గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

14, జనవరి 2025, మంగళవారం

హారతి కళ్ళకు అద్దుకోకూడదని ఎలా అనగలరు? బ్రహ్మశ్రీ సంతోష్ ఘనపాఠి గారి స్పష్టమైన సోపపత్తిక వివరణము. #Hindudharmakshetram #SantoshGhanapathi

జైశ్రీరామ్.
బ్రహ్మశ్రీ సంతోష్ కుమారా! మీకు నిరంతరమూ ఆవేదమాత కరుణాకటాక్షాలు లభిస్తూనే ఉండుగాక. ఆ పరమేశ్వరి సనాతనమైన తన హైందవ ధర్మపరిరక్షణను తానే పలుపలు రూపాలలో ప్రత్యక్షమగుచు అనేకప్రక్రియలలో మానవులకు అర్థమయేలా ప్రబోధిస్తూ నిద్రాణమైన ఆత్మశక్తిని ప్రేరేపిస్తూ కర్తవ్యాంశాలను ప్రబోధిస్తూ ఉంటుందనుటకు మీరు చేయుచున్న ఈ సుస్పషటమైన వివరణతో కూడిన ప్రబోధలే నిదర్శనము. హిందువుగా పుట్టినందులకు మీరు హైందవ ధర్మాన్ని రక్షించుటకు యథాశక్తి కృషి చేస్తున్నారు. మిమ్ములను మీకుటుంబాన్ని ఆ పరమేశ్వరి ఆయురారోగ్యానందైశ్వర్యాలతో శతాధికవర్షములు జీవింపచేయుగాక అని నేను ప్రార్థిస్తున్నాను. మీ దర్శన భాగ్యాన్ని పొందడానికి కూడా యోగం సమకూడాలి. ఏమో అది నాకుందో లేదో ఆ అమ్మకే యెఱుక.
పూజనుద్దేశించి శివ ఉమా సంవాదములో 

మంత్ర హీనం, క్రియాహీనం యత్ కృతం పూజనం హరేః
సర్వం సంపూర్ణతామేతి కృతే నీరాజనే శివే.

కృత్వా నీరాజనం విష్ణోః దీపావల్యా సుదృశ్యయా
తమో వికారం జయతి జితే తస్మింశ్చ కో భవః.

కోటయోర్బ్రహ్మ హత్యానా మగమ్యాగమ కోటయః
దహత్యాలోకమాత్రేణ విష్ణోస్సారాత్రికం ముఖమ్.

యచ్చ దీపస్య మాహాత్మ్యం పూర్వం లిఖితమస్తితతః
ద్రష్టవ్యం సర్వ మత్రాపి ప్రాయేణాభేదతోనయోః

అతస్సాదరముత్థాయ మహానీరాజనం ద్విధం,
ద్రష్టవ్యం దీపమత్సర్వైః వంద్యం ఆరాత్రికంచ యత్.

ధూపంచారాత్రికం పశ్యేత్ కరాభ్యాంచ ప్రవందతే,
కులకోటిం సముదృత్యయాతి విష్ణోః పదమ్.

నీరాజనంచ యః పశ్యేత్ దేవదేవస్య చక్రిణః 
సప్త జన్మని విప్రస్స్యా దంతేచ పరమం పదమ్.

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.