గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

30, జనవరి 2025, గురువారం

సుందరం,ధన్యతా,జిత క్రోధ.విరోధాబాస,గర్భ"శ్రీధామ"వృత్తము, రచన..... శ్రీవల్లభ.

జైశ్రీరామ్.

సుందరం,ధన్యతా,జిత క్రోధ.విరోధాబాస,గర్భ"శ్రీధామ"వృత్తము,  రచన..... శ్రీవల్లభ.
ముదము నొందు సత్యమే!మోదము శివం సుందరమ్!మునికుల వధాన్యం ధన్యమ్!
కుదురు పరమ నిష్ఠయున్!క్రోధము విడుం వేగమున్!గొనకొను సదా నందంబున్!
చెదరు వెతలు శీఘ్రమున్!చేదగు నపార్ధంబులున్!చెనకును విరోధా బాసమ్!
సుధలు మెదలు లోకమున్!శోధిలు సు సేవారతిన్!చొను విభుత శ్రీ ధామంబున్!

సృజనాత్మక, గర్భ స్రవంతి యందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు.26.అక్షరములుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

1.గర్భగత"ముదము"వృత్తము,

ముదము నొందు సత్యమే!
కుదురు పరమ నిష్ఠయే!
చెదరు వెతలు శీఘ్రమున్!
సుధలు మెదలు లోకమున్!

అభిజ్ఞా ఛందము నందలి.బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 9.అక్షరములుండును,

2,గర్భగత"-కుదుర"నృత్తము,

మోదము శివం సుందరమ్!
క్రోధము విడుం వేగమున్!
చేదగు నపార్ధంబులున్!
శోధిల  సు సేవా రతిన్!

అభిజ్ఞాఛందము నందలి.అనుష్టుప్ఛందము"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు 8,అక్షరములుండును,,

3.గర్భగత"చేదగు"వృత్తము,

మునికుల వధాన్యం ధన్యమ్!
గొనకొను సదానందంబున్!
చెనకును విరోధాభాసమ్!
చొను విభుత శ్రీధామమున్!

అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"9"అక్షరము లుండును,

4,గర్భగత"శోధిలు"వృత్తము,

ముదము నొదవు సత్యమే!మోదము శివం సుందరమ్!
కుదురు పరమ నిష్టయున్!క్రోధము విడుం వేగమున్!
చెదరు వెతలు శీఘ్రమున్!చేదగు నపార్ధంబులున్!
సుధలు మెదలు లోకమున్!శోధిల సు సేవా రతిన్!

అణిమాఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

5.గర్భగత"న హింసా"వృత్తము,

మోదము శివం సుందరమ్!ముదము నొదవు సత్యమే!
క్రోధము విడుం వేగమున్!కుదురు పరమ నిష్ఠయున్!
చేదగు నపార్ధంబులున్!చెదరు వెతలు శీఘ్రమున్!
శోధిల సు సీవా రతిన్!సుధలు మెదలు లోకమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును

6,గర్భగత"శీఘ్రం,వృత్తము,

ముదము నొదవు సత్యమే!మునికుల వధాన్యం ధన్యమ్!
కుదురు పరమ నిష్ఠయున్!,గొనకొను సదానందంబున్!
చెదరు వెతలు శీఘ్రమున్!చెనకును విరోధాభాసమ్!
సుధలు మెదలు లోకమున్!చొను విభుత శ్రీ ధామమున్!

అణిమా ఛందము నందలి"ధృతి ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునఖు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

7.గర్భగత"మోక్షం"వృత్తము,

మునికుల వధాన్యం ధన్యమ్!ముదము నొదవు సత్యమే!
గొనకొను సదానందంబున్!కుదురు పరమ నిష్ఠయున్!
చెనకును విరోథా భాసమ్!చెదరు వెతలు శీఘ్రమున్!
చొను విభుత శ్రీధామమున్!సుధలు మెదలు లోకమున్!

