గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

8, జులై 2019, సోమవారం

వసిత,మహత్వ,నియతీ,తక్కుంగల,సుహాసిత,పెంపింపు,నయతా,నీతిమార్గ,చక్కబడు,గర్భ"-చరమెంచు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
వసిత,మహత్వ,నియతీ,తక్కుంగల,సుహాసిత,పెంపింపు,నయతా,నీతిమార్గ,చక్కబడు,గర్భ"-చరమెంచు"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                         
"-ఉత్కళా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.జ.జ.త.జ.ర.న.జ.గగ.గణములు.యతులు.10,19,
ప్రాసనియమభుకలదు.వృ.సం.
తనపెంపు యింపంచు నెంచి!తక్కుంగల వారి నెంచకన్! దనరుట న్యాయంబౌనే?                                                   కనరాని దుష్టాత్మ నొప్పి!కక్కుర్తికి లోనునై జనన్!కనుమరుగౌ. మోక్షం బున్!                                                       చననౌనె!పాపాత్ములౌచు!చక్కంబడునే!సుహాసతన్!చనుదురె? సన్మార్గంబున్?                                                   ధనధాన్య శాశ్వత మెంచి!దక్కుం!చెడు కీర్తి నూహిలన్!తనువు తుదిన్ బూదౌలే?                                                                        
1.గర్భగత"-వసిత"-వృత్తము.
బృహతీఛందము.స.య.జ.గణములు.వృ.సం.332.
ప్రాసనియమముకలదు.
తన పెంపు యింపంచు నెంచి!
కనరాని దుష్టాత్మ నొప్పి!
చన నౌనె?పాపాత్ములౌచు!
ధన ధాన్య శాశ్వత మెంచి!
2.గర్భగత"-మహత్వ"-వృత్తము.
బృహతీఛందము.త.జ.ర.గణములు.వృ.సం.173.
ప్రాసనియమముకలదు.
తక్కుంగల వారి నెంచకన్!
కక్కుర్తికి లోనునై జనన్!
చక్కంబడునే!సుహాసతన్!
దక్కుం చెడుకీర్తి నూహిలన్!
3.గర్భగత"-నియతీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.య.గగ.గణములు.వృ.సం.16,
ప్రాసనియమముకలదు.
దనరుట న్యాయంబౌనే?
కనుమరుగౌ! మోక్షంబున్!
చనుదురె?సన్మార్గంబున్?
తనువు!తుదిన్!బూదౌలే!
4.గర్భగత"-తక్కుంగల"-వృత్తము.
ధృతిఛందము.స.య.జ.త.జ.ర.గణములు.యతి 10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తన పెంపు యింపంచు నెంచి!తక్కుంగల వారి నెంచకన్!
కనరాని దుష్టాత్మ నొప్పి!కక్కుర్తికి!లోనునై చనన్?
చన నౌనె?పాపాత్ము లౌచు!చక్కంబడునే?సు హాసతన్!
ధన ధాన్య శాశ్వత మెంచి!తక్కుం చెడు కీర్తి నూహిలన్!
5.గర్భగత"-సుహాసిత"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.న.జ.గగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తక్కుంగల వారి నెంచకన్!దనరుట న్యాయం బౌనే?
కక్కుర్తికి లోనై జనన్!కనుమరుగౌ!మోక్షంబున్?
చక్కం బడునే?సుహాసతన్!చనుదురె!సన్మార్గంబున్!
దక్కున్!చెడు కీర్తి నూహిలన్!తనువు తుదిన్!బూదౌలే!
6.గర్భగత"-పెంపింపు"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.న.జ.త.జ.త.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తక్కుంగలవారి నెంచకన్!దనరుట!న్యాయంబౌనే?తనపెంపు యింపంచు నెంచి !                                                   కక్కుర్తికి లోనునై!చనన్?కనుమరుగౌ!మోక్షంబున్!కనరాని దుష్టాత్మ నొప్పి!                                                       చక్కంబడునే?సుహాసతన్!చనుదురె?సన్మార్గంబున్!చన నౌనె?పాపాత్ము లౌచు!                                                   దక్కుం చెడుకీర్తి!నూహిలన్!తనువు!తుదిం!బూదౌలే!ధన ధాన్య శాశ్వత మెంచి!                                                                                  
7.గర్భగత"-నయతా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.య.త.జ.త.గల,గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనరుట!న్యాయంబౌనే?తనపెంపు యింపంచు నెంచి!
కను మరుగౌ!మోక్షంబున్!కనరాని దుష్టాత్మ. నొప్పి!
చనుదురె?సన్మార్గంబున్!చన నౌనె?పాపాత్ములౌచు!
తనువు!తుదిం బూదౌలే!ధన ధాన్య శాశ్వత మెంచి!
8.గర్భగత"-నీతిమార్గ"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.య.త.జ.త.ర.భ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
దనరుట!న్యాయంబౌనే?తనపెంపు యింపంచు నెంచి!తక్కుంగలవారి నెంచకన్!                                                   కను మరుగౌ!మోక్షంబున్!కనరాని దుష్టాత్మ నొప్పి!కక్కుర్తికి లోనునై! చనన్!                                                     చనుదురె?సన్మార్గంబున్?చననౌనె!పాపాత్ములౌచు!చక్కంబడునే? సు హాసతన్!                                                   తనువు!తుదిం బూదౌలే!ధన ధాన్య శాశ్వత మెంచి!దక్కుం చెడు కీర్తి నూహిలన్?                                                 9.గర్భగత"-చక్కబడు"-వృత్తము.
ధృతిఛందము.త.జ.ర.స.య.జ.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తక్కుంగలవారి నెంచకన్!తనపెంపు యింపంచు నెంచి!
కక్కుర్తికి లోనునై చనన్!కనరాని దుష్టాత్మ నొప్పి!
చక్కంబడునే!సుహాసతన్!చన నౌనె?పాపాత్ము లౌచు!
దక్కుం చెడు కీర్తి నూహిలన్?ధన ధాన్య శాశ్వత మెంచి!
10,గర్భగత"-ఉత్కళా"-వృత్తము
ఉత్కృతిఛందము.త.జ.ర.స.య.జ.న.య.గగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
తక్కుంగల వారి నెంచకన్!తన పెంపు యింపంచు నెంచి!దనరుట న్యాయం బౌనే?                                                 కక్కుర్తికిం!లోనై చనన్!కనరాని దుష్టాత్మ నొప్పి!కనుమరుగౌ!మోక్షంబున్?
చక్కంబడునే!సు హాసతన్!చన నౌనే?పాపాత్ము లౌచు!చనుదురె? సన్మార్గంబున్!                                                 దక్కున్!చెడుకీర్తి నూహిలన్?ధన ధాన్య శాశ్వత మెంచి!తనువు!తుదిన్ బూదౌలే!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
 జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.