాక్స్ X
Subbu Srinivas కి నాకు
వివరాలను చూపించు జనవరి 9
శ్లో:-
ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా
వాస్యతే తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా!
ఆ:-
మంచి చెట్టు పూసి యెంచగా లేనంత
పరిమళంబు నింపు వనమునెల్ల.
మంచి పుత్రు డున్నమన్ననల్ కలిగించి
వంశమునకు, తాను వరలు నటుల.
http://andhraamrutham.blogspot.com/2010/01/78.html
మీ టపా లో ఇలా రాయచ్చో లేదో తెలియక ఇక్కడ అడుగుతున్నాను. తప్పైతే మన్నించండి.
ఇక్కడ సుపుత్ర: అంటే మగపిల్లవాడే అని అర్థం వస్తుందా లేక అది సార్వజనీకంగా (మానవుడు లాగా) వాడినదా. ఎందుకంటే ఇది వరకు కొంచం మేల్ డామినేషన్ ఉండేదేమో కదా. "పుత్రః వినా గతి: నాస్తి" అని అనేవారు కదా (దానికి కారణం వేరే ఉన్నా కొంచం వివక్ష ఉన్నట్టు కనిపిస్తుంది).
వాసు
chinta vijaya కి Subbu
వివరాలను చూపించు 10:16 am (3 నిమిషాల క్రితం)
నా బ్లాగుకు తప్పక మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్రాయ వచ్చును.
పుత్రుడు - పుత్రిక అనే విషయంలో మీకు కలిగిన సందేహం సముచితమే.
ఎంత కాలమైతే స్త్రీ యింటి పేరు వివాహానంతరం మారుతూ ఉంటుందో అంత కాలం వరకూ ఇది సరిపోతుంది.
ఐతే
స్త్రీ వల్ల కూడా పేరు ప్రతిష్టలు వంశానికి కలుగు తున్నా, అది పురుష సంతానమంతగా కాకపోవడమే ఈ ప్రయోగానికి హేతువౌతోంది.
మీరిలా చక్కగా అడుగుతూ ఉండడం వలన ద్విగుణీకృతోత్సాహంతో వివరించి చెప్పా లనిపిస్తుంది.
ఇలా అడిగినందుకు ధన్య వాదములు.
రామకృష్ణ.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.