గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

9, జనవరి 2025, గురువారం

సత్యమేవేశ్వరో లోకే . ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  సత్యమేవేశ్వరో లోకే - సత్యే ధర్మాః సదాశ్రితాః

సత్య మూలాని సర్వాణి - సత్యాన్నాస్తి పరం పదమ్.

తే.గీ.  సత్యమేదైవమీసృష్టి, నిత్యమిదియె,

సత్యమున జేరు ధర్మముల్, శాశ్వతముగ,

సత్యమే మూలమన్నైంట, సరస హృదయ!

సత్యమును మించి లేవయ్య! సత్యపాల!

భావము.  ఈ లోకంలో సత్యమే భగవంతుడు. సత్యాన్ని ధర్మాలు అన్నీ ఎల్ల వేళలా 

ఆశ్రయించుకుని ఉంటాయి. సత్యమే అన్నిటికీ మూలం. సత్యాన్ని మించినది 

ఏమీ లేదు.

జైహింద్.


Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.