జైశ్రీరామ్.
సుథాంబోధి.జీవాత్మ.వరాత్మ.నిష్ట,స్థావర,దోషార్తి.గర్భ"వర్ధనీయతా"వృత్తము,
శివ నీ లీల లెరింగితే!జిత మన్మథా కారుడా!జీవాత్మ!సంరక్షకా!హరా!
భవముల్బాపు వరాత్మకా!వ్రత నిష్ఠ నిన్నెంచితే!భావంబునం!సర్వ మీవయా!
కవనాలంకృత దీప్తివై!గత కృత్య దోషార్తినిన్!కావం సుథాంబోధివై !శివా!
జవ మర్ధింతు శుభాశ్రినై!శతదా విభూతిం గనన్!సా వర్ధనీయంబులం!బుధా!
సృజనాత్మక గర్భ కవితా స్రవంతి యందలి.అనిరుద్ఛందాంతర్గత,ఉత్కృతి"
ఛందములోనిది,ప్రాసనియమము కలదు.పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,10,18,అక్షరములకు చెల్లును,
1.గర్భగత"శివ లీల వృత్తము,
శివ నీ లీల లెరింగితే!
భవముల్బాపు వరాత్మకా!
కవనాలంకృత దీప్తివై!
జవ మర్ధింతుశుభాశ్రినై!
అభిజ్ఞా ఛందము నందలి"బృహతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు.పాదమునకు"9,అక్షరములుండును,
2.గర్భగత"భవదూర"వృత్తము,
జిత మన్మథాకారుడా!
వ్రతనిష్ఠ నిన్నెంచితే!
గత కృత్య దోషార్తినిన్!
శతదా!విభూతిం గనన్!!
అభిజ్ఞా ఛందమునందలి"అనుష్టుప్ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు8"అక్షరము లుండును,
3.గర్భగత"కవన కాంతి"-వృత్తము,
జీవాత్మ సంరక్షకా!హరా!
భావంబునం సర్వమీవయా!
కావం సుథాంబోధివై!శివా!
సా వర్ధనీయంబులం బుధా!
అభిజ్ఞా ఛుదము నందలి"బృహతి"ఛందము లోనిది.
ప్రాస నియమము కలదు.పాదమునకు"9"అక్షరములుండును,
4.గర్భగత"జయ మీయు"-వృత్తము,
శివ నీ లీల లెరింగితే!జిత మన్మథాకారుడా!
భవముల్బాపు వరాత్మకా!వ్రత నిష్ఠ నిన్నెంచితే!
కవనాలంకృత దీప్తివై!గత కృత్య దోషార్తినిన్!
జవ మర్ధింతు శుభాశ్రినై!శతదా విభూతిం గనన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"10,వ యక్షరమునకు చెల్లును,
5.గర్భగత"జిత మన్మథా"వృత్తము,
జిత మన్మథాకారుడా!శివ నీ లీల లెరింగితే!
వ్రత నిష్ఠ నిన్నెంచితే!భవముల్బాపు వరాత్మకా!
గత కృత్య దోషార్తినిన్!కవనాలంకృత దీప్తివై!
శతదా విభూతిం గనన్!జవ మర్ధింతు శుభాశ్రినై!
అణిమా ఛందమునందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి"9"వ యక్షరమునకు చెల్లును,
6.గర్భగత"వ్రత నిష్ఠ"వృత్తము,
శివ నీ లీల లెరింగితే!జీవాత్మ!సంరక్షకా!హరా!
భవముల్బాపు వరాత్మకా!భావంబునం సర్వ మీవయా!
కవనాలంకృత దీప్తివై!కావం సుథాంబోధివై శివా!
జవ మర్ధింతు శుభాశ్రినై!సా వర్ధ నీయంబులం బుధా!
అణిమా ఛందమునందలి"ధృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"18"అక్షరములుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
7.గర్భగత"గత కృతం"వృత్తము,
జీవాత్మ!సంరక్షకా!హరా!శివ నీ లీల లెరింగితే!
భావంబునం!సర్వ మీ వయా!భవముల్బాపు వరాత్మకా!
కావం సుథాంబోధివై!శివా!కవనాలంకృత దీప్తివై!
సా వర్ధ నీయంబులం!బుధా!జవ మర్ధింతు శుభాశ్రినై!
అణిమా ఛందము నందలి"ధృతి"ఛందములోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,18"అక్షరము లుండును,
యతి"10"వ యక్షరమునకు చెల్లును,
8.గర్భగత"తొలగించు"వృత్తము,
జిత మన్మథాకారుడా!జీవాత్మ!సంరక్షకా!హరా!
వ్రత నిష్ఠ నిన్నెంచితే!భావంబునం సర్వ మీవయా!
