గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

23, జులై 2019, మంగళవారం

మత్తరజినీద్వయ,చీకట్లలరు,రజరాద్వయ,ద్వయ.కౌతుక,,పేరొనరని,కృతకర్మ,శ్రమణా,గర్భ"-జ్ఞాపికాద్వయ"-వృత్తములు. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
మత్తరజినీద్వయ,చీకట్లలరు,రజరాద్వయ,ద్వయ.కౌతుక,,పేరొనరని,కృతకర్మ,శ్రమణా,గర్భ"-జ్ఞాపికాద్వయ"-వృత్తములు.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
 
జ్ఞాపికాద్వయ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.
గాలిలో!దీపమేకదా!కాయధారి జీవ యానమున్!కాన రేమిటీ చిత్రమున్!
జ్వాల యారు!గాలి తీవ్రతన్!సా యశంబె!  నిల్చు ధాత్రినిన్! జ్ఞాన దీప్తినిన్! పొందునై!
కాల గర్భ మందు!చైదముల్!గాయమొందనీక!జూడుమా!కాన నౌనులే! మోక్షమున్!
శ్రీ లనంత కాంతి నింపుతన్!శ్రేయమేర్చి!రక్షయౌనటుల్!శ్రీనివాస!రా!కావగన్!
2.
కాయధారి!జీవ యానమున్!గాలిలోని దీపమే కదా!కానరేమిటీ చిత్రమున్!
సా యశంబె!నిల్చు ధాత్రినిన్!జ్వాల యారు గాలి తీవ్రతన్!జ్ఞాన దీప్తినిన్! పొందునై!
గాయ మందనీక!జూడుమా!కాల గర్భమందు చైదముల్!కాన నౌను లే! మోక్షమున్!
శ్రేయమేర్చి!రక్షయౌ!నటుల్!శ్రీలనంత కాంతి నింపుతన్!శ్రీనివాస!రా! కావగన్!
1.గర్భగత"-మత్తరజినీద్వయ"-వృత్తములు.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
1.గాలిలోని దీపమే!కదా!                2.కాయధారి జీవయానమున్!
  జ్వాలయారు!గాలితీవ్రతన్!             సాయశంబె!నిల్చు ధాత్రినిన్!
  కాలగర్భమందు చైదముల్!             గాయ మందనీక!చూడుమా!
  శ్రీ లనంత కాంతి!నింపుతన్!           శ్రేయమేర్చి!రక్ష యౌ నటుల్!
2.గర్భగత"-చీకట్లలరు"-వృత్తము.
అనుష్టుప్ఛందము..ర.య.లగ.గణములు.వృ.సం.75.
ప్రాసనియమము కలదు.
కాన రేమిటీ చిత్రమున్!
జ్ఞాన దీప్తి నిం పొందునై!
కాన నౌనులే!మోక్షమున్!
శ్రీనివాస!రా! కావగన్!
3.గర్భగత"-రజరాద్వయ"-వృత్తద్వయం.
ధృతిఛందము.ర.జ.ర.ర.జ.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
1.గాలిలోని దీపమే!కదా! కాయధారి జీవ యానమున్!
జ్వాల యారు గాలితీవ్రతన్!సా యశంబె!నిల్చు ధాత్రినిన్!
  కాలగర్భమందు చైదముల్!గాయ మందనీక!చూడుమా!
  శ్రీ లనంత కాంతి!నింపుతన్!శ్రేయమేర్చి!రక్షయౌనటుల్!

2.   కాయధారి!జీవ యానమున్!గాలిలోని దీపమే!కదా!
సా యశంబె!నిల్చు ధాత్రినిన్!జ్వాల యారు!గాలి తీవ్రతన్!
గాయ మందనీక!చూడుమా!కాలగర్భమందు!చైదముల్!
శ్రేయమేర్చి!రక్షయౌ నటుల్!శ్రీలనంత కాంతి నింపుతన్!
4.గర్భగత"-కౌతుక"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.జ.ర.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ సం.
కాయధారి!జీవయానమున్!కాన రేమీటీ చిత్రమున్!
సా యశంబె!నిల్చు!ధాత్రినిన్!జ్ఞాన దీప్తి నిం పొందునై!
గాయ మందనీక!చూడుమా!కాననౌను లే!మోక్షమున్!
శ్రేయమేర్చి!రక్ష యౌనటుల్!శ్రీనివాస!రా కావగన్!
5.గర్భగత"-పేరొనరని"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.య.య.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాయధారి జీవయానమున్!కానరేమిటీ చిత్రమున్!గాలిలోని దీపమే!కదా!
సా యశంబె!నిల్చు ధాత్రినిన్!జ్ఞాన దీప్తినిం పొందునై!జ్వాలయారు గాలి తీవ్రతన్!
గాయ మందనీక!చూడుమా!కాన నౌనులే!మోక్షమున్!కాలగర్భమందు చైదముల్!
శ్రేయ మేర్చి!రక్ష యౌ నటుల్! శ్రీనివాస రా కావగన్! శ్రీ లనంత కాంతి నింపుతన్!
6.గర్భగత"-కృత కర్మ"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.ర.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కాన రేమిటీ చిత్రమున్!గాలిలోని దీపమే కదా!
జ్ఞాన దీప్తి నింపొందునై!జ్వాల యారు గాలి తీవ్రతన్!
కాననౌనులే!మోక్షమున్! కాల గర్భమందు చైదముల్!
శ్రీనివాస రా కావగన్!శ్రీ లనంత కాంతి!నింపుతన్!
7.గర్హగత"-శ్రమణా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.ర.య.జ.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కానరేమిటీ చిత్రమున్!గాలిలోని దీపమే!కదా!కాయ ధారి!జీవ యానమున్!
జ్ఞాన దీప్తి నింపొందు నై!జ్వాల యారు!గాలి తీవ్రతన్!సా యశంబె!నిల్చు ధాత్రినిన్!
కాన నౌనులే!మోక్షమున్!కాల గర్భ మందు చైదముల్!గాయమంద నీక చూడుమా!
శ్రీనివాస రా!కావగన్!శ్రీలనంత కాంతి నింపుతన్!శ్రేయ మేర్చి!రక్ష యౌనటుల్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

1 comments:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
శ్రీ వల్లభవఝుల వారి వృత్త పద్యములన్నియు రసరమ్యముగా నున్నవి . మా కందించిన శ్రీ చింతా సోదరులు ధన్యులు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.