గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

10, జులై 2019, బుధవారం

ఆర్జనా,అనఘా,వేదాశ్రి,భాసినీ,అజేయ,జయరాజి,సత్వర,రంభోరు,ప్రమోదకాసాయినా,గర్భ"-బాల్యక్రీడా"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఆర్జనా,అనఘా,వేదాశ్రి,భాసినీ,అజేయ,జయరాజి,సత్వర,రంభోరు,ప్రమోదకాసాయినా,గర్భ"-బాల్యక్రీడా"-వృత్తము.
రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-బాల్య క్రీడా"-వృత్తము..
ఉత్కృతిఛందము.న.ర.భ.న.ర.జ.య.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దివిరె స్వేచ్ఛ!బాల్యంబని!తెలిసి మోదిలందగున్!దిగుడాయెం!నేటిరోజులన్!
భవిత మంచి నాశించుమ!ఫల ప్రదంపు భాషలన్!పగ పెంపున్మాని మేలుకో!
చవట చింత శాసించకు!సలలితంపు కీర్తులన్!సగ జ్ఞానం ముప్పు కోరకన్!
భువన రాజి మేల్మేలన!పులును మేయ బోకుమా!పొగ రందే!తీరు భిన్నతన్!
పులును మేయ=గడ్డి తిన,
1.గర్భగత"-ఆర్జనా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.భ.గణములు.వృ.సం.408.
ప్రాసనియమముకలదు.
దివిరె స్వేచ్ఛ బాల్యంబని!
భవిత మంచి నాశించుమ!
చవట చింత శాసించకు!
భువనరాజి మేల్మేలన!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
తెలిసి మోదిలం దగున్!
ఫల ప్రదంపు భాషలన్!
స లలితంపు కీర్తులన్!
పులును మేయ బోకుమా!
3.గర్భగత"-వేదాశ్రి"-వృత్తము.
బృహతీఛందము.స.త.ర.గణములు.వృ.సం.164.
ప్రాసనియమము కలదు.
దిగుడాయెం!నేటి రోజులన్!
పగ పెంపున్మాని మేలుకో!
సగ జ్ఞానం!ముప్పు కోరకన్!
పొగరందే!తీరు భిన్నతన్!
4.గర్భగత"-భాసినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.భ.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దివిరె స్వేచ్ఛ బాల్యంబని!తెలిసి మోదిలం దగున్!
భవితమంచి నాశించుమ!ఫల ప్రదంపు భాషలన్!
చవట చింత శాసించకు!స లలితంపు కీర్తులన్!
భువనరాజి మేల్మేలన! పులును మేయ బోకుమా!
5.గర్భగత"-అజేయ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.య.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
తెలిసి మోదిలం దగున్!దిగుడాయెం!నేటి రోజులన్!
ఫల ప్రదంపు భాషలన్! పగ పెంపు న్మాని మేలుకో!
స లలితంపు కీర్తులన్!సగ జ్ఞానం ముప్పు కోరకన్!
పులును మేయ బోకుమా!పొగ రందే!తీరు భిన్నతన్!
6.గర్భగత"-జయరాజి"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.య.ర.జ.స.య.లల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలిసి మోదిలం దగున్!దిగుడాయెన్నేటి రోజులన్!దివిరె స్వేచ్ఛ బాల్యంబని!
ఫల ప్రదంపు భాషలం!పగ పెంపున్మాని మేలుకో!భవితమంచి నాశించుమ!
స లలితంపు కీర్తులం!సగ జ్ఞానం ముప్పు కోరకన్!చవట చింత శాసించకు!
పులును మేయ బోకుమా!పొగరందే తీరు భిన్నతన్!భువనరాజి మేల్మేలన!
7.గర్భగత"-సత్వర"-వృత్తము.
ధృతిఛందము.స.త.ర.న.ర.భ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
దిగు డాయెం!నేటి రోజులన్!దివిరె స్వేచ్ఛ బాల్యంబని!
పగ పెంపున్మాని మేలుకో?భవిత మంచి నాశించుమ!
సగ జ్ఞానం ముప్పు కోరకన్!చవట చింత శాసించకు!
పొగ రందే తీరు భిన్నతన్!భువన రాజి మేల్మేలన!
8.గర్భగత"-రంభోరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.త.ర.న.ర.భ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు. వృ.సం.
దిగుడాయెన్నేటి రోజులన్!దివిరె స్వేచ్ఛ బాల్యంబని!తెలిసి మోదిలం దగున్!
పగ పెంపున్మాని మేలుకో!భవిత మంచి నాశించుమ!ఫల ప్రదంపు భాషలన్!
సగ జ్ఞానం!ముప్పు కోరకన్?చవట చింత శాసించకు!స లలితంపు కీర్తులన్!
పొగ రందే తీరు భిన్నతన్!భువన రాజి!మేల్మేలన! పులును మేయ బోకుమా!
9.గర్భగత"-ప్రమోదకా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.య.లల.గణములు.యతి.9.వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తెలిసి మోదిలం దగున్!దివిరె!స్వేచ్ఛ బాల్యంబని!
ఫల ప్రదంపు భాషలన్!భవిత మంచి నాశించుమ!
స లలితంపు కీర్తులం! చవట చింత శాసించకు!
పులును మేయ బోకుమా!భువన రాజి!మేల్మేలన!
10,గర్భగత"-సాయినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.య.న.య.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తెలిసి మోదిలందగున్!దివిరె!స్వేచ్ఛ బాల్యంబని!దిగుడాయెన్నేటి రోజులన్!
ఫల ప్రదంపు భాషలం!భవిత మంచి నాశించుమ!పగ పెంపున్మాని మేలుకో?
స.లలితంపు కీర్తులం!చవట చింత శాసించకు! సగ జ్ఞానం ముప్పు కోరకన్?
పులును మేయ బోకుమా!భువనరాజి మేల్మే లన!పొగరందే తీరు భిన్నతన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.