గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

20, జులై 2019, శనివారం

గతికా,మత్తరజినీ,భూజావర,నీతెగా,పాలిపోవు,శ్రమోశేత,సురభి,సోలనీక,సునీతినీ,ఉత్మోత్తమ,గర్భ"-సురమాయా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
గతికా,మత్తరజినీ,భూజావర,నీతెగా,పాలిపోవు,శ్రమోశేత,సురభి,సోలనీక,సునీతినీ,ఉత్మోత్తమ,గర్భ"-సురమాయా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-సురమాయా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.జ.ర.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సురల మాయ జిక్కి తీవు!సోలనీక జేసె గంగయే!శూలపాణి!శశిధరా!
మెరిగి రెంతొ?పోల్చ వారు!మేలుకోని దెబ్బ తింటివే!మేలొసంగు వరదుడా!
సరగె దీవు!బోలె పట్టి!చలువ గూర్తు వెల్లవారికిన్!చలినంత శుభగతన్!
పరము మెచ్చు తీరు దెల్పి!బలమిచ్చు పార్వతమ్మ!రాన్!ఫాలనేత్ర! వరమయా!

భావము:-
పరమేశ్వరునకు తొలినుండి సుర లపకారమునే!తలపెట్టిరి.క్షీర సాగర
మథన సమయములో,వెలువడిన"అమృతమును సురలు,కల్పవృక్షము,
కామధేనువు,సిరులను విష్ణువు పొందగా,హాలాహలము మాత్రము ,వెఱ్ఱి
జంగమయ్య,దిగంబరుడు,స్మశాన విహారి,విభూతి లేపకుడు,పార్వతీ
పతికి దక్కినది.కంఠమునుండి మూర్ధన్యమువరకు గల భాగముహాలాహల,
సూర్య వేడిమి,లలాటాగ్ని నయన వేడిమితో!మంటలు చెలరేగిన
వేడిమిని,తట్టు కొనుటకు గాను,భూమాత సంరక్షణార్ధమై,విష్ణు పాదోదకుముగా,గంగమ్మను,శివుని జడలందు విడిచి,ఉపకారము చేసినట్టు.
దేవతలు ప్రకటించు కొనిరి. శివుడు శాంత స్వరూపుడు,నాగాభరణుడు,
విషభర జీవావృతి నొందిన శివుడుమాత్రము గంగమ్మ,నెలవంకల చలువచే,
సురలు కొంత ఉపకారము చేసి రనక తప్పదు!దీర్ఘ సుమంగళియగు,
పార్వతమ్మ శివుని శరీరార్థము పొందినదై,భర్తను సర్వదా!రక్షించు కొను
చున్నది.ఆశివుడు ఇహము మిథ్యని,పరమ భాగవతులు కమ్మని ,కోరిన కోర్కెలు దీర్చుచు,చాలినంత శ్రీలిచ్చు చున్నాడు.విషవలయమున జిక్కినను,
పరోపకారము చేయుడని బోధించిన పరమాత్ముడు శివుడు.లయకర పాత్ర
పోషించు నాశివుడూరకనే లయము జేయడు.జీవి చేయు దుష్కర్మలను,
పరిశీలించి,పరి శోధించి,యిక తప్పదన్న సమయమందు మాత్రమే!
లయము.చేయును.ధనహీనునకున్న ఈవీగుణము ధనవంతునకు
ఉండనేరదని,చెప్పుటకు తాను బీదయైనను సిరు లొసంగును.బీద
అన్నను కాపాడుటకు శ్రీలక్ష్మియే!తనంతట తా!సిరులనిచ్సిరుల
జగన్మాతా, పితరులు పార్వతీ పరమేశ్వరులు.తమ బిడ్డల మగు మనలను
సర్వదా రక్షింతురు గాక!కాన శివ ధ్యానము ఉత్తమము.పరమోత్తమము.
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
సురల మాయ జిక్కి తీవు!
మెరిగి రెంతొ?పోల్చ వారు!
సరగె దీవు !బోలె పట్టి!
పరము మెచ్చు తీరు దెల్పి!
2.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
సోలనీక జేసె గంగయే!
మేలుకోని దెబ్బ తింటివే!
చలువేర్తు వెల్ల వారినిన్!
బలమీయ పార్రావతమ్మ!రాన్!
3.గర్భగత"-భూజావర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.న.లగ.గణములు.వృ.సం.123.
ప్రాసనియమము కలదు.
శూలపాణి!శశి ధరా!
