గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జనవరి 2010, శుక్రవారం

ఐ న్యూస్ లో ఉదయం గ.7-30కిసెల్ఫోన్స్ గురించి నల్లమోదు శ్రీధర్ ప్రోగ్రాం.

ప్రియ ఆప్తులారా!
కంప్యూటర్ రంగంలో అనేకములైన విషయ పరిజ్ఞానం సంపాదించిన మన నల్లమోతు శ్రీధర్ మిత్రులు రేపు అనగా తే.23-01-2010 దీ ఊదయం  గం.07 - 30. కి i NEWS  TVచానల్ ద్వారా సెల్ఫోన్స్ గురించి చక్కని సమాచారాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. మనకేమైనా సందేహాలున్నట్లైతే ఫోన్ చేసి లైవ్ కార్యాక్రమంలో తెలిసుకోవచ్చునని తెలిసింది. మనమీ సమయాన్ని చక్కగా అవసరానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో నాకు తెలిసిన ఈ విషయమ్ మీ ముందుంచుతున్నాను.
జైహింద్. Print this post

3 comments:

Unknown చెప్పారు...

రామకృష్ణారావు గారు,

నమస్కారం. గత నాలుగు నెలలుగా బ్లాగులు, కూడలి, జల్లెడలకు దూరంగా ఉండడం వల్ల మీరు పోస్ట్ చేసిన విషయం తెలియలేదు. ఓ బ్లాగు మిత్రుడు ఫోన్ చేసి మీ పోస్ట్ గురించి తెలిపారు. లైవ్ ప్రోగ్రామ్ 9 నుండి 9.35వరకూ జరిగింది. అభిమానంతో ప్రోగ్రామ్ గురించి సమాచారాన్ని మీ బ్లాగులో ప్రచురించినందుకు ధన్యవాదాలండీ.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

శ్రీధర్ గారూ! మొన్నటి ప్రోగ్రాంలో కూడా చాలా ఉపయుక్తమైన విషయాలు చెప్పడం వల్ల చాలామందికి కనువిప్పు కలిగింది. చాలా చక్కని విషయాలతో జనాన్నిజాగృతం చెస్తున్నందుకు మిమ్ములను, ప్రసారం చేసిన ఐ న్యూస్ చానల్ వారినీ అభినందిస్తూ, నా కృతజ్ఞతలు తెలియఁజేసుకుంటున్నాను.
దీర్ఘాయుష్మాన్ భవ,
ఇట్లు
భవదీయుడు,
చింతా రామ కృష్ణా రావు.

Unknown చెప్పారు...

రామకృష్ణారావు గారు,

మీ ఆశీర్వచనాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.