మనము పురాణములు 18 అని చెప్పుతుంటాం. వాటినే అష్టా దశ పురాణములు అంటుంటాం. ఐతే ఈ పద్ధెనిమిది పురాణాలూ ఏవేవో పేర్లు చెప్పమంటే మాత్రం తటపటాయిస్తాం. ఆ సమస్య తీరాలంటే మనం ఈ క్రింది శ్లోకాన్ని కంథస్థం చేయవలసిందే. ఆ శ్లోకాన్ని చూద్దామా1
శ్లోకము:-
మద్వయం, భద్వయంచైవ
భ్ర త్రయం వ చతుష్టయం.
అ .నా . పద్ . లిం . గ . కూ . స్కా . ని
పురాణ్యష్టాదశా స్మృతా !
తేటగీతి:-
మద్వయము భద్వయము మన మదిని గాంచ.
భ్ర త్రయము వ చతుష్టయం పరగు నరయ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిది పురాణముల్ పరగుచుండె.
తేటగీతి:-
మ . మ . భ . భ . భ్ర . భ్ర . భ్ర . వ . వ . వ . వ . మరల చూడ
గా, అ . నా . పద్మ . లిం . గ . కూ . స్కా . లనంగ
పద్ధెనిమిదిపురాణముల్ పరగు చుండె.
వ్యాసు డద్భుత శక్తితో వరల జేసె.
గమనిద్దామా!
మద్వయము = రెండు మాలు
1. మత్స్య పురాణము,
2. మార్కండేయ పురాణము.
భ ద్వయము = రెండు భాలు
1. భాగవత పురాణము.
2. భవిష్యత్ పురాణము.
భ్ర త్రయం = మూడు భ్రాలు
1. బ్రహ్మాండ పురాణము.
2. బ్రాహ్మ పురాణము.
3. బ్రహ్మ వైవర్త పురాణము.
వ చతుష్టయము = నాలుగు వాలు.
1. వామన పురాణము.
2. వాయవ్య పురాణము.
3. వైష్ణవ పురాణము.
4. వారాహ పురాణము.
అ = అ. > అగ్ని పురాణము.
నా = నా > నారద పురాణము.
పద్ = పద్ > పద్మ పురాణము.
లిం = లిం > లింగ పురాణము.
గ = గ > గరుడ పురాణము.
కూ = కూ > కూర్మ పురాణము.
స్కా = స్కా > స్కాంద పురాణము.
తెలుగు వారిమైన మనం పురాణాల పేర్లు ఎవరయినా అడిగితే ఠక్కున చెప్పెయ్య గలుగుతాం పై శ్లోకాన్ని కాని పద్యాన్ని కాని కంఠస్థం చేయగలిగితే. కంఠస్థం చేద్దామా మరి?
జైహింద్.
Print this post
కలువలరాజు బావ సితి,,,,ప్రహేళిక.
-
జైశ్రీరామ్.
తన యింటికి వచ్చుచున్న వానిని చూచి ఒక ఇంటి యజమాని తన భార్యతో పలికిన పద్యము.
చం. కలువలరాజు బావ సితి గన్నకుమారుని యన్న మన్మనిన్
దొలచినవాని కా...
1 రోజు క్రితం
1 comments:
పైన పోష్టింగులో " తెలువరి మైన మనం " అని పడింది. కరం టు పోయిన హడావిడిలో పోష్ట్ చేసాను.
" తెలుగు వారిమయిన మనం " అని చదువుకోవాలి. గమనింప మనవి.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.