గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జనవరి 2025, బుధవారం

చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత తేటగీతి గర్భ చంపకమాల... శ్లోకానువాదము.

జైశ్రీరామ్.

నాకు తన చిత్రకవితతో పరమానందమునందించిన 

మా తమ్ముఁడు చి. మరుమాముల దత్తాత్రేయశర్మకు 

ఆనందపారవశ్యంతో అమ్మవారి ఆశీస్సులు అర్ధిస్తున్నాను.

*  *  *

చిత్రకవి శ్రీ మరుమాముల దత్తాత్రేయశర్మ కృత శ్లోకానువాదము.

శ్లో.  యత్నో హి సతతం కార్యః  -  తతో దైవేన సిద్ధ్యతి|

దైవం పురుషకారశ్చ  -  కృతాన్తేనోపపద్యతే||

👇🏼

తేటగీతి గర్భ చంపకమాల.

👇🏼

సతతము కార్యముల్ సలుప జాలుట ధర్మము సజ్జనాళికిన్

వ్రతముగ దైవమే బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధికిన్

హితమగు సత్కృతుల్ జనులకీగతి సేమము సత్వశక్తియున్ 

జతగొని పూర్తియౌ మనుజ శక్తియు దైవము మంచిగూర్చుచున్

👇🏼

చంపకమాల గర్భస్థ  తేటగీతి.  

👇🏼

సలుప జాలుట ధర్మము సజ్జనాళి

బలము భాగ్యములిచ్చును ప్రాప్త సిద్ధి

జనులకీగతి సేమము సత్వశక్తి

మనుజ యత్నము దైవము మంచిగూర్చు.

భావము.  

👇🏼

తమ ఇష్టసిద్ధికి నిరంతరం ప్రయత్నం చేయవలసినదే. 

అప్పుడు దైవానుగ్రహం ఫలిస్తుంది. దైవానుగ్రహం, మానవప్రయత్నం, 

కాలం వల్లనే సిద్ధిస్తాయి. 

👌🏼

చిరంజీవి తమ్మునకు ఆ జగన్మాత ఆశీస్సులు నిండుగా ఉండుగాక.

పాఠకులు ఈ చిత్రకవితపై తమ అభినందనలందఁజేయఁగలరు.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.