గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

6, డిసెంబర్ 2008, శనివారం

టీ.వీ. 9 కి విన్నపము.

టీ.వీ 9 కి నా అభినందనలు. వార్తలను ఎప్పటికప్పుడు వెన్వెంటనే చిత్రీకరించి ప్రేక్షకులకు ప్రత్యక్ష పరుస్తున్నందుకు నా అభినందనలు. చాలా గొప్ప పేరున్న టీ.వీ చానళ్ళలో మీ టీ.వీ 9 ఒకటి సందేహం లేదు. ఐతే
అదే సమయంలో మీప్రత్యేక ప్రసార సరళిని అభిశంసించకుండా ఉండలేను. మీ ప్రసారాలు సామాజికుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలాగుండకూడదుకదా. మీకనిపిస్తుందో లేదో తెలియదు కాని, మీరు ప్రసారం చేసే వార్తలు సామాజిక సంక్షేమం దృష్ట్యా భయావహ వార్తలు కొండంతలు గోరంతలుగాను, ఉత్సాహావహ వార్తలు గోరంతలు కొండంతలుగాను ప్రసారం చేయడం మన యింగిత జ్ఞానానికి నిదర్శనం.
ఈ రోజు నేను గమనించిన వార్తల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మగ పిల్లలకు వివాహాల విషయంలో మీరు గోరంతలు కొండంతలుగా చేసి గంటల తరబడి చెప్పిందే చెప్పుతూ, అసలే అగమ్య గోచర స్థితిలోనున్న వారికీ, వారి తల్లిదంద్రులకూ వేదనను కలిగించుతున్న విషయం మీకు తోచక పోవడం విచారకరం. ఆ సమస్య కొండంత ఉన్నప్పటికీ మీరు గోరంతలుగా మాత్రమే చెప్పినచో సరిపోతుందికదా.
ప్రజలు జీవన పోరాటంలో తబ్బిబ్బౌతుంటుంటే మీ వార్తలు వారిని నిరాశా నిస్పృహలు కలిగించి, చివరికి ప్రాణం మీదకి కూడా తెచ్చుకొనేలా చేసే ప్రమాదమున్న సంగతి మీకెందుకు తోచటంలేదో అర్థం కావటం లేదు.
దయతో ఈ విధమైన మీ ప్రసార శైలికి స్వస్తి చెప్పి, ప్రజల కండగానిలబడగలందులకు వినయ పూర్వకంగా మిమ్మల్ని సమాజ శ్రేయస్సు దృష్ట్యా అర్ధిస్తున్నాను.
ఈ నా అభిప్రాయం జన బాహుళ్యం యొక్క అభిప్రాయంగా గుర్తించ గలరు. మీ వార్తలు కారణంగా ఏవొక్కరూ బలి కాకూడదనే నేనింతగా అర్ధిస్తున్నాను. వార్తా ప్రసారం చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రజా సంక్షేమాన్ని కోరుతూ ప్రజా బాహుళ్యం మన్ననలకు పాత్రులౌదరని భావిస్తున్నాను.
కృతజ్ఞతలు.
జైహింద్.
చింతా రామ కృష్ణా రావు.
ఆంధ్రామృతం బ్లాగ్.
తేదీ:05-12-2008.

Print this post

8 comments:

Kathi Mahesh Kumar చెప్పారు...

TV9 ఓక న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. అంటే సరదాగా వార్తలుచూసే ఛానలన్నమాట. సరైన వార్తలకోసం ETV2 చూసి వాటినే మరింత హాయిగా చూడ్డానికి TV9 చూడాలి. అలా కాకుండా మీరు సీరియస్ గా చూసారనుకోండి ఇలాగే వుంటుంది.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

మహేష్ కుమార్ గారూ! ఈ.టీ.వీ. 2 లాగే టీ.వీ. 9 కూడా న్యూస్ చానలే. మనకందుబాటులోనున్న యే చానలయినా సామాజిక సంక్షేమాన్ని ఆలోచించాలి కదండీ. మీరన్నట్టు ఎంటర్ టైన్మెంట్ చానలనుకోండి. నచ్చితే చూస్తాము, నచ్చకపోతే మానెస్తాము. న్యూస్ చానలనే సరికి ఎక్కడెక్కడ ఏయే వార్తలొస్తున్నాయోననే ఉత్కంఠాతో చూడబోతే అది మనలో భయాందోళనలు సృష్టించేటంత అతిగా ఉండకూడదన్నాను. తప్పంటారా?

సుజాత వేల్పూరి చెప్పారు...

రామకృష్ణా రావు గారు, మీతో గొంతు కలుపుతున్నాను. మెరుగైన సమాజం కోసం కృషి చేస్తున్నామని ప్రకటించుకుని ఈ చానెల్ చేస్తున్నదేమిటో ఒక్కసారి వార్ని వారు ప్రశ్నించుకోవాలి. అందుకే నేను వార్తలు కావాలంటే మహేష్ చెప్పినట్టు ఈటివీ 2, టైం పాస్ కావాలంటే ఈ చానెల్ చూస్తున్నాను. ఈ చానెల్ చాలా తెలివిగా "మోడల్స్ జీవన శైలి చూడండి", అంటూ వారి అర్థ నగ్న ప్రదర్శనలు, "యువత ఎలా చెడిపోతోందో చూడండి" అంటూ పబ్బులు డిస్కోల ప్రదర్శనలు, "ఇది న్యాయమా" అంటూ ఇంటర్నెట్ కెఫేల్లో రహస్య కెమెరాలు చిత్రీకరించిన దృశ్యాలు, వ్యభిచార రాకెట్లు చేదించే మిషతో ఆ దృశ్యాలు వగైరా అలవోగ్గా చూపిస్తారు. వీరికి ఇంత చిన్న విన్నపం పనికి రాదు. అందరం కలిసి పెద్ద విన్నపం తయారు చేయాలి. ఆకతాయిలు పంపిన బెదిరింపు ఈమెయిళ్లను హెడ్ లైన్స్ లో ప్రసారం చేసి...రేపే తీవ్రవాదుల దాడి హైదరాబాదులో వివిధ ప్రాంతాల్లో....అని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయడంలో కూడా వీరిది అందె వేసిన చేయి.

