మనలో చాలామందికి భారత భాగవత రామాయణాలలో మంచి పరిచయం ఉన్నప్పటికీ ఒక్కొక్క మాటుఏ కథ ఎందులోది, ఏ కథ తరువాత ఏకథ, అనే సందేహాలు రావడం సర్వ సామాన్యం. ఏ మహాకావ్యంలో కథైనా ఆద్యంతమూ గుర్తుండాలి అంటే అది కొంచెం కష్ఠసాధ్యమే. నాకనిపిస్తుంది భారత భాగవత రామయణాలలోని కథలు క్రమం తప్పకుండా తెలిస్తే బాగుండునని. నాలాగే ఎవరి కొరకయినా పనికిరాకపోతుందా అని ఆలోచించి ముందుగా పోతన భాగవతం లోని కథా క్రమాన్ని చూపదలచుకొన్నాను.
శ్రీ కైవల్య పదంబు చేరిటకునై పోతన చింతించిన ఆ పరమాత్మకు మనసారా నమస్కరిస్తూ, పరమ భాగవతోత్తములకు అంజలించుతూ, దోషములున్న సహృదయతతో మన్నించి, పఠించ వలసినదిగా పాఠకులను ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను.
శ్రీమదాంధ్ర భాగవతము. - ప్రథమ {ఒకటవ }స్కంధము.:-
పీఠిక లో
ఈశ్వర, బ్రహ్మ, గణపతి, సరస్వతీ, దుర్గా, లక్ష్మీ, కవిజన ప్రార్థనలు.
కృతిపతి నిర్ణయము, శ్రీ రామ సాక్షాత్కారము, కృతి కర్తృ వంశ వర్ణన, షష్ట్యంతములు.
ప్రథమ స్కంధము:-
కథా ప్రారంభము.
సూతుని నారాయణ కథా ప్రశంస.
భగవంతుని ఇరువదియొక అవతారములు.
శ్రీ మహా భాగవత రచనాది వృత్తాంతము.
వ్యాసుడు వ్యాకుల చిత్తముతో చింతించుట.
వ్యాసుని కడకు నారదుని ఆగమనము.
నారదుని పూర్వ జన్మ వృత్తాంతము.
అర్జునుడు పుత్ర ఘాతియైన యశ్వత్థామ నవమానించుట.
ద్రౌపదీ అశ్వత్థామల సంభాషణ.
ఉత్తరా గర్భస్థుండైన యర్భకుని శ్రీకృష్ణుడు రక్షించుట.
కుంతీదేవి శ్రీ కృష్ణుని స్తోత్రము చేయుట.
ధర్మజుడు శ్రీకృష్ణ సహితుడై శర తల్ప గతుడైన భీష్ముని కడకేగుట.
భీష్ముడు శ్రీకృష్ణుని స్తుతించుట.
శ్రీ కృష్ణుడు ద్వారకా నగరమున కేగుట. శ్రీ కృష్ణుడు ద్వారక నగరము ప్రవేశించుట.
శ్రీకృష్ణుడు అంతః పుర కాంతలను జూడ బోవుట.
ఉత్తరకు పరీక్షిత్తు జనించుట.
గాంధారీ ధృతరాష్ట్రుల దేహ త్యాగము
ధర్మజుడు దుర్నిమిత్తములను గని చింతించుట.
అర్జునుడు ద్వారక నుండి వచ్చి కృష్ణుని నిర్యాణము దెలుపుట.
ధర్మ రాజు పరీక్షితునకు పట్టము గట్టి మహా ప్రస్థానమునకు వెళ్ళుట.
కలి పురుషుడు ధర్మ దేవతను తన్నుట.
పరీక్షిన్మహారాజు కలిని గ్రహించి, ధర్మ పరిపాలనము చేయుట.
వేటకు వెళ్ళిన పరీక్షిత్తు శమీకునిపై మృత సర్పమునెత్తి వేచుట.
శమీక పుత్రుడగు శృంగి పరీక్షితును శపించుట.
విప్ర శాపమెఱిగి పరీక్షితుడు ప్రాయోపవిష్టుడగుట.
శుక మహర్షి పరీక్షిన్మహారాజునొద్దకేతెంచుట.
ప్రథమ స్కంధము సమాప్తము.
ద్వితీయ స్కంధములోని అంశములను భగవంతుడు అవకాశము కల్పించినపుడు తప్పక మీ ముందుంచగలను.
జైహింద్.
Print this post
సప్త చిరంజీవులు.
-
జైశ్రీరామ్.
సప్త చిరంజీవులు.
*శ్లో. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।*
*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥*
*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మ...
17 గంటల క్రితం
3 comments:
ilaakaadu meeru bhagvata leelalanu okkokkatigaa post cheyyamdi.purushaardham siddhistumdi maanava lokaaniki meluchesinavaarilo meeru okaravutaaru
దుర్గేశ్వరా! మీరన్నట్లే నిజంగా నేను చేసే ఈ ప్రయత్నం భక్త లోకానికి మేలే చేకూర్చ గలిగితే ఇది నాకు భగవంతుడు కలుగ చేసిన మహద్భాగ్యంగా భావిస్తాను. మీ ఆకాంక్షలకు ధన్య వాదములు.
ఆర్యా! దుర్గేశ్వర రావు గారూ! మనలో చాలా మందికి ఆ కథలు తెలియనివి కాదు. ఐతే నా ప్రయత్నాన్ని గురించి ముందే చెప్పాను. ఏ స్కంధంలో ఏయే కథలున్నాయనే విషయ పరిజ్ఞానం కలిగించడమే ఈ చేస్తున్న ప్రయత్న ప్రయోజనం. నామదిలోని భావన కనుగుణంగానున్న మీ సూచనను పరిగ్రహిస్తున్నాను. మీకు నా ప్రత్యేక ధన్యవాదములు.
కామెంట్ను పోస్ట్ చేయండి
ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.