గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, జులై 2019, బుధవారం

భ్రమక,భాసిజ,చెడుతిర్పు,ఎదుగు,భాసిజుమర,భాస్వకామర,మాయు,లోకాయుక్త,ఏపొనరు,భాస్వజా,గర్భ"-సౌష్టవ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భ్రమక,భాసిజ,చెడుతిర్పు,ఎదుగు,భాసిజుమర,భాస్వకామర,మాయు,లోకాయుక్త,ఏపొనరు,భాస్వజా,గర్భ"-సౌష్టవ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-సౌష్టవ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.భ.స.జ.మ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉట్టె లోని కడవ పాలు!ఒక్క విషపు జుక్క జేరి!ఉన్నట్టే!మాపెనో!యనన్!
దిట్టమైన భరతమాత!తిక్క జనపు లెక్క జిక్కి!తెన్నేదీ!కాన నట్లయెన్!
కొట్టు మిట్టి!కులము తట్టి!కుక్కలటుల కాటులాడి!కొన్నారే!స్వేచ్ఛ భారతిన్!
పట్టు దట్టి!పరుల నంటె!వ్రక్క లొనరు టాశ లొప్పి!పన్నాలం!వల్లెవేయుచున్!

భావము:-
సు సంపన్నగా!పలు దేశాలకే!మకుటాయమానమై!ప్రపంచ ప్రఖ్యాతి గడించిన
భారతాంబ!అనేకానేక శాస్త్రవేత్తలతో,భూత,భవిష్యద్వర్త మానములను
లెక్కంచకనే చెప్ప గల్గే విద్వాంసులతో, జ్ఞాన దీపికలై యారితేరిన మేథావుల
తో మహమ్మదల్లా,రషీమ్!యేసు ప్రభులు,రామ,కృష్ణులతో,కర్మభూమిగా
పేరెన్నిక గని,చతుః షష్టి కళా నిపుణులతో,పాడి,పంటలతో కళ కళ లాడుచు,
ప్రసన్న వదనయై దనరారు యామె!పర సృంఖలాల జిక్కినను,మొక్కవోని,
సౌష్టవముతో,విశ్వ జనీనమైన,మహాత్ముల,త్యాగ ఫలముతో,అశృతార్పణ
గావించిననిజమైన దేశ భక్తుల,త్యాగఫలముగా,నేడు స్వేచ్ఛా వాయువులు
పిల్చు కొనుచున్నది.సర్వమానవ సౌభ్రా తృత్వము,భిన్నత్వంలో యేకత్వము
తో,పూర్ణయై,ప్రపూర్ణయై,నేటికిని విరాజిల్లు చున్నది.స్వాతంత్రము నొంది
72సంవత్సరములు నిండినను,నేడది పాలకుండలో విషపు చుక్క వలె,
స్వార్ధపరుల కబంద హస్తాల నలిగి,చెప్పిన దానికి,చేసిన దానికి పొంతన
లేక,కుల,మత పోరులనే విషబీజాలు నాటబడి మహావృక్షములై,నిజమైన
జ్ఞానానికి,పట్టము గట్టక,యిచ్ఛాను సారము సాగుచున్నది.దీనికి విష బీజములే!కారణాలు,సమ సమాజ ,స్థాపన,బీద జనోద్ధరణ నామ
మాత్రముగా మిగిలి పోయినవి,ప్రజాధన దుర్వినియోగము,పదవీ
వ్యామోహమే!ప్రధాన కారణముగా నిల్చినవి.భారత దేశ ప్రగతి కిదియే!
తీరని గొడ్డలి పెట్టు.ప్రతీపౌరుడు,నడుము బిగించి సరియైన బీదకు
సహాయ మగుచున్నదా!లేదా !చూడవలసిన బాధ్యత మనది.పరిశోధించి
చూడగా!బీదవాని యభి వృద్ధి మృగ్యము.దానిని బట్టి బీద బీదవానిగానే
మిగిలి పోవు చున్నాడు.మధ్యతరగతి విషయానికి వస్తే!బీద వానికి
యెక్కువ!ధనవంతునకుతక్కువ!త్రిశంక స్వర్గము వారిది.మరి
ధనవంతులా!ఆశకు అంతులేక కోట్లకు కోట్లు అర్పణముగా!గడించు
చున్నారు.ఇట్టి పరిస్థితు లలో!సమ సమాజమను మాటకు విలువ
లేదు.సత్యము,అహింస,ధర్మమనే పదాలు చెప్పు కొనుటకే గాని ,
ఆచరణ యోగ్యములు కావు. నోటుకి ఓటనే!నానుడి!ప్రజలు తెలిసి
మన కెందుకులే యని సరిపెట్టు కొని,దేశ భవితను తిరోగతి పట్టించు
చున్నారు.నేటి భారతినుండి ఫుంఖాను ఫుంఖములుగా,విద్యా
వంతులు పైదేశములకు ఉద్యోగములకు పోవు చున్నారంటే!
దానికి కారణం మనం విద్యకు తగిన జీతం యివ్వ లేక పోవుటయే!
అందుకని అన్ని యనర్థములకు మూల కారణం స్వార్ధము.స్వార్ధమును
పూర్తిగా విడవ లేక పోయినను కొంతమేరకైన పరార్ధమునకు పాటుపడిన,
స్వ పరిపాలన!సుపరిపాలన యగుననుట ముమ్మాటికీ నిజము.