MURALI చెప్పారు...

ఆ కార్యక్రమంలో స్కిల్ లెస్ ఉద్యోగులని తీసేస్తున్నారని ప్రసారం చేసారు. కానీ నిజానికి మా కంపెనీ లో A+ grade ఉన్న వాళ్ళని కూడా తీసేసారు. ఇది ఆర్ధికమాంధ్యం వలన వచ్చిన ముప్పేతప్ప కేవలం స్కిల్ లెస్ వాళ్ళని తీసేయటం కాదని ఆ చవటదద్దమ్మలకి అర్ధమయ్యేలా ఎవరన్నా చెప్పండి pleaseeeeee.

krishna rao jallipalli చెప్పారు...

అవును. tv9 గోరంతలని కొండంతలు చేస్తోంది. కొన్ని అప్రాదన్యత విషయాలకి కలరింగ్ ఇస్తోంది. ఆ మద్య ఓ టి.వి చానల్ వారి ఆట ప్రోగ్రాం డాన్సర్ ఆమె డాన్స్ మాస్టర్ (వీడొక పిల్ల పోరగాడు) విషయంలో కూడా తలనొప్పి పుట్టించింది. ఈ ఇద్దరు ఏమన్నా పుడింగిలా.. కాదె అయినా సరే దాన్నొక international burning ఇష్యూ లాగా treat చేసి time అంతా waste చేసింది. ఇంకొక విషయం. దీంట్లో ఉండే రజని కాంత్ అనే ఆయన... జానెడు జవాబు కి ఈయన గారు కిలో మీటర్ ప్రశ్న వేస్తారు. tv5, ntv better అనిపిస్తున్నాయి.

Unknown చెప్పారు...

మొన్న tv9 ప్రసారం చేసిన న్యూస్ లో jan 13 న ఉగ్రవాదులు మళ్ళి రెచ్చి పోబోతున్నారా అంటు ఇంతవరకు జరిగిన బాంబు పెళ్లుల్లు alternate months లో 26 , 13 తారికులలోనే జరిగాయని అందు చేత రాబోయే january 13 న జనాళ్ళ గుండెల్లో భోగిమంటల్ని ఉగ్రవాదులు రగల్చ బోతున్నరంటు ప్రజల్లో భయందోనలు రేకెత్తించే వార్త ప్రసారం చేసింది.ఇంక రజనీకాంత్ అయితే తన అభిప్రాయాన్ని వక్తల మీద రుద్ది'' అలా అని మనం భావించొచ్చు అంటారా ?''అంటుంటాడు.నేరం జరిగిన ప్రదేశం లో వున్నా విలేఖర్ని ఈ హత్య కి అక్రమ సంభంధం కారణం అయ్యి ఉండొచ్చని మనం భావించోచ్చ అంటూ అడుగుతాడు.దానికి అ విలేకరి క్రమమో, అక్రమమో పోలీస్ investigation లో బయట పడుతుంది గాని మొత్తానికి ఏదో సంభంధం వునట్టు గానే వుంది అంటే ,thank u శ్రీనివాస్ మిరక్కడే వుండి మాకు తాజా పరిస్తితి ని వివరిస్తూ ఉండండి అంటే ఆ శవం కుళ్ళి పోయే దాక అక్కడే వుండమన?

Kathi Mahesh Kumar చెప్పారు...

@చింతా.రామకృష్ణారావు: చాలా మటుకూ హిందీ వార్తా ఛానళ్ళు మన తెలుగులో TV9 ‘భాద్యతాయుతమైన జర్నలిజం’, ‘వార్తాఛానళ్ళ సామాజిక బాధ్యత’ లాంటి ఆలోచనలపైన ఎత్తికొట్టే చెప్పుదెబ్బల్లాంటి ఉదాహరణలు.

వీటిని క్రియాశీలకంగా బ్యాన్ చెయ్యించడానికైనా మనం ప్రయత్నించాలి. లేకపోతే మనమూ వాటిని డోర్ మ్యాట్ ఛానళ్ళలాగానే ఉపయోగించి వాటికి తగిన గౌరవం అందించాలి.

నాకు తెలిసినంత వరకూ TV9ని సీరియస్గా తీసుకునే ప్రజలు చాలా తక్కువే.మా పల్లెలోకూడా సాక్షి,TV9 లని సరదాగా చదవడం చూడ్డం జరుగుతుంది. నిజంగా వార్తలు కావాలంటే మిగతా వాటిని చూస్తారు.

అజ్ఞాత చెప్పారు...

మనం ఒక్కళ్ళమే చేస్తే సాధ్యమవుతుందా అని అనుకోకుండా ’విలువలు పాటించని చానల్స్ ని బహిష్కరించాలి’.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.