గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, డిసెంబర్ 2008, మంగళవారం

కర్మణా జాయతే భక్తిః. మేలిమి బంగారం మన సంస్కృతి 40

కర్మ > భక్తి > జ్ఞానం > ముక్తి.
మనము అందరం కూడా ముక్తి పొందాలనే కోరుకుంటూంటాం. ఐతే ఆముకిని సాధించడం కోసం అనేక మార్గాల ననుసరిస్తాం.
శ్రీ కృష్ణ భగవానుడు గీతలో సూచించిన ముక్తి మార్గాన్ని పరిశీలిస్తే అది చాలా సులభము. సుఖతరము. అది యేమిటో చూద్దామా.
శ్లో:-కర్మణా జాయతే భక్తిః
భక్త్యా జ్ఞానం ప్రజాయతే
జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః
ఇతి శాస్త్రార్థ సంగ్రహః.
తే:-కర్మ వలననె భక్తి తా కలుగు నిజము.
భక్తి వలననె జ్ఞానంబు ప్రభవ మందు.
ముక్తి మార్గము జ్ఞానము . ముక్తి సుఖము.
గీత శాస్త్రార్థ సంగ్రహ స్ఫూర్తి గనుడు.
మానవుడు ముక్తిని గోరితే అది నిష్కామ కర్మ మార్గము ద్వారానే సాధ్యమగును. కర్మ వలన భక్తి ప్రభవించును. భక్తి వలన జ్ఞానము ప్రభవించును. జ్ఞానము వలననే ముక్తి ప్రాప్తించును. అట్టి ముక్తి శాశ్వతానంద దాయకము. దుఃఖాతీతము. కాన మనము కూడా నిష్కామ కర్మ నాచరించుట ద్వారా భక్తి > జ్ఞాన > ముక్తులను పొందడాని కుపేక్ష యెందుకు. సత్కర్మలనాచరిద్దాం.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.