గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

17, జనవరి 2025, శుక్రవారం

అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  అనేక శాస్త్రం బహు వేదితవ్యమ్ - అల్పశ్చ కాలో బహుశ్చ విఘ్నాః ।

యత్ సారభూతం తదుపాసితవ్యం - హంసో యథా క్షీరమివామ్బుమధ్యాత్ ॥

తే.గీ.  ఎఱుఁగ వలసిన గ్రంథము లెన్నొ కలవు,

కాలమల్పము, విఘ్నముల్ కలుఁగుచుండు,

క్షీరనీరంబులను హంస క్షీరముగొను,

మంచినట్టులే గొనవలె మనము, నరుఁడ!

భావము.  చాలా గ్రంథాలు ఉన్నాయి, తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి, 

కానీ సమయం పరిమితంగా ఉంది. మరియు అనేక అడ్డంకులు ఉన్నాయి. 

కాబట్టి మనం హంస యే విధముగా క్షీరనీరముల మిశ్రమము నుండి క్షీరమును 

మాత్రమే గ్రహించునో అట్టులే మనము కూడా సారవంతమైనవాటినే 

గ్రహించవలెను.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.