గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, సెప్టెంబర్ 2019, శనివారం

రరో రరే రర... ఏకాక్షర శ్లోక వివరణ.

జైశ్రీరామ్.
సంస్కృతంలో ఉన్న ఒక ఏకాక్షర శ్లోకము

రరో రరే రర రురో రురూ రూరు రురో రరే
రేరే రీరా రార రరే రారే రారి రిరా రిరా!!

ర = రామ శబ్దంలోని “ర” రేఫ వలన
రోః = భయం కల
అర = వేగంగా పరుగెత్తే
రురోః = జింకయైన మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని
రేరే = (ర+ఈరే) = కౌస్తుభమణి పొందియున్న
ఉరో రరే = వక్షము నందు
రీరారా = లీల నాపాదించునట్టి
ఊరూరూః = ఊరువులచే గొప్పనైన
ఉః = లక్ష్మి = సీత
అర రర = తన నివాసానికి తీసుకువెళ్ళిన
ఇరార = లంకను పొందిన
ఇరారి = భూ శత్రువైన రావణునికి
రిః = నాశం కల్గించినదై
ఆరిరా = చెలికత్తెలను
రా = పొందిన దాయెను

శ్రీరామ పత్ని సీత లంకలో రావణ నాశనం సూచించే త్రిజట వంటి చెలికత్తెల్ని పొందిందని అర్థము.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.