గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, డిసెంబర్ 2008, సోమవారం

సుఖస్యానంతరం దుఃఖం. మేలిమి బంగారం మన సంస్కృతి 28.

దుఃఖ స్ఫృహను వీడ గలిగితే సుఖం లభిస్తుంది.
జీవులకు సుఖ దుఃఖములు అనివార్యము. ఈవిషయము నీ క్రింది శ్లోకమున చూద్దాము.
శ్లో:-సుఖస్యానంతరం దుఃఖం
దుఃఖస్యానంతరం సుఖం.
ద్వయమేతద్ధి జంతూనాం.
అలంఘ్య దివ రాత్రవత్.

తే:-సుఖము పిదపను దుఃఖంబు. సుఖము దుఃఖ
మునకు పిదపను, వచ్చును. పుడమి పైన
రాత్రి బవలట్లు. తప్పదీ ప్రాప్త ఫలము.
జీవు లకును. నరుడు దుఃఖ స్పృహను వీడు.

భావము:-అనివార్యమగు సుఖ దుఃఖములు అన్ని జీవులకూ అహర్ నిశలవలె సామాన్యము. తెలివైన మానవుడు సుఖమయ జీవనాపేక్ష కలవడై, దుఃఖానికి చాలా దూరంలో ఉంటాడు. అలా వుండడం వల్ల అయురారోగ్యాలు పుష్కలంగా లభిస్తాయి.
మనమూ సాధ్యమైనంతవరకూ దుఃఖ మన్నదే తెలియక, నిత్య సంతోషంతో వుందామా!
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.