గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, సెప్టెంబర్ 2019, సోమవారం

ఓం గం గణేశాయ నమః.

జైశ్రీరామ్.
ఓం నమో నారాయణాయ.
ఆర్యులకు శుభోదయమ్.
నేడు వినాయక చతుర్థి. ఈ సందర్భముగా మీకు మీ కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియఁజేయుచున్నాను.

కంద గీత గర్భ ఉత్పలమాల.
ఓ గణనాథుఁడా! శుభములొప్పునటుల్ మము చూడు నిత్యమున్.
యోగదుఁడా! శుభా! కరమహో! ఘనదేహుఁడ! కాపు మాకు. రా
వే గణియించి యీ ప్రజకు ప్రేరణఁ గొల్పుమ వచ్చి నేడు. రా
వేగముగా.  సదా శుభము ప్రీతినొసంగుచు చూడుమమ్ము లన్.

ఉత్పలగర్భస్థ కందము.

గణనాథుఁడా! శుభములొ
ప్పునటుల్ మము చూడు నిత్యమున్ యోగదుఁడా! 
గణియించి యీ ప్రజకు ప్రే
రణఁ గొల్పుమ వచ్చి నేడు. రా వేగముగా.🙏🏼

ఉత్పలమాల గర్భస్థ తేటగీతి.
శుభములొప్పునటుల్ మము చూడు నిత్య!
కరమహో! ఘనదేహుఁడ! కాపు మాకు. 
ప్రజకు ప్రేరణఁ గొల్పుమ వచ్చి నేడు. 
శుభము ప్రీతినొసంగుచు చూడు మమ్ము.🙏🏼

శ్రీగణేశాయ మంగళమ్.🙏🏼
సద్విధేయుఁడు
చింతా రామ కృష్ణా రావు.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.