గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జనవరి 2010, సోమవారం

ఆ చక్రపాణి ఆంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను రక్షించుఁ గాక!


శ్లో:-  
అంగుల్యాకః కవాటం ప్రహరతి కుటిలే? మాధవః, కిం వసంతః? 
నో చక్రీ, కిం కులాలో? నహి ధరణిధరః, కిం ద్విజిహ్వః ఫణీంద్రః?
నాహం ఘోరాహి మర్దీ, కిమసి ఖగపతిః? నో హరిః, కిం కపీంద్రః?
ఇత్యేవం గోపకన్యా ప్రతివచన జితః పాతువశ్చక్రపాణిః! 
 . . .  .. . . సీll
గోపకన్య:- అంగుళులను దల్పు నదిమి కొట్టె నెవరు?
చక్రపాణి:- మాధవుఁడను నేను. మఱచితివటె?
గోపకన్య:- నీవు వసంతుఁడా? 
చక్రపాణి:- నేను చక్రిని గదే.
గోపకన్య:- భువిఁ గుమ్మరివ నీవు?  
చక్రపాణి:- భూధరుండ. 
గోపకన్య:- కాళీయుఁడా నీవు?
చక్రపాణి:- కాళీయ మర్దుఁడ.
గోపకన్య:- ఖగ పతివా నీవు?  
చక్రపాణి:- కాదు. హరిని. 
గోపకన్య:- కోతి రాజు వయిన గోపిక నీకేల,
 . . . . . . . చెట్టుపై నుండుమా! చిలిపివాఁడ!
 . .  . .  . . గీll
 . . . . . . . అనుచు శ్రీహరి గోపిక లాది మఱచి
 ..  . . . . . సరస సంభాషణలఁ దేలు సమయమందు.
 . . . . . . . భ్రాంతి నాంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను
 . . . . . . . కాచి రక్షించుఁ గావుత! కరుణఁ జూపి.
ఈ శ్లోకాన్నందించిన శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.
జైహింద్.Print this post

1 comments:

రవి చెప్పారు...

అందమైన శ్లోకానికి అప్పటమైన తెనుగుసేత. ధన్యవాదాలు.

సారిక్కడ చూడండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.