గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2025, గురువారం

అసుర్యా నామతే లోకా. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

మంత్రము.  అసుర్యా నామతే లోకా అంధేన తమసావృతాః

తాగ్ంస్తే ప్రేత్యాభిగచ్చన్తియేకే చాత్మహనో జనాః. (ఈశావాస్యోపనిషత్ ౩)

తే.గీ.  రక్కసుల లోకముకు చూడ నిక్కముగను

గాఢమైనట్టి చీకటిన్ గప్పి యుండు,

నాత్మహంతులందుదు రట్టిలోక

మును గనంగను నాత్మహననము వలదు.

భావము.  రాక్షసుల యొక్క లోకాలు గాఢమైన అంధకారముతో అంటే చీకటితో 

ఉంటాయి. ఆత్మహంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.