గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

13, జులై 2019, శనివారం

భారణా,వరీయ, ఉత్సుక,జీవన,సేవనా,రామరక్షా, చెడు వెడలు, మందతా, సయోజ్యతా,గర్భ"-దీన బంధు"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

జై శ్రీరామ్.
భారణా,వరీయ, ఉత్సుక,జీవన,సేవనా,రామరక్షా, చెడు వెడలు, మందతా, సయోజ్యతా,గర్భ"-దీన బంధు"-వృత్తము.

రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి, జుత్తాడ.

  "-దీనబంధు.వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.భ.భ.ర.స.స.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రక్షణ లేని యోగ్యునకు!రాముడె!రక్షగ నిల్చు!రావు గదా పలుకష్టముల్!
కక్షపటింపులంటునొకొ?కామిదముల్సమ కూర్చు!కావును శోభిల భూతలిన్!
పక్షములెల్ల!మేలొనరు!భాములుదూరము సేయు!పావనమౌ!జననంబగున్!
శిక్షణ మందు నీతిమెయి!క్షేమము గూర్చు సురాళి!జీవన భాగ్య మదే సుమా!
అర్ధములు:-
కావును=రక్షించును,పక్షములెల్ల=అన్ని వర్గముల వారు,రెండుపక్షములు
(కృష్ణ,శుక్ల పక్షములు),

1,గర్భగత"-భారణా"-వృత్తము.
బృహతీఛందము.భ.ర.న.గణములు.వృ.సం.471.
ప్రాసనియమముకలదు.
రక్షణ లేని యోగ్యునకు!
కక్ష పటింపు లంటు నొకొ?
పక్షము లెల్ల మేలొనరు!
శిక్షణ మందు నీతిమెయి!
2.గర్భగత"-వరీయ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.భ.గల.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
రాముడె!రక్షగ నిల్చు!
కామిదము ల్సమకూర్చు!
భాములు దూరము సేయు!
క్షేమము గూర్చు సురాళి!
3.గర్భగత"-ఉత్సుక"-వృత్తము.
బృహతీఛందము.భ.భ.ర.గణములు.వృ.సం.183.
ప్రాసనియమము కలదు.
రావు గదా!పలు కష్టముల్!
కావును!శోభిల భూతలిన్!
పావనమౌ!జననం బగున్!
జీవన భాగ్య మదే సుమా!
4.గర్భగత"-జీవన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.భ.భ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రక్షణ లేని యోగ్యునకు!రాముడె!రక్షగ నిల్చు!
కక్ష పటింపు లంటు నొకొ?కామిదముల్సమకూర్చు!
పక్షము లెల్ల మేలొనరు!భాములు దూరము సేయు!
శిక్షణ మందు నీతిమెయి!క్షేమము గూర్చు సురాళి!
5.గర్భగత"-ఇచ్ఛా సిద్ది!"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాముడె!రక్షగ నిల్చు!రావుగదా!పలు కష్టముల్!
కామిదము ల్సమ కూర్చు!కావును శోభిల భూతలిన్!
భాములు దూరము సేయు!పావనమౌ!జననం బగున్?
క్షేమము గూర్చు సురాళి!  జీవన భాగ్య మదే!సుమా!
6.గర్భగత"-సేవనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.స.య.స.జ.లల.గణములు.యతులు.09,18.
రాముడె!రక్షగ నిల్చు!రావుగదా!పలుకష్టముల్!రక్షణలేని యోగ్యునకు!
కామిదముల్సమ కూర్చు!కావునుశోభిలభూతలిన్!కక్ష పటింపులంటు నొకొ?
భాములు దూరముసేయు!పావనమౌ!జననంబగున్!పక్షములెల్ల మేలొనరు! క్షేమము గూర్చు సురాళి!జీవన భాగ్య మదే సుమా!శిక్షణమందు నీతిమెయి!
7.గర్భగత"-రామరక్షా"-వృత్తము.
ధృతిఛందము.భ.భ.ర.భ.ర.న.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రావు గదా!పలు కష్టముల్!రక్షణ లేని!యోగ్యునకు!
కావును శోభిల భూతలిన్!కక్ష పటింపు లంటు నొకొ?
పావనమౌ!జననంబగున్!పక్షము లెల్ల మేలొనరు!
జీవనభాగ్య!మదేసుమా!శిక్షణమందు నీతిమెయి!
8.గర్భగత"-చెడువెడలు"-వృత్తము
ఉత్కృతిఛందము.భ.భ.ర.భ.ర.న.భ.భ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు. వృ.సం.
రావుగదా!పలుకష్టముల్!రక్షణలేని!యోగ్యునకు!రాముడె!రక్షగ నిల్చు!
కావునుశోభిల!భూతలిన్!కక్షపటింపు లంటునొకొ?కామిదముల్సమకూర్చు!
పావనమౌ జననంబగున్!పక్షములెల్ల మేలొనరు!భాములు దూరము సేయు
జీవనభాగ్య మదే సుమా!శిక్షణమందు నీతిమెయి!క్షేమముగూర్చు సురాళి!
9.గర్భగత"-మందతా"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.భ.ర.స.జ.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాముడె!రక్షగ నిల్చు!రక్షణ లేని యోగ్యునకు!
కామిదముల్!సమకూర్చు!కక్ష పటింపు లంటునొకొ?
భాములు దూరము సేయు!పక్షము లెల్ల మేలొనరు!
క్షేమము గూర్చు సురాళి!శిక్షణమందు నీతిమెయి!
10,గర్భగత"-సయోజ్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.భ.ర.స.జ.ర.స.స.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాముడె!రక్షగ నిల్చు!రక్షణ లేని యోగ్యునకు!రావు గదా!పలు కష్టముల్!
కామిదముల్సమకూర్చు!కక్ష పటింపు లంటునొకొ?కావును శోభిల!భూతలిన్!
భాములు దూరముసేయు!పక్షములెల్ల మేలొనరు!పావనమౌ!జననంబగున్!
క్షేమము గూర్చు సురాళి!శిక్షణమందు నీతిమెయి!జీవనభాగ్య మదే సుమా!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గర్భగత వృత్తము లన్నియు అలరించు చున్నవి
శ్రీ వల్లభ వఝులవారి పాండితీ ప్రతిభ కొనియాడ దగినది . ధన్య వాదములు .మాకందిస్తున్న శ్రీ చింతా సోదరులకు అభినందనలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.