గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

22, జులై 2019, సోమవారం

భ్రమక,తరంగ,మత్తరజినీ,కాలగమన,స్రతా,శ్రీవాటినీ,గర్భగత,శరవేగ,సౌధామినీ,మోక్షదా,గర్భ"-సౌశీల్యతా"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
భ్రమక,తరంగ,మత్తరజినీ,కాలగమన,స్రతా,శ్రీవాటినీ,గర్భగత,శరవేగ,సౌధామినీ,మోక్షదా,గర్భ"-సౌశీల్యతా"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-సౌశీల్యతా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.త.జ.ర.జ.ర.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాలుగాయి తనము తప్పు!రామా!యన మోక్షమబ్బు!రక్కసత్వ మంటనీకుమా!
శీలమొప్ప!మసలు కొమ్మ!శ్రీమాతయె!రక్షయౌర!చిక్క బోకు దోషచర్యకున్!
కాల మిట్టె!గడచి పోవు!కామాదుల!నంట రాదు!కక్కరాదు!కర్కసత్వమున్!
మేలుకొమ్ము!తెలివి జూపి!మీ,మా యనుటెల్ల తప్పు!మిక్కుటంపు కీర్తి కాంక్షిలన్!
1.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృ.సం.379.
ప్రాసనియమము కలదు.
రాలుగాయి తనము తప్పు!
శీలమొప్ప!మసలు కొమ్మ!
కాల మిట్టె! గడచిపోవు!
మేలుకొమ్ము!తెలివి జూపి!
2.గర్భగత"-తరంగ"-వృత్తము.
అనుష్టుప్ఛందము.త.జ.గల.గణములు.వృ.సం.173.
ప్రాసనియమము కలదు.
రామా!యన మోక్ష మబ్బు!
శ్రీ మాతయె! రక్ష యౌర!
కామాదుల నంట రాదు!
మీ మా యనుటెల్ల తప్పు!
3.గర్భగత"-మత్తరజినీ"-వృత్తము.
బృహతీఛందము.ర.జ.ర.గణములు.వృ.సం.171.
ప్రాసనియమము కలదు.
రక్కసత్వ మంట నీకుమా!
చిక్కబోకు దోష చర్యకున్!
కక్కరాదు!కర్క సత్వమున్!
మిక్కుటంపు కీర్తి కాంక్షిలన్!
4.గర్భగత"-కాలగమన"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.త.జ.గల.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రాలుగాయి తనము తప్పు!రామా!యన మోక్షమబ్బు!
శీల మొప్ప!మసలు కొమ్మ!శ్రీమాతయె!రక్ష యౌర!
కాల మిట్టె!గడచి పోవు!కామాదుల నంట రాదు!
మేలు కొమ్ము!తెలివి జూపి!మీ,మా!యనుటెల్ల!తప్పు!
5.గర్భగత"-స్వరతా"-వృత్తము.
అత్యష్టీఛందము.త.జ.ర.జ.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!యన మోక్షమబ్బు!రక్క సత్వ మంట నీకుమా!
శ్రీ మాతయె!రక్ష యౌర!చిక్కబోకు దోష చర్యకున్!
కామాదుల నంటరాదు!కక్కరాదు!కర్క సత్వమున్!
మీ మా యనుటెల్ల తప్పు!మిక్కుటంపు కీర్తి!కాంక్షిలన్!
6.గర్భగత"-శ్రీవాటినీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.త.జ.ర.జ.ర.య.జ.న.గల.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!యన మోక్షమబ్బు!రక్కసత్వ మంటనీకుమా!రాలుగాయి తనము తప్పు!
శ్రీమాతయె!రక్ష యౌర!చిక్కబోకు!దోష చర్యకున్!శీలమొప్ప!మసలు కొమ్మ!
కామాదుల నంటరాదు!కక్కరాదు!కర్కసత్వమున్!కాలమిట్టె!గడచి పోవు!
మీ,మా యనుటెల్ల తప్పు!మిక్కుటంపు!కీర్తి కాంక్షిలన్!మేలు కొమ్ము!తెలివి జూపి!
7.గర్భగత"-గర్భగత"-వృత్తము.
ధృతిఛందము.ర.జ.ర.ర.న.జ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రక్కసత్వ మంట నీకుమా!రాలుగాయి తనము తప్పు!
చిక్కబోకు!దోష చర్యకున్!శీలమొప్ప మసలు కొమ్మ!
కక్కరాదు!కర్క సత్వమున్!కాల మిట్టె గడచి పోవు!
మిక్కుటంపు కీర్తి!కాంక్షిలన్!మేలుకొమ్ము!తెలివి జూపి!
8.గర్భగత"-శరవేగ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.జ.ర.ర.న.జ.త.జ.గల.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రక్కసత్వ!మంటనీకుమా!రాలుగాయి తనము తప్పు!రామా!యన మోక్షమబ్బు!
చిక్కబోకు!దోష చర్యకున్!శీలమొప్ప!మసలుకొమ్మ!శ్రీమాతయె!రక్ష యౌర!
కక్కరాదు!కర్కసత్వమున్!కాల మిట్టె గడచిపోవు!కామాదుల!నంటరాదు!
మీక్కుటంపు!కీర్తి కాంక్షిలన్!మేలు కొమ్ము!తెలివి జూపి!మీ,మా యనుటెల్ల తప్పు!
9,గర్భగత"-సౌధామినీ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.జ.ర.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!యన మోక్షమబ్బు!రాలుగాయి తనము తప్పు!
శ్రీమాతయె!రక్ష యౌర!శీలమొప్ప!మసలు కొమ్మ!
కామాదుల నంట రాదు!కాల మిట్టె!గడచి పోవు!
మీ,మా యనుటెల్ల తప్పు!మేలుకొమ్మ!తెలివి జూపి!
10గర్భగత"-మోక్షదా"- వృత్తము.
ఉత్కృతిఛందము.న.జ.ర.జ.న.ర.జ.ర.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
రామా!యన మోక్షమబ్బు!రాలుగాయి తనము తప్పు!రక్క సత్వ మంట నీకుమా!
శ్రీమాతయె!రక్షయౌర!శీలమొప్ప!మసలు కొమ్మ!చిక్కబోకు!దోషచర్యకున్!
కామాదుల!నంటరాదు!కాల మిట్టె!గడచి పోవు!కక్కరాదు!కర్కసత్వమున్!
మీ,మా యనుటెల్ల తప్పు!మేలుకొమ్మ!తెలివి జూపి!మిక్కుటంపు కీర్తి కాంక్షిలన్
స్వస్తి
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.