గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, డిసెంబర్ 2008, మంగళవారం

ధారణాద్ధర్మ మిత్యాహుః. మేలిమి బంగారం మన సంస్కృతి 44

ధర్మము - దాని నిర్వచనము - ధర్మార్థులకు సూచన.
ధర్మంగా ప్రవర్తించండి. ఇది మీకు ధర్మమేనా? ధర్మో రక్షతి రక్షితః అని అనేక విధములుగా నిత్యం ధర్మ ప్రస్థావన మనమధ్య చోటు చేసుకోవడం మనకు నిత్యానుభవమే. ఐతే ఆ ధర్మాన్ని ఒక శ్లోకంలో చక్కగా నిర్వచించారు. చూడండి.
శ్లోకము:-
ధారణాద్ధర్మ మిత్యాహుః
ధర్మో ధారయతే ప్రజాః
యత్స్యాద్ధారణ సమ్యుక్తః
ధర్మ యితి నిశ్చయం.
:-
ధారణమున చేసి ధర్మమనబడును.
ధర్మమే ప్రజలను ధాత్రి మోయు.
ధారణమున యేవి తప్పక ధర్మమున్
నిలుపు. నవియె ధర్మ ములన నగును.
భావము:-
ధరించేది కావున ధర్మ మనబడుచున్నది. ధర్మమే ప్రజలను ధరిస్తూ వుంటుంది. ఏది సంఘాన్ని కట్టుబాట్లలో నిలుపుతూ వుంటుందో అదే ధరమమని చెప్ప బడుతోంది.
ధర్మాచరణ విషయంలో మనం కఠినాతి కఠినమైన నిర్ణయాలు శాశ్వితమైన సాంఘిక సంక్షేమం కొఱకు తీసుకోవడం అత్యవసరమని చెప్పక తప్పదు. అదే ధర్మము. అదే సంఘాన్ని శాశ్వితంగా నియమ బద్ధంగా నడుపుతుంది. కావుననే అది ధర్మమయింది. మనం కూడా ధర్మ బద్ధమైన సంఘంలో నిశ్చింతగా జీవించుతూ, మనతోటివారూ మనలాగే చక్కగా జీవించడం కోసం మనమూ ధర్మ బద్ధులమై ప్రవర్తించడం సముచితము. మరి మీరేమంటారు?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.