గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, సెప్టెంబర్ 2019, సోమవారం

నవవిధ భక్తిమార్గములు.

జైశ్రీరామ్.
సీ. చరితార్థ! నీ కథల్ శ్రవణముఁ జేయుచు చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
స్ఫూర్తిదా! నిను కీర్తనమును చేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
నిరుపమ! నిన్ను సంస్మరణము చేయుచున్ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
పరమాత్మ! నీ దివ్య పాదసేవనమునఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
సద్భాస! నీపదార్చనముఁ జేయుచు నేనుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
పరమాత్మ! నీకు నే వందనమును జేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
దృస్యమానుఁడవైన దాస్యము చేయుచుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
సన్మాన్య! నీతోడ సఖ్యము నెరపుచుఁ జేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
మహితుండ! నీకునాత్మనివేదనము చేసి చేరఁ దల్చితి నిన్నుఁ, జేర్చుకొనుము.
గీ. వరద! నవవిధ భక్తుల వరలు నన్ను చేర్చుకొనుమయ్య నీలోనఁ జేర్చుకొనుము.
దుష్ట పరిదాహ! గుణ మోహ! శిష్ట గేహ! చిత్త సమ్మోహ! యాదాద్రి శ్రీ నృసింహ!
జైహింద్.

Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.