గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జనవరి 2025, శుక్రవారం

భక్తజనులైన ఆంధ్రామృత పాఠకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు.

 జైశ్రీరామ్.

ఓం నమో నారాయణాయ.

శ్లో.  కృత్వోత్సవం తథాభూతం - ఏకాదశ్యాం విశేషతః

విశంతి మోక్షం తస్మాత్‌ - సః మోక్షోత్సవ ఇతీర్యతే.

తే.గీ.  శ్రీకరంబౌచు నేకాదశీ దినంబు

వచ్చు పుష్యశుద్ధమునందు వామనుండు

ముక్తిదుండయి దర్శనమునొసగుటను

వత్తు రా దేవతల్ తాము భక్తిఁ గనఁగ.

భావము.  ఈ ఉత్సవానికి మోక్షోత్సవమనే పేరు కూడా ఉంది. దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలవడం జరిగింది.

ఈ కారణంగా ఉత్తర ద్వారదర్శనం పరమాత్మ నేడనుగ్రహిస్తాఁడు. 

కం.  మదులందిత్తరముఖమున

విధిజనకునిఁ జూచువారి విషయమునందున్

వ్యధలు నశించును, శుభములు

సుధవలె మహితముగ వచ్చు శోభను గూర్చున్.

కావున మనసా ఆశ్రీమన్మహావిష్ణువును దర్శించుకొనెడి మీకందరికీ శుభాకాంక్షలు తెలియఁజేస్తోంది ఆంధ్రామృతం.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.