గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

4, జులై 2019, గురువారం

భ్రమక,సమాశ్రీ,మత్తరజినీ,అయోనిజ,యతిర్నవసుగంధి,మేనిఛాయ,గర్భ స్థగిత,అర్కాష్టక,నిగ్గుతగ్గు,గర్భ"-గుణావరీ"-వృత్తము. రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.

జైశ్రీరామ్.
భ్రమక,సమాశ్రీ,మత్తరజినీ,అయోనిజ,యతిర్నవసుగంధి,మేనిఛాయ,గర్భ స్థగిత,అర్కాష్టక,నిగ్గుతగ్గు,గర్భ"-గుణావరీ"-వృత్తము.

రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.         
                             జుత్తాడ.
"-గుణావరీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
సాటివారి కుపకరించు!చాటుకోకు నీదు గొప్ప!జాతి గౌరవంబు నిల్పుమా!
భూటకాలు పనికిరావు!పోటుగాడ నే ననంగ!పోతరంబదేల?మానవా!
మాట నీతిదనర నొప్పు!మాట చేత సామ్య మేర్చు!మాత మెచ్చుతీరు!
                                                                                 నొప్పుమా!
మేటికీర్తి గణన  సేయు!మేటి దుష్టచర్య మాను!మేత భ్రాంతి గొడ్డు గాకుమా!
1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.గణములు..వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
సాటి వారి కుపకరించు!
భూటకాలు పనికి రావు!
మాట నీతి దనర నొప్పు!
మేటి కీర్తి గణన సేయు!
2.గర్భగత"-సమాశ్రీ వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.జ.గల.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
చాటుకోకు నీదు గొప్ప!
పోటుగాడ!నే ననంగ!
మాట చేత సామ్య మేర్చు!
మేటి దుష్ట చర్య మాను!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
జాతి గౌరవంబు నిల్పుమా!
పోతరం బదేల?మానవా!
మాత మెచ్చు తీరు నొప్పుమా!
మేత భ్రాంతి గొడ్డు గాకుమా!
4.గర్భగత"-అయోనిజ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
సాటి వారి కుపకరించు!చాటు కోకు నీదుగొప్ప!
భూటకాలు పనికి రావు!పోటుగాడ నే ననంగ!
మాట నీతి దనర నొప్పు!మాట చేత సామ్య మేర్చు!
మేటి కీర్తి గణన సేయు!మేటి దుష్ట చర్య మాను!
5.గర్భగత"-యతిర్నవసుగంధి"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాటుకోకు నీదు గొప్ప!జాతి గౌరవంబు నిల్పుమా!
పోటుగాడ నే ననంగ!పోతరం బదేల?మానవా!
మాట చేత సామ్యమేర్చు!మాత మెచ్చు తీరు నొప్పుమా!
మేటి దుష్ట చర్య మాను!మేత భ్రాంతి గొడ్డు గాకుమా!
6.గర్భగత"-మేనిఛాయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.ర.య.జ.న.గల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చాటు కోకు నీదు గొప్ప!జాతి గౌరవంబు నిల్పుమా!సాటి వారి కుపకరించు!
పోటుగాడ నే ననంగ!పోతరంబదేల?మానవా!భూటకాలు పనికిరావు!
మాట చేత సామ్య మేర్చు!మాత మెచ్చు తీరు నొప్పుమా!మాట నీతి దనర
                                                                                           నొప్పు!
మేటి దుష్ట చర్య మాను!మేత భ్రాంతి గొడ్డు గాకుమా!మేటికీర్తి గణనసేయు!
7.గర్భగత"-గర్భస్థ"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
జాతి గౌరవంబు నిల్పుమా!సాటివారి కుపకరించు!
పోతరం బదేల?మానవా!భూటకాలు పనికిరావు!
మాత మెచ్చు తీరు నొప్పుమా!మాట నీతి దనర నొప్పు!
మేత భ్రాంతి గొడ్డు గాకుమా!మేటి కీర్తి గణన సేయు!
8.గర్భగత"-భ్రష్ట ఖ్యాతి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.ర.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
జాతి గౌరవంబు నిల్పుమా!సాటివారి కుపకరించు!చాటుకోకు నిదుగొప్ప
పోతరంబదేల?మానవా!భూటకాలు పనికిరావు! పోటుగాడ నే ననంగ!
మాత మెచ్చు తీరు నొప్పుమా!మాట నీతిదనర నొప్పు!మాటచేత!సామ్య
                                                                                       మేర్చు!
మేత భ్రాంతి గొడ్డు గాకుమా!మేటికీర్తి గణన సేయు!మేటి దుష్టచర్య మాను!
9.గర్భగత"-అర్కాష్టక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చాటుకోకు నీదు గొప్ప!సాటివారి కుపకరించు!
పోటుగాడ నే ననంగ!భూటకాలు పనికిరావు!
మాట చేత సామ్యమేర్చు!మాట నీతి దనర నొప్పు!
మేటి దుష్టచర్య మాను!మేటికీర్తి గణన సేయు!
10,గర్భగత"-నిగ్గుతగ్గు"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
చాటుకోకు నీదు గొప్ప!సాటివారి కుపకరించు!జాతి గౌరవంబు నిల్పుమా!
పోటుగాడ నే ననంగ!భూటకాలు పనికిరావు!పోతరం బదేల?మానవా!
మాటచేత సామ్యమేర్చు!మాట నీతి దనర నొప్పు!మాత మెచ్చు తీరు
                                                                                నొప్పుమా!
మేటి దుష్ట చర్య మాను!మేటికీర్తి!గణన సేయు!మేత భ్రాంతి గొడ్డు గాకుమా!
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.