గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

28, జులై 2019, ఆదివారం

ఈప్సిత,సయశా,ఆశీర్వాద,మాతాశ్రీ,శ్రేయసీ,యశోమయ,మా యమా,సృజనాత్మనా,శ్రీయశ,శ్రీమంత,గర్భ"-మణిభూషణ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

జైశ్రీరామ్.
ఈప్సిత,సయశా,ఆశీర్వాద,మాతాశ్రీ,శ్రేయసీ,యశోమయ,మా యమా,సృజనాత్మనా,శ్రీయశ,శ్రీమంత,గర్భ"-మణిభూషణ"-వృత్తము.రచన;-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి. జుత్తాడ.

"-మణిభూషణ"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.త.స.స.య.స.మ.మ.లగ.గణములు.యతులు.10,19. ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీమంతంబేర్పన్శివతమై!సృజనాత్మనా గర్భకృతిన్!చిన్నారిం!నీతిన్దీర్చితిన్!
ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!ప్రజలున్గనం జేరువన్!వన్నెన్శ్రీవాణీ! తేజతన్!
నీమాలం జెన్నొంది!వరలున్!నిజమై!స్థిరా భిజ్ఞ తగున్!నిన్నున్మెచ్చన్! శ్రీహరీ!
రామంబౌ!విద్వన్మణులచేన్!రజనీకరంబౌ!భువినిన్!క్రన్నం గాంచున్! శోభలన్!
1.గర్భగత"-ఈప్సిత"-వృత్తము.
బృహతీఛందము.మ.త.స.గణములు.వృ.సం.225.
ప్రాసనియమము కలదు.
శ్రీమంతంబేర్పన్శివతమై!
ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!
నీమాలం జెన్నొంది!వరలున్!
రామంబౌ!విద్వ న్మణుల చేన్!
2.గర్భగత"-సయశా"-వృత్తము.
బృహతీఛందము.స.య.స.గణములు.వృ.సం.204.
ప్రాసనియమము కలదు.
సృజనాత్మనా!గర్భ కృతిన్!
ప్రజలుం!గనం!జేరువన్!
నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!
రజనీకరంబౌ!భువినిన్!
3.గర్భగత"-ఆశీర్వద"-వృత్తము.
అనుష్టుప్ఛందము.మ.మ.లగ.గణములు.వృ.సం.65.
ప్రాసనియమము కలదు.
చిన్నారిం!నీతిం!దీర్చితిన్!
వన్నెన్!శ్రీవాణీ తేజతన్!
నిన్నున్!మెచ్చన్!శ్రీహరీ!
క్రన్నం!గాంచున్!శోభలన్!
4.గర్భగత"-మాతాశ్రీ"-వృత్తము.
ధృతిఛందము.మ.త.స.స.య.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
శ్రీమంతంబేర్పం!శివతమై!సృజనాత్మనా!గర్భ కృతిన్!
ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!ప్రజలుం!గనం!జేరువన్!
నీమాలం జెన్నొంది!వరలున్!నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!
రామంబౌ!విద్వన్మ ణుల చేన్!రజనీకరంబౌ!భువినిన్!
5.గర్భగత"-శ్రేయసీ"-వృత్తము.
అత్యష్టీఛందము.స.య.స.మ.మ.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సృజనాత్మనా!గర్భ కృతిన్!చిన్నారిం!నీతిన్!దీర్చితిన్!
ప్రజలుం గనం జేరువన్! వన్నెం! శ్రీవాణీ  తేజతన్!
నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!నిన్నుం!మెచ్చం!శ్రీ హరీ!
రజనీ కరంబౌ!భువినిన్!క్రన్నం గాంచుం!శోభలన్!
6.గర్భగత"-యశోమయ"-వృత్తము,
ఉత్కృతిఛందము.స.య.స.మ.మ.య.మ.భ.లగ.గణములు.యతులు.
10,18. ప్రాసనియమము కలదు.వృ.సం.
సృజనాత్మనా!గర్భ కృతిన్!చిన్నారిం!నీతిం దీర్చితిన్!శ్రీమంతం బేర్పం! శివతమై!
ప్రజలుం!గనం!జేరువం!వన్నెం శ్రీ వా ణీ తేజతన్!ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్ నిజమై!స్థిరా భిజ్ఞతగున్!నిన్నుం!మెచ్చం!శ్రీహరీ!నీమాలం జెన్నొంది వరలున్!
రజనీ కరంబౌ!భువినిన్!క్రన్నం గాంచుం!శోభలన్!రామంబౌవిద్వ న్మణులచేన్!
7.గర్భగత"-మా యమా"-వృత్తము.
అత్యష్టీఛందము.మ.మ.య.మ.భ.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
చిన్నారిం!నీతిం దీర్చితిన్!శ్రీమంతం బేర్పన్!శివత మై!
వన్నెం!శ్రీవాణీ!తేజతన్! ప్రామాణ్యంబై!నిల్చు!నిహమున్!
నిన్ను  న్మెచ్చం! శ్రీహరీ! నీమాలం జెన్నొంది వరలున్!
క్రన్నం!గాంచుం!శోభలన్!రామంబౌ!విద్వన్మణుల చేన్!
8.గర్భగత"-సృజనాత్మనా"-వృత్తము.
ఉత్కృతిఛందము.మ.మ.య.మ.భ.జ.జ.త.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
చిన్నారిం నీతిం దీర్చితిన్!శ్రీమంతం బేర్పన్!శివతమై!సృజనాత్మనా!గర్భ కృతిన్!
వన్నెం!శ్రీవాణీ తేజతన్!ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!ప్రజలుం గనన్! చేరువవన్!
నిన్నుం!మెచ్చం!శ్రీహరీ!నీమాలం జెన్నొంది వరలున్!నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!
క్రన్నం!గాంచుం!శోభలన్!రామంబౌ!విద్వ న్మణుల చేన్ !రజనీ కరంబౌ! భువినిన్!
9.గర్భగత"-శ్రీయశ"-వృత్తము.
ధృతిఛందము.స.య.స.మ.త.స.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
సృజనాత్మనా!గర్భ కృతిన్!శ్రీమంతం బేర్పన్!శివతమై!
ప్రజలుం!గనన్!చేరు వవం!ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!
నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!నీమాలం జెన్నొంది వరలున్!
రజనీకరంబౌ!భువినిన్!రామంబౌ!విద్వ న్మణుల చేన్!
10,గర్భగత"-శ్రీమంత"-వృత్తము.
ఉత్కృతిఛందము.స.య.స.మ.త.స.మ.మ.లగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
సృజనాత్మనా!గర్భ కృతిన్!శ్రీమంతం బేర్పన్!శివతమై!చిన్నారిం నీతన్ దీర్చితిన్!
ప్రజలుం గనం!చేరువవన్!ప్రామాణ్యంబై!నిల్చు నిహమున్!వన్నెం!శ్రీవాణీ తేజతన్!
నిజమై!స్థిరాభిజ్ఞ తగున్!నీమాలం!జెన్నొంది!వరలున్!నిన్నుం!మెచ్చం! శ్రీహరీ!
రజనీ!కరంబౌ!భువినిం!రామంబౌ!విద్వన్మణులచేన్!క్రన్నం గాంచుం! శోభలన్!
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.