గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

15, జులై 2019, సోమవారం

రసయ.మృదుమానస,ప్రోక్త,రసయా,రసిజా,పోకడ,అద్దిరా,సౌరభా భీతచేతనా,హాయినింపు,గర్భ"-సురభీ"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

జైశ్రీరామ్.
రసయ.మృదుమానస,ప్రోక్త,రసయా,రసిజా,పోకడ,అద్దిరా,సౌరభా భీతచేతనా,హాయినింపు,గర్భ"-సురభీ"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

సురభీ"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.స.య.ర.స.జ.ర.య.లగ.గణములు.యతులు.10,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అద్దిరా!సుమ సౌరభాలన్!హాయి నింపు మనంబులన్!హరా!హరించు కామాదులన్!
ముద్దుగా!శుభ శోభిదాలన్!మోయు భారతి మోదిలన్!మురారి శ్రీల క్షేమంబిడన్!
శుద్ధిగా!సమ సామ్యవాదం!సోయగంబగు పోకడన్!సురాళి మెచ్చ సంపన్నతన్!
పద్ధతౌ!వెల పెంచి తీరున్!బాయ కెన్నడు!తల్లినిన్!పరార్ధమెంచి!జీవించుమా!
1.గర్భగత"-రసయ"-వృత్తము.
బృహతీఛందము.ర.స.య.గణములు.వృ.సం.91.
ప్రాసనియమము కలదు.
అద్దిరా!సుమ సౌరభాలన్!
ముద్దుగా!శుభ శోభిదాలన్!
శుద్ధిగా!సమసామ్య వాదమ్!
పద్ధతౌ!వెలపెంచి తీరున్!
2.గర్భగత"-మృదుమానస"-వృత్తము.
అనుష్టువ్ఛందము,ర.స.లగ.గణములు.వృ.సం.91,
ప్రాసనియమము కలదు.
హాయినింపు మనంబులన్!
మోయు భారతి మోదిలన్!
సోయ గంబగు పోకడన్!
బాయ కెన్నడు?తల్లినిన్!
3.గర్భగత"-ప్రోక్త"-వృత్తము.
బృహతీఛందము.జ.ర.ర.గణములు.వృ.సం.151.
ప్రాస నియమము కలదు.
హరా!హరించు కామాదులన్!
మురారి!శ్రీల క్షేమంబిడన్!
సురాళి మెచ్చ సంపన్నతన్!
పరార్ధమెంచి జీవించుమా!
4.గర్భగత"-రసయా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.ర.స.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
అద్దిరా!సుమ సౌరభాలన్!హాయి నింపు మనంబులన్!
ముద్దుగా!శుభ శోభిదాలన్!మోయు భారతి మోదిలన్!
శుద్ధిగా!సమ సామ్య వాదం!సోయగంబగు పోకడన్!
పద్ధతౌ!వెల పెంచి తీరున్!బాయ కెన్నడు?తల్లినిన్!
5.గర్భగత"-రసిజా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.జ.ర.య.లగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హాయి నింపు మనంబులన్!హరా!హరించు కామాదులన్!
మోయు భారతి మోదిలన్!మురారి!శ్రీల క్షేమం బిడన్!
సోయగంబగు పోకడన్!సురాళి మెచ్చ సంపన్నతన్!
బాయ కెన్నడు?తల్లినిన్!పరార్ధ మెంచి జీవించుమా!
6.గర్భగత"-పోకడ"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.స.జ.ర.య.య.జ.జ.గగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హాయి నింపు మనంబులన్!హరా!హరించు!కామాదులన్!అద్దిరా!సుమ సౌరభాలన్!
మోయు భారతి!మోదిలన్!మురారి శ్రీల క్షేమంబిడన్!ముద్దుగా! శుభ శోభిదాలన్!
సోయగంబగు పోకడన్!సురాళి మెచ్చ సంపన్నతన్!శుద్ధిగా! సమ సామ్య వాదమ్!
బాయ కెన్నడు?తల్లినిన్!పరార్ధ మెంచి జీవించుమా!పద్ధతౌ!వెలపెంచి తీరున్!
7.గర్భగత"-అద్దిరా"-వృత్తము.
ధృతిఛందము.జ.ర.ర.ర.స.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హరా!హరించు కామాదులన్!అద్దిరా!సుమ సౌరభాలన్!
మురారి!శ్రీల క్షేమంబిడన్!ముద్దుగా!శుభ శోభిదాలన్!
సురాళి!మెచ్చ సంపన్నతన్!శుద్ధిగా!సమ సామ్య వాదమ్!
పరార్ధ మెంచి జీవించుమా!పద్ధతౌ!వెలపెంచి తీరున్!
8.గర్భగత"-సౌరభా"-వృత్తము.
ఉత్కృతిఛందము.జ.ర.ర.ర.స.య.ర.స.లగ.గణములు.యతులు.10,19.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హరా!హరించు కామాదులన్!అద్దిరా!సుమ సౌరభాలన్!హాయి నింపు మనంబులన్!
మురారి!శ్రీల క్షేమంబిడన్!ముద్దుగా!శుభ శోభిదాలన్!మోయు భారతి మోదిలన్?
సురాళి!మెచ్చ సంపన్నతన్!శుద్ధిగా సమ సామ్య వాదమ్!సోయగంబగు పోకడన్!
పరార్ధ మెంచి జీవించుమా!పద్ధతౌ వెల పెంచి తీరున్!బాయ కెన్నడు? తల్లినిన్!
9.గర్భగత"-భీత చేతనా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.స.య.జ.జ.గగ.గణములు.యతి.09,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హాయి నింపు మనంబులన్!అద్దిరా!సుమ సౌరభాలన్!
మోయు భారతి!మోదిలన్?ముద్దుగా!శుభ శోభిదాలన్!
సోయగంబగు పోకడున్! శుద్ధిగా!సమ సామ్య వాదమ్!
బాయ కెన్నడు?తల్లినిన్!పద్ధతౌ!వెల పెంచి తీరున్!
10,గర్భగత"-హాయినింపు"-వృత్తము.
ఉత్కృతి ఛందము.ర.స.య.జ.జ.త.ర.య.లగ.గణములు.యతులు.9,18.
ప్రాసనియమము కలదు.వృ.సం.
హాయి నింపు మనంబులన్!అద్దిరా!సుమ సౌరభాలన్!హరా!హరించు కామాదులన్!
మోయు భారతి!మోదిలన్!ముద్దుగా!శుభ శోభిదాలన్!మురారి శ్రీల క్షేమంబిడన్!
సోయగంబగు!పోకడన్!శుద్ధిగా!సమ సామ్యవాదం!సురాళి మెచ్చ సంపన్నతన్!
బాయకెన్నడు?తల్లినిన్!పద్ధతౌ!వెల పెంచి తీరున్!పరార్ధ మెంచి జీవించుమా.
స్వస్తి.
మూర్తి.జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.