గత కృత్య దోషార్తినిన్!కావం సుథాంబోధివై!శివా!
శతదా!విభూతిం గనన్!సా వర్ధనీయంబులం!బుధా!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"17"అక్షరము లుండును,
యతి'9'వ యక్షరమునకు చెల్లును,
9.గర్భగత"సుథాంబోధి"వృత్తము,
జీవాత్మ సంరక్షకా!హరా!జిత మన్మథా కారుడా!
భావంబునం సర్వ మీ వయా!వ్రత నిష్ఠ నిన్నెంచితే!
కావం సుథాంబోధివై!శివా!గత కృత్యదోషార్తినిన్!
సావర్ధ నీయంబులం బుధా!శతదా విభూతిం గనన్!
అణిమా ఛందము నందలి"అత్యష్టి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు.పాదమునకు"17"అక్షరము లుండును,
యతి10"వ యక్షరమునకు చెల్లును,
10,గర్భగత"జీవాత్మ"వృత్తము,
జిత మన్మథాకారుడా!శివ నీ లీల లెరింగితే!జీవాత్మ!సంరక్షకా!హరా!
వ్రత నిష్ఠ నిన్నెంచితే!భవముల్బాపు వరాత్మకా!భావంబునం సర్వ మీ వయా!
గత కృత్య దోషార్తినిన్!కవనాలంకృత దీప్తివై!కావం సుథాంబోధివై!
శతదా!విభూతిం గనన్!జవ మర్ధింతు శూభాశ్రినై!సా వర్ధ నీయంబులం!బుధా!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు,9.18.అక్షరములకు చెల్లును,
11గర్భగత"వరాత్మ"వృత్తము,
శివ నీ లీల లెరింగితే!జీవాత్మ!సం రక్షకా!హరా!జిత మన్మథాకారుడా!
భవముల్బాపు వరాత్మకా!భావంబునం సర్వ మీవయా!వ్రత నినిష్ఠ నిన్నెంచితే!
కవ నాలంకృత దీప్తివై!కావం సుథాంబోధివై!గత కృత్య దోషార్తినిన్!
జవ మర్ధింతు!శుభాశ్రినై!సా వర్ధ నీయంబులం!బుధా!శతదా విభూతిం గనన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు. పాదమునకు"26"అక్షరములుండును,
యతులు 10,19,అక్షరములకు చెల్లును,
12.గర్భగత"నిష్ఠ"వృత్తము,
జీవాత్మ సంరక్షకా!హరా!శివ నీ లీల లెరింగితే!జిత మన్మథాకారుడా!
భావంబునం సర్వ మీవయా!భవముల్బాపు వరాత్మకా!వ్రత నిష్ఠ నిన్నెంచితే!
కావం సుథాంబోధివై!కవనాలంకృత దీప్తివై!గత కృత్య దోషార్తినిన్!
సా వర్ధ నీయంబులం బుధా!జవ మర్ధింతు శుభాశ్రినై!శతదా విభూతిం గనన్!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు"26"అక్షరము లుండును,
యతులు.10,19,అక్షరములకు చెల్లును,
13.గర్భగత"స్థావర"వృత్తము,
జిత మన్మథాకారుడా!జీవాత్మ సంరక్షకా!హరా!శివ నీ లీల లెరింగితే!
వ్రత నిష్ఠ నిన్నెంచితే!భావంబునం!సర్వ మీవయా!భవముల్బాపు వరాత్మకా!
గత కృత్య దోషార్తినిన్!కావం సుథాంబోధివై!కవనాలంకృత దీప్తివై!
శతదా!విభూతిం గనం!సా వర్ధ నీయంబులం!బుధా!జవ మర్ధింతు శుభాశ్రినై!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాస నియమము కలదు,పాదమునకు,26,అక్షరము లుండును,
యతులు,9,18,అక్షరములకు చెల్లును,
14.గర్భగత"దోషార్తి"వృత్తము,
జీవాత్మ!సంరక్షకా!హరా!జిత మన్మథాకారుడా!శివ నీ లీల లెరింగితే!
భావంబునం!సర్వ మీవయా!వ్రత నిష్ఠ నిన్నెంచితే!భవముల్బాపు!వరాత్మకా!
కావం!సుథాంబోధివై!గత కృత్య దోషార్తినిన్!కవనాలంకృత దీప్తివై!
సా వర్ధ నీయంబులన్!శతదా!విభూతిం గనన్!జవ మర్ధింతు శుభాశ్రినై!
అనిరుద్ఛందము నందలి"ఉత్కృతి"ఛందము లోనిది,
ప్రాసనియమము కలదు,పాదమునకు 26"అక్షరము లుండును,,
యతులు,10,18.అక్షరములకు చెల్లును,
జైహింద్.
Print this post
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.