భగవంతుడా నీకు జోహార్. నాకుచాలా ఆనందంగావుందయ్యా. నాకే కాదు ఆంధ్రులు యావన్మందికీ మహదానందంగా వుంది. స్వప్నికపై దాడి చేసిన ఆనర రూప రాక్షసులు ముగ్గురినీ శిక్షించావు. నీకు శతకోటి నమస్కారాలు. నా సోదరీమణులైన ఆంధ్ర మాతృమూర్తులందరికీ మహదానందాన్ని ప్రసాదించావయ్యా. ఎంతటి మహనీయుడవయ్యా నీవు.
ఐతే ఓ పరమాత్మా! నేనయితే ఇది పరిపూర్ణమైన శిక్షగా భావించను. ఎందుకంటావా? ఆ ముగ్గురు మానవ మృగాలూ గంటో ఘడియో నరకాని చూసుంటాయి. వారిదౌష్ట్యానికి గురయిన ఆ చిన్నారులు అనుభవిస్తున్న నరక యాతనను చూస్తే గుండె తరుక్కుపోతోంది వారికి కలిగించిన కష్టంతో పోలిస్తే ఆ ముగ్గురు మూర్ఖులికీ పడిన శిక్ష చాలాతక్కూవే.
ఓ భగవంతుడా! నిన్ను నేను కోరుకొనేది ఒక్కటే. న్యాయాన్ని పరిరక్షించే మహనీయులను నిత్యం కాపాడు. వారికి పరిపూర్ణాయుర్దాయాన్ని ప్రసాదించు. వారికి అన్ని విధములైన శక్తి యుక్తులనూ ప్రసాదించు.నాది మరొక్క మనవి. ఏమిటంటావా, ఇలాంటి దౌష్ట్యాలు ప్రత్యక్షంగా జరిగిన సందర్భాలలో అలాంటి నేరస్తులు ప్రత్యక్షంగా చిక్కితే సామూహిక దాడి జరిపి సమ్హరించ వచ్చును అనే చట్టాన్ని తీసుకు వచ్చేలా చెయ్యి. అప్పుడు ప్రజలు భయాన్ని వదిలి సామాజిక న్యాయాన్ని పాటించ గలుగుతారు.
యువతలో ఆత్మ స్థైర్యాని పెంచి, వారిని మంచి మార్గంలో నడిచేలాగ చేసి, దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తూ, ఆదర్శ భారతీయులుగా ప్రపంచంలో ప్రసిద్ధమయేటట్టు చెయ్యి.
ఎన్ కౌంటర్ ఎలా జరిగింది? ఇది మానవ న్యాయమా? అనే చ్ఛాందసులకు జ్ఞానోదయం కలుగజెయ్యి. పిల్లలపై దాడి జరగడంవల్ల కుమిలిపోతున్న ఆ పిల్లల తల్లి తండ్రులనూ, బంధువులనూ, దృష్టిలో పెట్టుకొని ఇంత చక్కని న్యాయాన్ని ప్రసాదించిన నీ తీర్పే చాలా చాలా గొప్పది. దీనిని కాదన్నవారుంటే రాబోయే కాలంలో అనర్ధాలు చేయబోయే వారికి ఊతమిచ్చి ప్రోత్సహించు తున్నవారే తప్ప వేరెవరూకాదని వారు ఇప్పుడే గ్రహీంచాలి. ముక్త కంఠంతో ఈనీ తీర్పును సమర్ధించాలి.
ఈనీ తీర్పుకు మరొక్కసారి నా జోహార్.
జైహింద్.
.
Print this post
సప్త చిరంజీవులు.
-
జైశ్రీరామ్.
సప్త చిరంజీవులు.
*శ్లో. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మ...
6 రోజుల క్రితం
1 comments:
నమస్తే... మీరు 100% కరెక్టు. కాని మీ అంతలా నేను ఆనందించడం లేదు. కారణం వాళ్లు సుఖమైన చావు చచ్చారు. కొంచం నిరుత్సాహంగానే ఉంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.