గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, జులై 2019, మంగళవారం

నేడు గురు పూర్ణిమ సందర్భముగా ఆంధ్రామృత పాఠకులకు శుభాకాంక్షలు.

జైశ్రీరామ్.
ఓం శ్రీగురుభ్యోనమః.
నేడు గురు పూర్ణిమ. ఈ సందర్భముగా మీ అందరికీ శుభాకాంక్షలు.
శ్రీమత్ జ్ఞానము గొల్పు నెవ్వరు? సదా ఛేదించునెవ్వారలీ
భూమిన్ వెల్గెడి మానవాళిఁ గలిచే ప్రోదిల్లు సందేహముల్?
ధీమంతంబుగ దది నెవ్వరు మనన్? దివ్యాత్మునా సద్గురున్
ప్రేమన్ మ్రొక్కెద భక్తి సంయుతుఁడనై విజ్ఞాన తేజోఖనిన్
జైహింద్.
Print this post

3 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
బాగుంది మంచి పద్యము .
గురుపూర్ణిమ సందర్భముగా శుభాకాంక్షలు .ఆశీర్వదించి అక్క

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

ధన్యవాదాలక్కయ్యా.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.