గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2008, మంగళవారం

ఉత్తమ కథా సంపుటి బహుమతి దక్కించుకొన్న " పండుగ "

















కవి వతంస బిరుదాంకితులైన శ్రీ బులుసు వేంకటేశ్వర్లు గారు రచించిన " పండుగ " అనే కథ ప్రసన్న భారతి అనే మాస పత్రికలో 2002 జనవరి మాసంలో ప్రచురితమైంది. ఆ పండుగ కథ పేరుతోనే తాను రచించిన 12 వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలను చేర్చి కథా సంపుటిగా వీరు ప్రచురించారు.

మచిలీ పట్ణంలోని ప్రమిద సాహిత్య పత్రికా నిర్వాహకులు శ్రీ బి.వి.కె. రావు గారు వారి మాత్రుమూర్తి శ్రీమతి సీతా కుమారి గారి పేరున ప్రతీ సంవత్సరం ఉత్తమ సాహిత్య కథా సంపుటి కొరకు ఇచ్చే బహుమతిని ఈ సంవత్సరం ఈ పండుగ అనే బులుసు వారి కథా సంపుటికి యిచ్చారు. దీనితో పాటు ఆరు వేల రూపాయలు నగదు పారితోషకంగా యిచ్చారు. అంతటి ప్రతిభా సంపన్నులు మన బులుసు వేంకటేశ్వర్లు గారు.

వీరు వివరిస్తున్న కవి సమ్రాట్ విశ్వనాధ భావుకత మనబ్లాగు ద్వారా మీ కిదివరకే పరిచయం కావున వేరే చెప్పవలసిన పని లేదు.

ఈ పైన చూపబడిన ఛాయా చిత్రాలలో ప్రముఖ వ్యక్తి శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం గారి మేనల్లుడూ, ప్రముఖ కథా రచయిత అయిన సోమంచి రామం గారిని, ఆడిటర్ శ్రీ కె.శరత్ కుమారార్ ను కూడా చూడ వచ్చు.
జైహింద్. Print this post

2 comments:

అజ్ఞాత చెప్పారు...

ఆర్యా,

ఇలాంటి మంచి సాహితీ మిత్రులను ప్రోత్సహించి బ్లాగ్లోకానికి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యకూడదూ..!!

అరిపిరాల

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అరిపిరాలవారూ! నమస్తే.

ఆటవెలది:-
అరిపిరాల వారి ఔచిత్య యుక్తమౌ
కోర్కె నెరిగినాడ. కూర్మి గనుడు
విశ్వనాధకల్ప వృక్షవ్యాఖ్యలు నాదు
బ్లాగునందు. బులుసు ప్రతిభ తెలియు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.