గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

25, జులై 2019, గురువారం

జైశ్రీరామ్.
గతికా,ధారా,అనఘా,నిజాశ్రి,రసాన్విత,రసజని,స్వభావ,గురు గీత,రసార్జనా, దేవ కాంచన,గర్భ"-గీతార్థసార"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

  "-గీతార్థసార"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.ర.స.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎవడ వీవు?నే నెవండ?ఏది స్థిరమొ!యెంచవేల?ఇదియె?లోక మాయరా!
శివము మాని!సాగె దేల?చేదు నిజము!తెల్సి కొమ్మ!చెదరనీకు!సౌమ్యతన్!
భవ హరంబు!కోర వేల?వాదిల పని లేదు! రన్న! వదల వోయి!స్వార్థమున్!
చవకబారు కుట్ర మాను!సాధనమున!ముక్తి నొందు!చదిరబుద్ధి!మానుచున్?
1.గర్భగత"-గతికా"-వృత్తము.
బృహతీఛందము.న.ర.జ.గణములు.వృ.సం.344.
ప్రాసనియమము కలదు.
ఎవడ వీవు?నే నెవండ?
శివము మాని!సాగె దేల?
భవ హరంబు!కోర వేల?
చవకబారు!కుట్ర మాను!
2.గర్భగత"-ధారా"-వృత్తము.
బృహతీఛందము.ర.స.జ.గణములు.వృ.సం.347.
ప్రాసనియమము కలదు.
ఏది స్థిరమొ?యెంచ వేల?
చేదు నిజము!తెల్సి కొమ్మ!
వాదిల పనిలేదు! రన్న!
సాధనమున!ముక్తి నొందు!
3.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88.
ప్రాసనియమము కలదు.
ఇదియె!లోక మాయరా!
చెదర నీకు!సౌమ్యతన్!
వదల వోయి!స్వార్థమున్!
చదిర బుద్ధి!మానుచున్?
4.గర్భగత"-నిజాశ్రి"-వృత్తము.
ధృతిఛందము.న.ర.జ.ర.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఎవడ!వీవు?నే నెవండ?ఏది!స్థిరమొ?యెంచ వేల?
శివము మాని!సాగె దేల?చేదు నిజము!తెల్సి కొమ్మ!
భవ హరంబు!కోర వేల? వాదిల పని లేదు? రన్న!
చవక బారు కుట్ర మాను!సాధనమున!ముక్తి నొందు!
5.గర్భగత"-రసాన్విత"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏది!స్థిరమొ?యెంచవేల?ఇదియె?లోక మాయరా!
చేదు నిజము!తెల్సి కొమ్మ!చెదర నీకు?సౌమ్యతన్!
వాదిల పనిలేదు?రన్న!వదల వోయి!స్వార్థమున్!
సాధనమున!ముక్తి నొందు!చదిర బుద్ధి!మానుచున్?
6.గర్భగత"-రసజని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.జ.న.ర.జ.స.జ.గల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏది?స్థిరమొ!యెంచవేల?ఇదియె!లోక మాయరా!ఎవడ వీవు?నే నెవండ?
చేదు నిజము!తెల్సి కొమ్మ!చెదర నీకు!సౌమ్యతన్!శివము మాని!సాగెదేల?
వాదిల పనిలేదు!రన్న!వదలవోయి!స్వార్థమున్! భవ హరంబు !కోరవేల?
సాధనమున!ముక్తి నొందు!చదిరబుద్ధి మానుచున్?చవకబారు కుట్ర మాను!
7.గర్భగత"-స్వభావ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.జ.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వో.సం.
ఇదియె!లోక మాయరా!ఎవడ వీవు?నే నెవండ?
చెదర నీకు!సౌమ్యతన్!శివము మాని సాగె దేల?
వదలవోయి!స్వార్థమున్!భవ హరంబు!కోర వేల?
చదిర బుద్ధి!మానుచున్?చవకబారు!కుట్ర మాను!
8,గర్భగత"-గురు గీత"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.జ.ర.న.జ.గల.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఇదియె!లోక మాయరా!ఎవడ వీవు?నే నెవండ?ఏది!స్థిరమొ!యెంచవేల?
చెదర నీకు!సౌమ్యతన్!శివము మాని!సాగె దేల?చేదు నిజము!తెల్సి కొమ్మ!
వదలవోయి!స్వార్థమున్!భవ హరంబు!కోరవేల?వాదిల పని లేదు?రన్న!
చదిర బుద్ధి!మానుచున్?చవకబారు!కుట్ర మాను!సాధనమున!ముక్తి నొందు!
9.గర్భగత"-రసార్జన"-వృత్తము.
ధృతిఛందము.ర.స.జ.న.ర.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏది!స్థిరమొ?యెంచవేల?ఎవడ వీవు?నే నెవండ?
చేదు నిజము!తెల్సి కొమ్మ!శివము మాని!సాగెదేల?
వాదిల పనిలేదు?రన్న!భవ హరంబు!కోరవేల?
సాధనమున!ముక్తి నొందు!చవకబారు!కుట్ర మాను!
10,గర్భగత"-దేవకాంచన"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.స.జ.న.ర.జ.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఏది!స్థిరమొ?యెంచ వేల?ఎవడ వీవు?నే నెవండ?ఇదియె!లోక మాయరా!
చేదు నిజము!తెల్సి కొమ్మ!శివము మాని!సాగె దేల?చెదర నీకు!సౌమ్యతన్!
వాదిల పని లేదు?రన్న!భవ హరంబు!కోరవేల?వదల వోయి!స్వార్ధమున్!
సాధనమున!ముక్తి నొందు!చవకబారు!కుట్ర మాను!చదిర బుద్ధి మానుచున్?
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.