గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, డిసెంబర్ 2008, శుక్రవారం

పీడయేన్న స్నుషాదికం.మేలిమి బంగారం మన సంస్కృతి 41

పిల్లల మనస్తత్వాన్ని తెలుసుకొని మసలుకోవలి.
చాలా మంది తల్లి దండ్రులు తమ పిల్లలపై మితి మీరిన ప్రేమతో, అతి చనువువల్ల, చిన్న తనం నుంచీ వారు పెద్దవారౌతున్నా గాని నోటికొచ్చినట్లు తిట్టుతూ, కొట్టుతూ ఉంటారు. జ్ఞాన తెలిసి వచ్చిన పిల్లలను అలా చెయడం సరయిన పద్ధతి కాదు. ఈ విషయాన్ని తెలిపే ఒక శ్లోకముంది చూడంది.
శ్లో:- షోడశాబ్దాత్పరం పుత్రం
ద్వాదశాబ్దాత్ పరం స్త్రియం
న తాడయేద్దుష్ట వాక్యైః
పీడయేన్న స్నుషాదికం.
తే:- మిత్ర సముడు పదారేండ్ల పుత్రుడగును.
మాతృసమ పది రెండేండ్ల పుత్రికయును.
కొట్ట రాదిక వారిని తిట్ట రాదు.
కోడలిని,పర స్త్రీలనూ కొట్ట రాదు.
భావము:- పదహారేళ్ళు దాటిన పుత్రులను, పండ్రెండేండ్లు దాటిన పుత్రికలను, తిట్ట రాదు. పరుష వాక్యములతో బాధించనూ కూడదు. కోడళ్ళు మొదలైన స్త్రీ జనములను పీడించ కూడదు, బాధించ కూడదు.
చూచారు కదా! ఎంత చక్కగా మనస్తత్వ శాస్త్రాన్ని ఆకళింపు చేసుకొని యదార్థం వివరించాడో! ఈ విషయం తెలియ నప్పుడు పిల్లల్ని కొట్టమంటే, తిట్టామంటే అర్థముంది. ఇప్పుడు తెలిసింది కదా! ఇటుపైనిక అలా చేయడం భావ్యం కాదు కదా? మనసెరిగి మసలుకొందామా మరి?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.