గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

21, జులై 2019, ఆదివారం

కలితీరు,విభ్రమ,మత్తరజినీ,రసాంఘ్రి,సన్మజా,చిరతా,శాసినీ,త్రయశా,మనోహర"-గర్భ"-మానవతా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
కలితీరు,విభ్రమ,మత్తరజినీ,రసాంఘ్రి,సన్మజా,చిరతా,శాసినీ,త్రయశా,మనోహర"-గర్భ"-మానవతా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-మానవతా"-వృత్తము.
అభికృతి ఛందము.స.భ.త.జ.య.త.ర.జ.గ.గణములు.యతులు.09,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మనసేదీ?మనుతేదీ?మమకారపు చింతేదీ?మానవత్వమేది?చూడగన్!
ఘనతేదీ?కనరాదే!  కమనీయపు తావేదీ?కానరాని !వేష భాషలన్!
ధనమార్గం!తనమార్గమ్!తమమే!సుమ లోకానన్!దాన,ధర్మమేది?భూతలిన్!
కనులుండీ!కనరేమీ?గమి జేరగ రారేమీ? గాన మేది?స్తోత్ర మే దిలన్?
1.గర్భగత"-కలితీరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.భ.గల.గణములు.వృ.సం.180.
ప్రాస నియమము కలదు.
మనసేదీ?మమతేదీ?
ఘనతేదీ!కనరాదే?
ధన మార్గం!తనమార్గమ్!
కనులుండీ!కనరేమీ?
2గర్భగత"-విభ్రమ"-వృత్తము.
జగతీఛందము.త.భ.భ.మ.గణములు.యతి.05,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మను తేదీ?మమకారపు చింతేదీ?
కనరాదే? కమనీయపు తావేదీ?
తన మార్గం!తమమే సుమ!లోకానన్!
కన రేమీ !గమి జేరగ రారేమీ?
3.గర్భగత"-మత్త రజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
మానవత్వమేది?చూడగాన్!
కాన రాని!వేష భాషలన్!
దాన ధర్మ మేది?భూతలిన్!
గాన మేది?స్తోత్ర మేదిలన్!
4.గర్భగత"-రసాంఘ్రి"-వృత్తము.
అనుష్టుప్ఛందము.స.స.గగ.గణములు.వృ.సం.28,
ప్రాసనియమము కలదు.
మమకారపు!చింతేదీ?
కమనీయపు!తావేదీ?
తమమే!సుమ!లోకానన్?
గమి జేరగ!  రారేమీ?
5.గర్భగత"-"-సన్మజా"-వృత్తము.
అత్యష్టీఛందము.స.స.మ.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మమకారపు చింతేదీ?మానవత్వ మేది?చూడగాన్!
కమనీయపు తావేదీ?కాన రాని వేష భాషలన్!
తమమే!సుమ!లోకానన్!దాన ధర్మ మేది?భూతలిన్!
గమి జేరగ!రారేమీ?గమమేదీ?స్తోత్ర మేదిలన్?
6.గర్భగత"-చిరతా"-వృత్తము.
ప్రకృతి ఛందము.స.స.మ.జ.ర.జ.య.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మమకారపు!చింతేదీ?మానవత్వ మేది?చూడగాన్!మనసేదీ?
కమనీయపు!తావేదీ?కానరాని వేష భాషలన్! ఘనతేదీ?
తమమే!సుమ!లోకానన్!దాన ధర్మ మేది?భూతలిన్!ధనమార్గమ్!
గమి జేరగ!రారేమీ?గాన మేది?స్తోత్ర మేదిలన్? కనులుండీ!
7.గర్భగత"-శాసినీ"-వృత్తము.
సంకృతిఛందము.స.స.మ.జ.ర.జ.య.య.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మమకారపు!చింతేదీ?మానవత్వమేది?చూడగాన్!మనసేదీ?మనుతేదీ?
కమనీయపు!తావేదీ?కానరాని!వేషభాషలన్. !ఘనతేదీ?   కనరాదే!
తమమే!సుమ!లోకానన్!దాన,ధర్మ మేది?భూతలిన్!ధనమార్గం!తనమార్గం!
గమి జేరగ! రారేమీ?గాన మేది? స్తోత్ర మేదిలన్? కనులుండీ !కనరేమీ?
8.గర్భగత"-త్రయశా"-వృత్తము.
అష్టీఛందము.స.స.త.య.స.గ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మమకారపు!చింతేదీ?మనసేదీ?మనుతేదీ?
కమనీయపు!తావేదీ?ఘనతేదీ!కనరాదే?
తమమే!సుమ!లోకానన్?ధనమార్గం!తన మార్గమ్?
గమి జేరగ!రారేమీ? కనులుండీ!కనరేమీ?
9,,గర్భగత"-మనోహర"-వృత్తము.
అభికృతిఛందము.స.స.త.య.స.త.ర.జ.గ.గణములు.యతులు,9,13,17.
ప్రాసనియమము కలదు.వృ.సం.
మమకారపు!చింతేదీ?మనసేదీ?మమతేదీ?మాన వత్వ మేది?చూడగాన్!
కమనీయపు!తావేదీ?ఘనతేదీ?కనరాదే?కానరాని!వేష భాషలన్?
తమమే!సుమ లోకానన్!ధనమార్గం!తన మార్గమ్!దాన,ధర్మమేది? భూతలిన్?
గమి జేరగ!రారేమీ?కనులుండీ!కనరేమీ?గాన మేది? స్తోత్ర మేదిలన్.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.