గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

11, జులై 2019, గురువారం

మత్త రజినీ ద్వయ, ప్రమాణీ, రజినీకర. ప్రియ ద్వయ ,హేతుక, సంవాదనా,జారయా,సామ్యవాద,గర్భ"-కర్తృ కర్మ ద్వయ వృత్తములు. రచన:-వల్లభవఝల అఔప్పల నరసింహ మూర్తి. జుత్తాడ

జైశ్రీరామ్.
మత్త రజినీ ద్వయ, ప్రమాణీ, రజినీకర. ప్రియ ద్వయ ,హేతుక, సంవాదనా,జారయా,సామ్యవాద,గర్భ"-కర్తృ కర్మ ద్వయ వృత్తములు.
రచన:-వల్లభవఝల అఔప్పల నరసింహ మూర్తి.
                               జుత్తాడ.

"-కర్తృ కర్మ ద్వయ"-వృత్తములు.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
1.
బీదవాటి చేర నోపరే!ప్రేమ భాగ్యవంతు నెంతురే!వినాశ కర్తృ కర్ములై!
భూది నిచ్చు భూతి మోక్షమున్!భూమి వీడి సాము చేతురే! పునీత మార్గ మెంచకన్!సాద సీద జూచు తండ్రినిన్!స్వామియంచు గొల్తు రెల్లరున్?జనాళి కీర్తిలంగడున్!
నీది నాది యేది కాదుగా!నీమమొప్ప గొల్వు సర్వులన్!నినాద మేర్చుసామ్యతన్!
2.
ప్రేమ భాగ్యవంతు నెంతురే!బీదవాటి చేర నోపరే!వినాశ కర్తృ కర్ములై?
భూమివీడి సాము చేతురే!భూది నిచ్చు భూతి మోక్షమున్!పునీత మార్గమెంచకన్!
స్వామియంచు గొల్తు రెల్లరున్!సాద సీద జూచు తండ్రినిన్!జనాళి కీర్తిలం గడున్!
నీమ మొప్ప గొల్వు సర్వులన్!నీది నాది యేది కాదుగా!నినాద మేర్చు సామ్యతన్!
1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.
బీద వాటి చేర నోపరే!
భూది నిచ్చు భూతి మోక్షమున్!
సాద సీద జూచు తండ్రినిన్!
నీది నాది యేది కాదురా!
2.
ప్రేమ భాగ్యవంతు నెంతురే!
భూమివీడి సాము జేతురే!
స్వామియంచు గొల్తు రెల్లరున్!
నీమ మొప్ప గొల్వు సర్వులన్!

2.గర్భగత"-ప్రమాణీ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.జ.ర.లగ.గణములు.వృ.సం.86.
ప్రాసనియమము కలదు.
వినాశ కర్తృ కర్ములై!
పునీత మార్గ మెంచకన్!
జనాళి కీర్తిలం గడున్!
నినాద మేర్చు సామ్యతన్!

3.గర్భగత"-రజినీకర ప్రియ"-ద్వయ వృత్తములు.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.బీదవాటి చేర నోపరే!ప్రేమ భాగ్య వంతు నెంతురే!
భూది నిచ్చు భూతి మోక్షమున్!భూమి వీడి సాము చేతురే!
సాద సీద జూచు తండ్రినిన్!స్వామి యంచు గొల్తు రెల్లరున్!
నీది నాది యేది కాదుగా! నీమ మొప్ప గొల్వు !సర్వులన్!
2.
ప్రేమ భాగ్యవంతు నెంతురే!బీదవాటి చేర నోపరే!
భూమివీడి సాము చేతురే! భూది నిచ్చు భూతి మోక్షమున్!
స్వామియంచు గొల్తు రెల్లరున్!సాద సీద జూచు తండ్రినిన్!
నీమ మొప్ప గొల్వు సర్వులన్!నీది నాది యేది కాదుగా!

4.గర్భగత"-హేతుక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రేమ భాగ్య వంతు నెంతురే!వినాశ కర్తృ కర్ములై!
భూమి వీడి సాము జేతురే!పునీత మార్గ మెంచకన్!
సాద సీద జూచు తండ్రినిన్!జనాళి కీర్తిలం గడున్!
నీది నాది యేది కాదుగా!నినాద మేర్చు సామ్యతన్!

5.గర్భగత"-సంవాదనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ప్రేమ భాగ్యవంతు నెంతురే!వినాశ కర్తృ కర్ములై!బీద వాటి చేర నోపరే!
భూమి వీడి సాము జేతురే!పునీత మార్గ మెంచకన్!భూదినిచ్చు భూతి మోక్షమున్!
సాద సీద జూచు తండ్రినిన్!జనాళి కీర్తిలం గడున్!స్వామియంచు గొల్తురెల్లరున్!
నీది నాది యేది కాదుగా!నినాద మేర్చు సామ్యతన్!నీమమొప్ప గొల్వు సర్వులన్!
6.గర్భగత"-జారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వినాశ కర్తృ కర్ములై! బీద వాటి చేర నోపరే!
పునీత మార్గ మెంచకన్!భూది నిచ్చు భూతి మోక్షమున్!
జనాళి కీర్తిలం గడున్!స్వామి యంచు గొల్తు రెల్లరున్!
నినాద మేర్చు సామ్యతన్!నీమ మొప్ప గొల్వు సర్వులన్!

7.గర్భగత"-సామ్యవాద"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
వినాశ కర్మ కర్తృలై!బీద వాటె చేర నోపరే!ప్రేమ భాగ్యవంతు నెంతురే!
పునీత మార్గ మెంచకన్!భూదినిచ్చు! భూతి మోక్షమున్!భూమి వీడ సాము జేతురే!
జనాళి కీర్తిలం గడున్!స్వామి యంచు గొల్తు రెల్లరున్! సాద సీద జూచు; తండ్రినిన్!
నినాద మేర్చు సామ్యతన్!నీమమొప్ప గొల్వు సర్వులన్!నీది నాది యేది కాదుగా!                             
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.