గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

31, జులై 2019, బుధవారం

గతికాద్వయ,అనఘా,శర యుగళీ ద్వయ,సు శోభయా,జగదభీష్ట,స్వభావ,భూతలీ,గర్భ"-ప్రభుతాద్వయ"- వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
గతికాద్వయ,అనఘా,శర యుగళీ ద్వయ,సు శోభయా,జగదభీష్ట,స్వభావ,భూతలీ,గర్భ"-ప్రభుతాద్వయ"- వృత్తములు.రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-ప్రభుతా ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కవిత లల్లు!భక్తు గావ!కలను తేనె బాన నిచ్చి!కదలి తేడకో?శివా!
భవిత దీర్చి!వెల్గు నింప!బలము నాకు!నీవనంగ!బదులు పల్క నో హరా!
స్థవము జేతు!నెల్ల వేళ!సలిల ధారి!మల్లి దేవ! సదమలుండ!వీవుగా!
జవము తగ్గె!భక్తి పెచ్చె!జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!చదిర భూష!శంభుడా!
2.
కలను తేనె బాన నిచ్చి!కవిత లల్లు!భక్తు గావ!కదలి తేడకో?శివా!
బలము నాకు!నీవనంగ!భవిత దీర్చి!వెల్గు నింప!బదులు పల్క నో!హరా!
సలిల ధారి!మల్లి దేవ!స్థవము జేతు నెల్ల వేళ!సదమలుండ!వీవుగా!
జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!జవము తగ్గె!భక్తి పెచ్చె!చదిర భూష!శంభుడా!
1.గర్భగత"-గతికాద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
1.కవిత లల్లు!భక్తు గావ!                  2.కలను తేనె బాన నిచ్చి!
   భవిత దీర్చి!వెల్గు నింప!                   బలము నాకు నీవనంగ!
   స్థవము జేతు నెల్ల వేళ!                   సలిల ధారి!మల్లి దేవ!
   జవము తగ్గె!భక్తి పెచ్చె!                   జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88,
ప్రాసనియమము కలదు.
కదలి తేడకో?శివా!
బదులు పల్కనో!హరా!
సదమలుండ!వీవుగా!
చదిర భూష!శంభుడా!
3.గర్భగత"-శరయుగళీద్వయ"-వృత్తములు.
ధృతిఛందము.న.ర.జ.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
కవిత లల్లు!భక్తు గావ!కలను తేనె బాన నిచ్చి!
భవిత దీర్చి!వెల్గు నింప!బలము నాకు నీవనంగ!
స్థవము జేతు నెల్ల వేళ!సలిల ధారి!మల్లి దేవ!
జవము తగ్గె!భక్తి పెచ్చె!జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!
2.
కలను తేనె బాన నిచ్చి!కవిత లల్లు భక్తు గావ!
బలము నాకు!నీవనంగ!భవిత దీర్చి!వెల్గు నింప!
సలిల ధారి!మల్లి దేవ!స్థవము జేతు నెల్ల వేళ!
జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!జవము తగ్గె!భక్తి పెచ్చె!
4.గర్భగత"-సు శోభయా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలను తేనె బాన నిచ్చి!కదలి తేడకో?శివా!
బలము నాకు నీవనంగ!బదులు పల్క నోహరా!
సలిల ధారి!మల్లి దేవ!సదమ లుండ!వీవుగా!
జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!చదిర భూష!శంభుడా!
5.గర్భగత"-జగదభీష్ట"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.ర.జ.స.జ.గల.వృత్తము,యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలను తేనె బాన నిచ్చి!కదలి తేడకో?శివా!కవిత లల్లు భక్తు గావ!
బలము నాకు!నీవనంగ!బదులు పల్క నో!హరా!భవిత దీర్చి వెల్గు నింప!
సలిల ధారి!మల్లిదేవ!సదమలుండ!వీవుగా!స్థవము జేతు!నెల్ల వేళ!
జ్వలిత నేత్ర!భద్ర!రుద్ర!చదిర భూష!శంభుడా!జవము తగ్గె!భక్తి!పెచ్చె!
6గర్భగత"-స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కదలి తేడకో?శివా!కవిత లల్లు భక్తు గావ!
బదులు పల్క నో హరా!భవిత దీర్చు వెల్గు నింప!
సదమలుండ!వీవుగా!స్థవము జేతు నెల్ల వేళ!
చదిర భూష!శంభుడా!జవము తగ్గె!భక్తి పెచ్చె!
7.గర్భగత"-భూతలీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.భ.స.జ.గల.గణములు.యతుల.9,18.
ప్రాస నియమము కలదు.వృ.సం.
కదలి తేడకో?శివా!కవిత లల్లు భక్తు గావ!కలను తేనె బాన నిచ్చి!
బదులు పల్క నో హరా!భవిత దీర్చు వెల్గు నింప!బలము నాకు నీవనంగ!
సదమలుండ వీవుగా!స్థవము జేతు!నెల్ల వేళ!సలిల ధారి!మల్లి దేవ!
చదిర భూష!శంభుడా!జవము తగ్గె!భక్తి పెచ్చె!జ్వలిత నేత్ర భద్ర రుద్ర!
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.