గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

19, జులై 2019, శుక్రవారం

తిమిర,భ్రమక,వారుణ,మృణాళినీ,జ్యోత్స్నా,మానసిక,ఈవినా,అజరా,జాబిలి.గర్భ"-ప్రాయోజిక"-వృత్తము. రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ

జైశ్రీరామ్.
తిమిర,భ్రమక,వారుణ,మృణాళినీ,జ్యోత్స్నా,మానసిక,ఈవినా,అజరా,జాబిలి.గర్భ"-ప్రాయోజిక"-వృత్తము.
రచన:-వల్లభవఝల అప్పల నరసింహ మూర్తి.జుత్తాడ.

"-ప్రాయోజిక"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.య.య.జ.న.భ.స.య.లగ.గణములు.యతులు.9,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
తారలందు చంద్రున్బలెన్?తారకుండు శశిధరుండు!తగుత గాచు ! ధర్మాత్ములన్!
వారు వీరు వేరెంచకన్!భారకుండు శివతమోప!వగవనేల?గొల్వం గదే!
దారిజూపు తేజోమయున్!తారకంపు రుచుల జూపు!తగవు లేల రారండికన్!
చేరిగొల్వు!మల్లేశునిన్!చేరుకొందు సుర వాటి!చిగురు లొప్పు భూజంబులై!
1.గర్భగత"-తిమిర"-వృత్తము.
అనుష్టుప్ఛందము.ర.య.లగ.గణములు.వృ.సం.75,
ప్రాసనియమము కలదు.
తారలందు చంద్రున్బలెన్?
వారు వీరు  వేరెంచ కన్!
దారిజుపు తేజోమయున్!
చేరి గొల్వు! మల్లేశునిన్!
2.గర్భగత"-భ్రమక"-వృత్తము.
బృహతీఛందము.ర.న.జ.గణములు.వృసం.379.
ప్రాస నియమము కలదు.
తారకుండు!శశి ధరుండు!
భారకుండు!శివత మోప!
తారకంపు రుచుల జూపు!
చేరికొందు సుర వాటి!
3.గర్భగత"-వారుణ"-వృత్తము.
బృహతీఛందము.న.ర.ర.గణములు.వృ.సం.152.
ప్రాసనియమము కలదు.
తగుత గాచు!ధర్మాత్ములన్!
వగవ నేల?గొల్వం గదే!
తగవు లేల?రా రండికన్?
చిగురు లొప్పు భూజంబులై!
4.గర్భగత"-సారయా"-వృత్తము.
అత్యష్టీఛందము.ర.య.య.జ.న.గల.గణములు.యతి.09,వ.యక్షరము
ప్రాసనియమము కలదు.వృ.సం.
తారలందు!చంద్రున్బలెన్?తారకుండు!శశి ధరుండు!
వారు వీరు వేరెంచకన్?భారకుండు!శివత మోప!
దారిజూపు!తేజోమయున్!తారకంపు రుచుల జూపు!
చేరి గొల్వ!మల్లేశునిన్! చేరికొందు సురల వాటి!
5.గర్భగత"-మృనాళినీ"-వృత్తము.
ధృతిఛందము.ర.న.జ.న.ర.య.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకుండు!శశి ధరుండు!తగుత గాచు ధర్మాత్ములన్!
భారకుండు!శివత మోప!వగవ నేల?గొల్వం గదే!
తారకంపు!రుచుల జూపు! తగవు లేల?రా రండికన్?
చేరికొందు!సురల వాటి!చిగురు లొప్పు భూజంబులై!
6గర్భగత"-జ్యోత్స్నా"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.న.ర.య.ర.య.లగ.గణములు.యతులు.
10,19.ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకుండు!శశి ధరుండు!తగుత గాచు!ధర్మాత్ములన్!తారలందు చంద్రున్ బలెన్!.
భారకుండు!శివత మోప!వగవ నేల?గొల్వంగదే!వారు వీరు వేరెంచకన్!
తారకంపు రుచులజూపు!తగవు లేల?రా రండికన్!దారిజూపుతేజోమయున్!
చేరికొందు సురల వాటి!చిగురు లొప్పు భూజంబులై!చేరిగొల్వ మల్లేశునిన్!
7.గర్భగత"-మానసిక"-వృత్తము.
అత్యష్టీఛందము.న.ర.య.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు.వృ.సం.
తగుత గాచు!ధర్మాత్ములన్!తారలందు చంద్రున్బలెన్?
వగవ నేల?గొల్వంగదే!వారు వీరు వేరెంచ కన్!
తగవు లేల?రా రండికన్!దారిజూపు!తేజోమయున్!
చిగురు లొప్పు భూజంబులై!చేరిగొల్వ మల్లేశునిన్!
8.గర్భగత"-ఈవినా"-వృత్తము.
ఉత్కృతిఛందము.న.ర.య.ర.య.య.జ.న.గల.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
తగుత గాచు ధర్మాత్ములన్!తారలందు చంద్రున్బలెన్?తారకుండు!శశిధరుండు!
వగవనేల?గొల్వంగదే!వారు వీరు వేరెంచకన్!భారకుండు శివత మోప!
తగవు లేల?రా రండికన్!దారిజూపు!తేజోమయున్!తారకంపు రుచుల జూపు!
చిగురు లొప్పు!భూజంబులై!చేరి గొల్వ మల్లేశునిన్!చేరికొందు సురలవాటి!
9.గర్భగత"-అజరా"--వృత్తము.
అత్యష్టీఛందము.ర.న.జ.ర.య.లగ.గణములు.యతి.10,వ.యక్షరము.
ప్రాసనియమము కలదు. వృ.సం.
తారకుండు!శశి ధరుండు!తారలందు చంద్రున్బలెన్?
భారకుండు శివత మోప!వారు వీరు వేరెంచకన్?
తారకంపు రుచుల జూపు!దారి జూపు తేజోమయున్!
చేరికొందు సురల వాటి! చేరి గొల్వ!  మల్లేశునిన్!
10,గర్భగత"-జాబిలి"-వృత్తము.
ఉత్కృతిఛందము.ర.న.జ.ర.య.జ.స.య.లగ.గణములు.యతులు.
10,18.ప్రాసనియమము కలదు.వృ.సం.
తారకుండు!శశిధరుండు!తారలందు!చంద్రున్బలెన్?తగుత గాచు ధర్మాత్ములన్!
భారకుండు!శివత మోప!వారు వీరు వేరెంచకన్!వగవనేల?గొల్వంగదే!
తారకంపు!రుచుల జూపు!దారి జూపు!తేజో మయున్!తగవు లేల?రా రండికన్!
చేరికొందు!సురల వాటి!చేరిగొల్వ!మల్లేశునిన్!చిగురు లొప్పు భూజంబులై!
స్వస్తి.
మూర్తి,జుత్తాడ.
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.