గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జనవరి 2025, సోమవారం

అగ్నిహోత్రఫలా వేదాః. ... మేలిమిబంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో.  అగ్నిహోత్రఫలా వేదాః - శీలవృత్తఫలం శ్రుతమ్l         

రతిపుత్రఫలా నారీ - దత్తభుక్తఫలం ధనమ్ll

తే.గీ.  వేద ఫల మగ్ని యందున వేల్చుటెయగు, 

సత్ప్రవర్త ఫలమగు శాస్త్రములకు, 

పతిని గూడిపుత్రినిగాంచు టతివఫలము, 

ధనము నకు  దాన భోగముల్ తగిన ఫలము. 

భావము.  వేదము అగ్నిహోత్రార్చమే ఫలముగా కలది . శాస్త్రము సత్ప్రవర్తనయే 

ఫలముగా కలది. స్త్రీ భర్తృసంగమమూ, తద్వారా పుత్రప్రాప్తీ ప్రయోజనంగా కలది. 

ధనము దానం చేయఁబడుట, అనుభవింపఁబడుట ఫలముగా కలది.

జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.