గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, డిసెంబర్ 2008, శనివారం

కామయే దుఃఖ తప్తానాం ప్రాణినా మార్తి నాశనం..మేలిమి బంగారం మన సంస్కృతి 37

జీవ కారుణ్యము:-
మహనీయులకూ, మహర్షులకూ నిలయము మన భరత భూమి. మహనీయులెప్పుడూ పరోపకారార్థ జీవులనే విషయం భాగవతం లోని ఈ క్రింది శ్లోకంలో మనం చూడవచ్చు.
శ్లో:-నత్వహం కామయే రాజ్యం.
న స్వర్గం, నా పునర్భవం.
కామయే దుఃఖ తప్తానాం
ప్రాణినా మార్తి నాశనం.
క:-కోరను రాజ్య సుఖంబును.
కోరను స్వర్గంబు నిజము. కోరను ముక్తిన్.
కోరెద దుఃఖార్తుల దరి
చేరి, తపన బాపి, రక్ష సేయుండనుచున్.
భావము:-భారతీయుడు తన హృదయములో ఇలా అనుకొంటున్నాడు. నేను రాజ్య సంపద కోరను. స్వర్గము ప్రాప్తింప జేయమని కోరను. జన్మ రాహిత్యము వాంఛింపను. సంసార దుఃఖ సంతప్తులైయున్నవారికడనుండి వారి ఆర్తిని బాపి, వారి దుఃఖమును పోగొట్టమని మాత్రము కోరుదును.
చూచారా! ఎంతటి నిస్వార్థమైన కోరికో! అదీ మన సంస్కృతి. అదీ మన భారతీయత. అదీ మన మహోన్నత స్వభావము. ఇంతటి మహనీయ భావ పూర్ణ దేశీయుల మగుట మన పూర్వ జన్మ తపః ఫలము కాక మరొకటి కాదు కదా? ఇంత చక్కటి శ్లోక సంపదను మనం కంఠస్థం చేయకుండా ఉపేక్షించడం మనకి ధర్మమేనా? ఆలోచించండి. ఆలోచించి ఏంచెయ్యాలో చేద్దామా?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.