అణిమా ఛందమునందలు"ధృతి"ఛందము లోనిది
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,

8.గర్భగత"వధాన్యతా"వృత్తము,

మోదము శివం సుందరమ్!మునికుల వధాన్యం ధన్యమ్!
క్రోధము విడుం వేగమున్!గొనకొను సదా నందంబున్!
చేదగు నపార్ధంబులున్!చెనకును విరోధా భాసమ్!
శోధిలు సు సేవా రతిన్!చొను విభుత శ్రీ ధామమున్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము  లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,

9.గర్భగత"వెతలు"వృత్తము,

మునికుల వధాన్యం ధన్యమ్!మోదము శివం సుందరమ్!
గొనకొను సదా నందంబున్!క్రోధము విడుం వేగమున్!
చెనకొను విరోధాభాసమ్!చేదగు నపార్ధంబులున్!
చొను విభుత శ్రీ ధామమున్!శోధిలు సు సేవా రతిన్!

అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17,అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,

10,గర్భగత"శోభ్యతా"వృత్తము,

మోదము శివం సుందరమ్!ముదము నొదవు సత్యమే!మునికుల వధాన్యం ధన్యమ్!
క్రోధము విడుం వేగమున్!కుదురు పరమ నిష్ఠయున్!గొనకొను సదానందంబున్!
చేదగు నపార్ధంబులున్!చెదరు వెతలు శీఘ్రమున్!చెనకును విరోధా బాసమ్!
శోధిల సు సేవా రతిన్!సుధలు మెదలు లోకమున్!చొను విభుత శ్రీ ధామమున్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,

11.గర్భగత"సుందరం"వృత్తము,

ముదము నొదవు సత్యమే!మునికుల వధాన్యం ధన్యమ్!మోదము శివం సుందరమ్
కుదురు పరమ నిష్టయున్!గొనకొను సదానందంబున్!క్రోధము విడుం వేగమున్!
చెదరు వెతలు శీఘ్రమున్!చెనకును విరోధాభా సమ్!చేదగు నపార్ధంబులున్!
సుధలు మెదలు లోకమున్!చొను విభుత శ్రీ ధామమున్!శోధిల సు సేవారతిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,10,19,అక్షరములకు చెల్లును,

12.గర్భగత"ధన్యతా"వృత్తము,

మునికుల వధాన్యం ధన్యమ్!ముదము నొదవు సత్యమే!మోదము శివం సుందరమ్!
గొనకొను సదానందంబున్!కుదురు పరమ నిష్ఠయున్!క్రోధము విడుం వేగమున్!
చెనకును విరోధాభాసమ్!చెదరు వెతలు శీఘ్రమున్!చేదగు నపార్ధంబులున్!
చొను విభుత శ్రీ ధామమున్!సుధలు మెదలు లోకమున్!శోధిల సు సేవా రతిన్!

అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరములుండును,
యతులు"10,19,అక్షరములకు చెల్లును,

13.గర్భగత"జిత క్రోధ"వృత్తము,

మోదము శివం సుందరమ్!మునికుల వధాన్యం ధన్యమ్!ముదము నొదవు సత్యమే! 
క్రోధము విడుం వేగమున్!గొనకొను సదా నందంబున్!కుదురు పరమ నిష్ఠయున్!
చేదగు నపార్ధంబులున్!చెనకును విరోధా భాసమ్!చెదరు వెతలు శీఘ్రమున్!
శోధిల సు సేవా రతిన్ !చొను విభుత శ్రీ ధామమున్!సుధలు మెదలు లోకమున్!

అనిరుద్ఛందము నందలి ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.9,18,అక్షరములకు చెల్లును,

14.గర్భగత"విరోధా భాస"వృత్తము,

మునికుల వధాన్యం ధన్యమ్!మోదము శివం సుందరమ్!ముదము నొదవు సత్యమే!
గొనకొను సదా నందంబున్!క్రోధము విడుం వేగమున్!కుదురు పరమ నిష్ఠయున్!
చెనకును విరోధా భాసమ్!చేదగు నపార్ధంబులున్!చెదరు వెతలు శీఘ్రమున్!
చొను విభుత శ్రీ ధామమున్!శోధిల సు సేవా రతిన్!సుధలు మెదలు లోకమున్!

అనిరుద్ఛందమువందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,18,అక్షరములకు చెల్లును,

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.