భావి తరాలకు సు పరిపాలన మందించాలని కోరుతూ ఈగర్భకవిత
చేయడమైనది,
*ఇది యెవ్వరినీ ఉద్దేశించి కాదని సుహృద్భావముతో గ్రహించాలని
మనసారా కోరుచున్నాను.
1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
ఉట్టె లోని కడవ .పాలు!
దిట్టమైన!భరత మాత!
కొట్టు మిట్టి!కులము తట్టి!
పట్టు దట్టి!పరుల నంటె!.
2.గర్భగత"-భాసిజ"-వృత్తము.
బృహతీఛందము.భ.స.జ.గణములు.వృ.సం.351.
ప్రాసనియమము కలదు.
ఒక్క విషపు జుక్క చేరి!
తిక్క జనపు లెక్క జిక్కి!
కుక్క లటుల కాటు లాడి!
వ్రక్క లొనరు టాశ!నొప్పె?
3.గర్భగత"-చెడు తీర్పు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.ర.లగ.గణములు.వృ.సం.81,
ప్రాసనియమము కలదు.
ఉన్నట్టే!మాపెనో!యనన్?
తెన్నేదీ!కాన నట్లయెన్?
కొన్నారీ!స్వేచ్ఛ భారతిన్!
పన్నాలం!వల్లె వేయుచున్!
4.గర్భగత"-ఎదుగు"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.భ.స.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
ఉట్టె లోని కడవ పాలు!ఒక్క విషపు జుక్క జేరి!
దిట్ట మైన భరత మాత!తిక్క జనపు లెక్క జిక్కి!
కొట్టు మిట్టి!కులము తట్టి!కుక్క లటుల కాటు లాడి!
పట్టుదట్టి!పరుల నంటె!వ్రక్క లొనరు టాశ నొప్పి!
5.గర్భగత"-భాసిజామర"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.స.జ.మ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాస నియమము కలదు.వృ.సం.
ఒక్క విషపు చుక్క జేరి!ఉన్నట్టే!మాపెనో!యనన్?
తిక్క జనపు లెక్క జిక్కి!తెన్నేదీ!కాన నట్లయెన్?
కుక్క లటుల కాటులాడి!కొన్నారీ!స్వేచ్ఛ భారతిన్!
వ్రక్క లొనరు టాశ లొప్పి!పన్నాలన్!వల్లె వేయుచున్!
6.గర్భగత"-భాస్వకామర"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.మ.ర.య.జ.న.గల.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒక్క విషపు చుక్క జేరి!ఉన్నట్టే!మాపెనో!యనన్!ఉట్టె లోని కడవ పాలు!
తిక్క జనపు లెక్క జిక్కి!తెన్నేదీ!గాన నట్లయెన్!దిట్ట మైన! భరత మాత!
కుక్క లటుల కాటులాడి!కొన్నారీ!స్వేచ్ఛ భారతిన్!కొట్టు మిట్టి కులము తట్టి!
వ్రక్క లొనరు టాశ లొప్పి!పన్నాలం!వల్లె వేయుచున్!పట్టు దట్టి పరుల నంటె!
7.గర్భగత"-మాయు"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.ర.య.జ.న.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నట్టే!మాపెనో!యనన్?ఉట్టెలోని కడవ పాలు.!
తెన్నేదీ!గాన నట్లయెన్!దిట్టమైన భరత మాత!
కొన్నారీ స్వేచ్ఛ భారతిన్!కొట్టు మిట్టి కులము తట్టి!
పన్నాలం వల్లె వేయుచున్!పట్టు దట్టి పరుల నంటె!
8.గర్భగత"-లోకాయుక్త"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.ర.య.జ.న.ర.న.జ.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఉన్నట్టే!మాసెనో!యనన్?ఉట్టె లోని కడవ పాలు!ఒక్క విషపుజుక్క చేరి!
తెన్నేదీ!కాన నట్లయెన్!దిట్టమైన భరత మాత!తిక్క జనపు లెక్క!జిక్కి!
కొన్నారీ!స్వేచ్ఛ భారతిన్!కొట్టు మిట్టి!కులము తట్టి!కుక్కలటుల కాటులాడి!
పన్నాలం వల్లె వేయుచున్!పట్టదట్టి పరుల నంటె!వ్రక్క లొనరు టాశ లొప్పి!
9.గర్భగత"-ఏపొనరు"-వృత్తము.
ధృతి ఛందము.భ.స.జ.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒక్క విషపు చుక్క జేరి!ఉట్టె లోని కడవ పాలు!
తిక్క జనపు లెక్క జిక్కి!దెట్టమైన భరత మాత!
కుక్క లటుల కాటులాడి!కొట్టు మిట్టి కులము తట్టి!
వ్రక్క లొనరు టాశ!లొప్పి!పట్టు దట్టి పరుల నంటె!
10,గర్భగత"-భాస్వజా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.స.జ.ర.న.జ.మ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
ఒక్కవిషపు చుక్క జేరి!ఉట్టె లోని!కడవ పాలు!ఉన్నట్టే!మాపెనో!యనన్!
తిక్క జనపు లెక్క జిక్కి!దిట్టమైన!భరత మాత!తెన్నేదీ!కాన నట్లయెన్!
కుక్క లటుల కాటులాడి!కొట్టు మిట్టి!కులము తట్టి!కొన్నారీ!స్వేచ్ఛ భారతిన్!
వ్రక్క లొనరు  టాశ లొప్పి!పట్టు దట్టి!పరుల నంటె!పన్నాలం!వల్లె వేయుచున్.
స్వస్తి.
మూర్తి!జుత్తాడ
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.