గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

29, సెప్టెంబర్ 2019, ఆదివారం

ఆలస్యస్య కుతో విద్యా......మేలిమి బంగారం మన సంస్కృతి.

జైశ్రీరామ్.

శ్లో. ఆలస్యస్య కుతో విద్యా? అవిద్యస్త కుతో ధనం?
అధనస్య కుతో మిత్రమ్? అమిత్రస్య కుతః సుఖమ్?

తే.గీ. సోమరికి విద్య లభియించునేమిగతిని?
ధనమవిద్యనెటులమరు తరచి చూడ?
ధనములేకున్న మిత్రులన్ దనరుటెట్లు?
మిత్రహీనుడు సుఖమెట్లు మేదినిఁగను?

భావం:-
సోమరికి చదువెక్కడిది. చదువులేని వాడికి ధనమెక్కడిది? ధనం లేని వాడికి మిత్రులెక్కడ? మిత్రులు లేని వాడికిసుఖమెక్కడ?కాబట్టి సుఖం కావలెనన్నచో మిత్రులుండవలెను. మిత్రులుండవలెనన్నచో ధనం ఉండవలెను. ధనం ఉండవలెనన్నచో చదువుండవలెను. చదువుండవలెన్నచో  సోమరితనము ఉండకూడదు. అనగా సోమరితనమును పారద్రోలవలెను.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.