గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

26, జులై 2019, శుక్రవారం

ఉపమా, అనఘా,వారుణ,వెల్గు కల్మి, ప్రేమితా,బలిద,వేగతా,వెలు గొనరు,,సొత్తౌ,వెలితి లేని,గర్భ"-అమర ప్రీతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అష్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఉపమా, అనఘా,వారుణ,వెల్గు కల్మి, ప్రేమితా,బలిద,వేగతా,వెలు గొనరు,,సొత్తౌ,వెలితి లేని,గర్భ"-అమర ప్రీతి"-వృత్తము.రచన:-వల్లభవఝల అష్పల నరసింహ మూర్తి.  
జుత్తాడ.

"-అమర ప్రీతి"-వృత్తము.
ఉత్కృతి ఛందము.న.న.ర.న.ర.జ.స.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలత లలరు జీవమా!కలి వరామ!రామమా!గతిని గూర్చరా!వేగతన్!
బలిమిల గను క్షేమమా!పలుక వేమి?పిల్చినా!బ్రతుక నిమ్మ!నీ సేవలన్!
వెలుగులమర!జేయుమా!వెలితిలేని!ముక్తినిన్!వెతుకుచుంటి!శ్రీమా!యమన్
కలుము లమర!ప్రీతినిన్!కలుగ జేయు దైవమా!గతినొసంగు!చేదోడునై!
1.గర్భగత"-ఉపమా"-వృత్తము.
బృహతీఛందము.న.న.ర.గణములు.వృ.సం.192.
ప్రాసనియమము కలదు.
కలత లలరు జీవమా!
బలిమిల గను క్షేమమా!
వెలుగు లమర జేయుమా!
కలుము లమర ప్రీతినిన్!
2.గర్భగత"-అనఘా"-వృత్తము.
అనుష్టుప్ఛందము.న.ర.లగ.గణములు.వృ.సం.88,
ప్రాసనియమము కలదు.
కలి వరామ రామమా!!
పలుక వేమి?పిల్చినా!
వెలితి లేని ముక్తినిన్!
కలుగ జేయు దైవమా!
3.గర్భగత"-వారుణ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.ర.గణములు.వృ.సం.152.
ప్రాసనియమము కలదు.
గతిని గూర్ప రా వేగతన్!
బ్రతుకు నిమ్మ నీ సేవలన్!
వెతుకు చుంటి శ్రీమా యమన్!
గతి నొసంగు!చేదోడునై!
4.గర్భగత"-వెల్గు కల్మి"-వృత్తము.
అత్యష్టీఛందము.న.న.ర.న.ర.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలత లలరు జీవమా!కలి వరామ దామమా!
బలిమిల గను క్షేమమా!పలుక వేమి!పిల్చినా!
వెలుగు లమర జేయగన్!వెలితి లేని మోక్షమున్!
కలుము లమర ప్రీతినిన్!కలుగ జేయు దైవమా!
5.గర్భగత"-పేమితా"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.స.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వరామ!రామమా!గతిని గూర్చ రా వేగతన్!
పలుక వేమి?పిల్చినా!బ్రతుక నిమ్మ!నీ సేవలన్!
వెలితి లేని!ముక్తినిన్!వెతుకు చుంటి!శ్రీమా!యమన్!
కలుగ జేయు దైవమా!గతి నొసంగు!చేదోడునై!!
6.గర్భగత"-బలిద"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.స.య.త.న.జ.లగ.గణములు.యతులు.09,18.
ప్రాసనియమము కలదు.వరామమా
కలి వరామ రామమా!గతిని గూర్చ రా వేగతన్!కలత లలరు జీవమా!
పలుక వేమీ?పిల్చినా!బ్రతుక నిమ్ము!నీ సేవలన్!బలిమిల గను!క్షేమమా!
వెలితిలేని!ముక్తినిన్!వెతుకుచుంటి!శ్రీమా యమన్!వెలుగులమర జేయగన్!
కలుగ జేయు దైవమా!గతి నొసంగు చేదోడునై!కలుము లమర ప్రీతినిన్!
7.గర్భగత"-వేగతా"-వృత్తము.
ధృతిఛందము.న.ర.ర.న.న.ర.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతిని గూర్చ రా!వేగతన్!కలత లలరు జీవమా!
బ్రతుక నిమ్ము!నీ సేవలన్! బలిమిల గను!క్షేమమా!
వెతుకు చుంటి!శ్రీమా!యమన్!వెలుగులమర!జేయగన్?
గతి నొసంగు!చేదోడునై!కలుము లమర ప్రీతినిన్!
8గర్భగత"-వెలుగొనరు"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.ర.న.న.ర.న.ర.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
గతిని గూర్ప రా వేగతన్!కలత లలరు జీవమా!కలి వరామ రామమా!
బ్రతుక నిమ్ము!నీ సేవలన్!బలిమిల గను క్షేమమా!పలుక వేమి?పిల్చినా!
వెతుకుచుంటి!శ్రీమా!యమన్!వెలగు,లమర!జేయగన్!వెలితిలేని!ముక్తినిన్!
గతి నొసంగు!చేదోడునై!కలుము లమర!ప్రీతినిన్!కలుగ జేయు దైవమా!
9.గర్భగత"-సొత్తౌ"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.జ.న.స.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వరామ రామమా!కలత లలరు జీవమా!
పలుక వేమి?పిల్చినా!బలిమిల గను క్షేమమా!
వెలితి లేని!ముక్తినిన్!వెలుగు లమర జేయగన్!
కలుము లమర!ప్రీతినిన్!కలుగ జేయు!దైవమా!
10,గర్భగత"-వెలితి లేని"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.జ.న.స.జ.స.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
కలి వరామ రామమా!కలత లలరు జీవమా!గతిని గూర్ప!రా వేగతన్!
పలుక వేమి?పిల్చినా!బలిమిల గను క్షేమమా!బ్రతుక నిమ్ము నీసేవలన్!
వెలితి లేని!ముక్తినిన్!వెలుగు లమర!జేయగన్వెతుకుచుంటి!శ్రీమా!యమన్!
కలుము లమర!ప్రీతినిన్!కలుగజేయు దైవమా!గతినొసంగు!చేదోడునై!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.