గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

18, జులై 2019, గురువారం

విశ్వసౌఖ్య,పరిహరణా.జీవనా,సంభార,భూతినా,యశజతా,వందిత,పాతక,రసజా,పొందుగోరు,గర్భ"-పురుషార్ధతా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
విశ్వసౌఖ్య,పరిహరణా.జీవనా,సంభార,భూతినా,యశజతా,వందిత,పాతక,రసజా,పొందుగోరు,గర్భ"-పురుషార్ధతా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-పురుషార్థతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.భ.ర.భ.ర.య.స.జ.గగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వో.సం.
పురుషార్థంబుల మీరకన్!భూతికి లోటు రానటుల్!పొందును కోరుమా! శుభాలన్!
వరదంబౌ!నరజన్మకున్!పాతక దూరతన్జనన్!వందితమౌ!గమంబుగల్గున్!
చరితంబౌ!కీర్తి ఘటించుమా!జాతియు గౌరవించగా!ఛందన గంథ సౌరు లలరన్!
స్థిరమా!జీవనమెంచగా!చేతన మెంచు మంచిగాన్!చెందును శోభిదంబు లెన్నన్!
1.గర్భగత"-విశ్వసౌఖ్య"-వృత్తము.
బృహతీఛందము.స.భ.ర.గణములు.వృ.సం.180.
ప్రాసనియమము కలదు.
పురుషార్థంబుల మీరకన్!
వరదంబౌ!నర జన్మకున్!
చరితంబౌ!కీర్తి ఘటించుమా!
స్థిరమా!జీవన మెంచగా!
2.గర్భగత"-పరిహరణా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లగ.గణములు.వృ.సం.87.
ప్రాసనియమము కలదు.
భూతికి లోటు రానటుల్!
పాతక దూరతన్!జనన్!
జాతియు గౌరవించగా!
చేతన మెంచు మంచిగాన్!
3.గర్భగత"-జీవనా"-వృత్తము.వృ.సం.87.
ప్రాసనియమము కలదు.
పొందును కోరుమా!శుభాలన్!
వందితమౌ!గమంబు కల్గున్!
ఛందన గంథ సౌరు లలరన్!
చెందును శోభిదంబు లెన్నన్?
4.గర్భగత"-సంభార"-వృత్తము.
అత్యష్టీఛందము.స.భ.ర.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పురుషార్ధంబుల మీరకన్!భూతికి లోటు రానటుల్?
వరదంబౌ!నర జన్మకున్!పాతక దూరతన్!చనన్!
చరితంబౌ!కీర్తి ఘటించుమా!జాతియు గౌరవించగా!
స్థిరమా!జీవన మెంచగాన్!చేతన మెంచు మంచిగాన్!
5.గర్భగత"-భూతినా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.య.స.జ.గగణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భూతికి లోటురానటుల్!పొందును కోరుమా!శుభాలన్!
పాతక దూరతన్!చనన్!వందితమౌ!గమంబు కల్గున్!
జాతియు గౌరవించగా!ఛందన గంథ సౌరులన్!
చేతన మెంచు మంచిగాన్!చెందును శోభిదంబు లెన్నన్!
6.గర్భగత"-యశజతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.జ.త.య.స.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భూతికి లోటురానటుల్!పొందును కోరుమా శుభాలన్!పురుషార్థంబుల మీరకన్!
పాతక దూరతన్జనన్!వందితమౌ!గమంబు కల్గున్!వరదంబౌ!నరజన్మకున్!
జాతియు గౌరవించుగా!ఛందన గంథ సౌరులం!చరితంబౌ!కీర్తి ఘటించుమా!
చేతనమెంచు మంచిగాన్!చెందును శోభిదంబు లెన్నన్!స్థిరమా!జీవన మెంచగాన్!
7.గర్భగత"-వందిత"-వృత్తము.
ధృతిఛందము.భ.ర.య.స.భ.ర.గణములు.యతి.19,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పొందును గోరుమా!శుభాలన్!పురుషార్థంబుల మీరకన్!
వందితమౌ!గమంబు కల్గున్!వరదంబౌ!నరజన్మకున్!
ఛందన గంథ సౌరులన్!చరితంబౌ!కీర్తి ఘటించుమా!
చెందును శోభిదంబు లెల్లన్!స్థిరమా!జీవన మెంచగాన్!
8.గర్భగత"-పాతక"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.య.స.భ.ర.భ.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
పొందును కోరుమా!శుభాలన్!పురుషార్థంబుల మీరకన్!భూతికిలోటు రా నటుల్?
వందితమౌ!గమంబు కల్గున్!వరదంబౌ!నరజన్మకున్!పాతక దూరతంజనన్!
ఛందనగంథ సౌరులన్!చరితంబౌ!కీర్తి ఘటించుమా!జాతియు గౌరవించుగా!
చెందును శోభిదంబు లెల్లన్!స్థిరమా!జీవన మెంచగన్!చేతనమెంచు మంచిగాన్!
9.గర్భగత"-రసజా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.జ.య.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
భూతికి లోటురానటుల్!పురుషార్థంబుల మీరకన్!
పాతక దూరతం జనన్!వరదంబౌ!నర జన్మకున్!
జాతియు గౌరవించుగా!చరితంబౌ!కీర్తి ఘటించుమా!
చేతన మెంచు మంచిగాన్!స్థిరమా!జీవన మెంచగన్!
10,గర్భగత"-పొందు గోరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.జ.య.స.య.స.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు,వృ.సం.
భూతికి లోటురానటుల్!పురుషార్థంబుల మీరకన్!పొందును కోరుమా! శుభాలన్!
పాతక దూరత న్జనన్!వరదంబౌ!నర జన్మకున్!వందితమౌ!గమంబు గల్గున్!
జాతియు గౌరవించుగా!చరితంబౌ!కీర్తిఘటించుమా!ఛందన గంథ! సౌరులన్!
చేతనమెంచు మంచిగాన్!స్థిరమా!జీవన మెంచగన్! చెందును శోభిదంబు లెల్లన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.