మేలుజేయు వరదుడా!
చాలినంత శుభగతన్!
ఫాల నేత్ర వరమయా!
4.గర్భగత"-నీతెగా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సురల మాయ జిక్కి తీవు!సోలనీక జేసె గంగయే!
మెరిగి రెంతొ?పోల్చ వారు!మేలుకోని దెబ్బ తింటివే!
సరగె దీవు!బోలె పట్టి!చలు వేర్తు వెల్ల వారినిన్!
పరము మెచ్చు తీరు దెల్పి!బల మీయ!పార్వతమ్మ రాన్!
5.గర్భగత"-పాలిపోవు"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.న.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సోలనీక జేసె గంగయే!శూల పాణి!శశి ధరా!
మేలుకోని దెబ్బ తింటివే!మేలుజేయు వరదుడా!
చలువేర్తు వెల్లవారినిన్!చాలినంత శుభగతన్!
బలమీయ!పార్వతమ్మ రాన్!ఫాలనేత్ర వరమయా!
6.గర్భగత"-శ్రమోపేత"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సోలనీక జేసె!గంగయే!శూలపాణి!శశిధరా!సురల మాయ జిక్కి తీవు!
మేలుకోని దెబ్బ తింటివే!మేలుజేయు వరదుడా!మెరిగి రెంతొ?పోల్చ వారు!
చలువేర్తు వెల్ల వారినిన్!చాలినంత శుభగతన్!సరగె దీవు!బోలె పట్టి!
బలమీయ పార్వతమ్మ రాన్!ఫాల నేత్ర వరమయా!పదము మెచ్చు తీరుదెల్పి!
7.గర్భగత"-సురభి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శూల పాణి!శశిధరా!సురల మాయ జిక్కి తీవు!
మేలుజేయు వరదుడా!మెరిగి రెంతొ?పోల్చ వారు!
చాలినంత శుభగతన్!సరగె దీవు!బోలె పట్టి!
ఫాల నేత్ర!వరమయా!పదము మెచ్చు తీరు దెల్పి!
8.గర్భగత"-సోలనీక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.స.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.99,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శూల పాణి!శశిధరా!సురల మాయ జిక్కి తీవు!సోలనీక జేసె!గంగయే!
మేలు జేయు వరదుడా!మెరిగి రెంతొ?పోల్చ వారు!మేలుకోని దెబ్బ తింటివే!
చాలినంత శుభగతన్!సరగె దీవు!బోలె పట్టి!చలు వేర్తు వెల్ల వారినిన్!
ఫాల నేత్ర!వరమయా!పదము మెచ్చు తీరు దెల్పి!బలమీయ!పార్వతమ్మ రాన్!
9,గర్భగత"-సునీతినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
సోలనీక జేసె!గంగయే!సురల మాయ జిక్కి తీవు!
మేలుకోని దెబ్బ తింటివే!మెరిగి రెంతొ?పోల్చ వారు!
చలువేర్తు వెల్లవారినిన్!సరగె దీవు!బోలె పట్టి!
బలమీయ!పార్వతమ్మ!రాన్!పదము మెచ్చు తీరు దెల్పి!
10,గర్భగత"-ఉత్తమోత్తమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.ర.న.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సోలనీక!జేసె గంగయే!సురల మాయ జిక్కి తీవు!శూల పాణి!శశిధరా!
మేలుకోని దెబ్బ తింటివే!మెరిగి రెంతొ?పోల్చ వారు!మేలు జేయు వరదుడా!
చలువేర్తు!వెల్లవారినిన్!సరగె దీవు బోలె పట్టి!చాలినంత శుభగతన్!
బలమీయ!పార్వతమ్మ! రాన్!పదము మెచ్చు తీరు దెల్పి!ఫాల నేత్ర! వరమయా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
కొన్ని వందల వేల చందస్సులను అవలీలగా మాకం దిస్తున్న మీ ప్రతిభ శ్లాఘ నీయం
శ్రీ చింతా సోదరులకు ధన్య వాదములు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.