గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జనవరి 2025, శనివారం

ఆగమాపః ప్రజా దేశః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.   "ఆగమాపః ప్రజా దేశః  -  కాలః కర్మ చ జన్మ చ.!

ధ్యానం మంత్రోఽథ సంస్కారో,  -  దశైతే గుణహేతవః".!!  (మనుస్మృతి)

తే.గీ.  దైవము, పరిసరము, పని, త్రాగు నీరు,

దేశమును, జన్మ, కొనునుపదేశ, మంత్ర,

ధ్యాన విషయమున్, మనుకాల మను పదియును,

వ్యక్తి గుణముల మూలముల్, భక్తిపూర్ణ! 

భావము.  ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, 

జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, 

ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము. 

ఈ పదిన్ని వ్యక్తులలోని గుణము లకు కారణము లగుచున్నవి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.