గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

7, జనవరి 2025, మంగళవారం

అనిచ్ఛంతోఽపి వినయం. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

 జైశ్రీరామ్.

శ్లో.  అనిచ్ఛంతోఽపి వినయం - విద్యాభ్యాసేన బాలకాః | 

భేషజేనేవ నైరుజ్యం - ప్రాపణీయాః ప్రయత్నతః ||

(హరిహర సుభాషితం)

తే.గీ.  రోగమును బాపు యత్నించి రోగికిలను

వైద్యుఁ డటులనే బాలుండు విద్యనేర్వ

బాధపెట్టుచున్ననుగాని మోదమలర

నేర్పవలె విద్య కృషిచేసి నేర్పు తనర.       

భావము.  రోగికి చికిత్స చేయడానికి నిరంతర ప్రయత్నం చేసి ఔషధం ఇచ్చి 

రోగాన్ని పరిహరించినట్లే, పిల్లలు ఇష్టపడకపోయినా వారికి ప్రయత్నపూర్వకంగా 

విద్యను అభ్యసింపజేసి మంచి నయమూ, నీతులూ నేర్పాలి.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.