గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

2, జులై 2019, మంగళవారం

తారణ,వరాలినీ,పాలయమాం,శుభానన,వరేణ్య,సుఖదాయి,చతురా,సర్వవ్యాపక,మహాత్మక,వరాంగమ,గర్భ"-అంతర్యామి"-వృత్తము.రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
తారణ,వరాలినీ,పాలయమాం,శుభానన,వరేణ్య,సుఖదాయి,చతురా,సర్వవ్యాపక,మహాత్మక,వరాంగమ,గర్భ"-అంతర్యామి"-వృత్తము.రచన:-వల్లభ వఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.
                 

"-అంతర్యామి"-వృత్తము.
ఉత్కృతిఛందము.భ.ర.న.ర.స.న.ర.ర.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
జీవన సౌఖ్యదాయివి!శిరోరు గంగ వరాంగమ!శివా!భవానీ ప్రియా!హరా!
పావని శ్రీ సహోదర!వరేణ్య ధన్య!శుభానన!భవాంబుధిన్!తారయా!మహా!
దేవతలందు మేటివి!స్థిరంబు గూర్చు మహాత్మక!దివిన్భువిం!సర్వ వ్యాపకా!
భావము రావ మీవెగ?పరార్ధమెంచు మహేశ్వర!పవిత్రుడం గావుమా!ననున్?
1.గర్భగత"-తారణ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.భ.ర.లల.గణములు.వృ.సం.215.
ప్రాసనియమముకలదు.
జీవన సౌఖ్యదాయివి!
పావని!శ్రీ సహోదరి!
దేవతలందు మేటివి!
భావము రావ మీవెగ?
2.గర్భగత"-వరాలినీ"-వృత్తము.
బృహతీఛందము.జ.భ.భ.గణములు.వృ.సం.438.
ప్రాసనియమముకలదు.
శిరోరు గంగ వరాంగమ!
వరేణ్య ధన్య శుభానన!
స్థిరంబు గూర్చు మహాత్మక!
పరార్ధమెంచు!మహేశ్వర!
3.గర్భగత"-పాలయ మాం"-వృత్తము.
బృహతీఛందము.జ.త.ర.గణములు.వృ.సం.166.
ప్రాసనియమముకలదు.
శివా!భవానీ ప్రియా!హరా!
భవాంబుధిన్!తారయామహా!
దివిం!భువిం!సర్వ వ్యాపకా!
పవిత్రుడన్గావుమా!ననున్!
4.గర్భగత"-శుభానన"-వృత్తము.
అత్యష్టీఛందము.భ.ర.న.ర.స.లల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
జీవన సౌఖ్యదాయివి!శిరోరు గంగ వరాంగమ!
పావని శ్రీ సహోదర!వరేణ్య ధన్య శుభానన!
దేవతలందు మేటివి!స్థిరంబు గూర్చు మహాత్మక!
భావము రావ మీవెగ?పర్ర్ధమెంచు మహేశ్వర!
5.గర్భగత"-వరేణ్య"-వృత్తము.
ధృతిఛందము.జ.భ.భ.జ.త.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శిరోరు గంగ వరాంగమ!శివా!భవానీ ప్రియా!హరా!
వరేణ్య ధన్య శుభానన!భవాంబుధి తారయా మహా!
స్థిరంబు గూర్చు మహాత్మక!దివిం!భువిన్!సర్వ వ్యాపకా!
పరార్ధమెంచు మహేశ్వర!పవిత్రుడన్గావుమా!ననున్!
6.గర్భగత"-సుఖదాయి"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.భ.భ.జ.త.ర.భ.ర.లల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శిరోరు గంగ వరాంగమ!శివా!భవానీ ప్రియా!హరా!జీవన సౌఖ్యదాయివి!
వరేణ్య ధన్య శుభానన!భవాంబుధి తారయా మహా!పావని శ్రీ సహోదర!
స్థిరంబు గూర్చు మహాత్మక!దివిన్భువిన్!సర్వ వ్యాపక!దేవతలందు మేటివి!
పరార్ధ మెంచు మహేశ్వర!పవిత్రుడన్గావుమా!ననున్!భావము రావ మీవెగ?
7.గర్భగత"-చతురా"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.త.ర.భ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శివా!భవానీ ప్రియా!హరా!జీవన సౌఖ్య దాయివి!
భవాంబుధి తారయా!మహా!పావని శ్రీ సహోదర!
దివిన్భువిన్!సర్వ వ్యాపక!దేవతలందు మేటివి!
పవిత్రుడం!గావుమా!ననున్!భావము రావమీవెగ?
8.గర్భగత"-సర్వ వ్యాపక"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.త.ర.భ.ర.న.ర.స.లల.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శివా!భవ్నీ ప్రియా!హరా!జీవన సౌఖ్యదాయివి!శిరోరు గంగ వరాంగమ!
భవాంబుధి!తారయా మహా!పావని శ్రీ సహోదర!వరేణ్య ధన్య శుభానన!
దివిన్భువిన్!సర్వ వ్యాపక!దేవతలందు మేటివి!స్థిరంబు గూర్చు మహాత్మక!
పవిత్రుడన్గావుమా!ననున్!భావము రావ మీవెగ?పరార్ధ మెంచు మహేశ్వర!
9.గర్భగత"-మహాత్మక"-వృత్తము.
అత్యష్టీఛందము.జ.జ.భ.భ.ర.లల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శిరోరు గంఖ వరాంగమ!జీవన సౌఖ్య దాయివి!
వరేణ్య ధన్య శుభానన!పావని శ్రీ సహోదర!
స్థిరంబు గూర్చు మహాత్మక!దేవతలందు మేటివి!
పరార్ధ మెంచు మహేశ్వర!భావము రావ మీవెగ?
10.గర్భగత"-వరాంగమ"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.జ.భ.భ.ర.న.ర.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమముకలదు.వృ.సం.
శిరోరు గంగ వరాంగమ!జీవన సౌఖ్య దాయివి!శివా!భవానీ ప్రియా!హరా!
వరేణ్య ధన్య శుభానన!పావని శ్రీ సహోదర!భవాంబుధి తారయా!మహా!
స్థిరంబు గూర్చు మహాత్మక!దేవతలందు మేటివి!దివిన్భువిన్!సర్వ వ్యాపకా!
పరార్ధమెంచు మహేశ్వర!భావము రావ మీవెగ?పవిత్రుడన్గావుమా!ననున్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.