గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

16, నవంబర్ 2008, ఆదివారం

ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనాం. మేలిమి బంగారం మన సంస్కృతి 4.

దుష్టులకుండే సహజ గుణాలు:-

మనము మంచి ఆత్మలు కలవారుగా వుండాలీ అంటే ముందుగా దురాత్ములుగా ఉండకుండా ఉండాలి . ఐతే దురాత్ముని స్వభావాన్ని తెలుసుకొంటె అలా వుండకుండా ఉంటాం కదా! చూడండి భర్తృహరి ఏంచెప్పాడో.

శ్లోకము:-
అ కరుణత్వ మకారణ విగ్రః
పరధనే పరయోషితి చ స్పృహా
సుజన బంధు జనే ష్వసహిష్ణుతా
ప్రకృతి సిద్ధ మిదం హి దురాత్మనాం.


తేటగీతి:-
దయయె లేకుండు. కలహించు భయములేక.
పరుల ధన, స్త్రీల నాశించు. పరవశించు.
కారణము లేక ద్వేషించు ఘనుల, మిత్ర
వరుల, దుష్టుని. సహజాత మరయ నిదియె.

దయాగుణము లేక పోవుట, అ కారణముగా అందరితో కలహించుట, పరుల ధనమును స్త్రీలను కోరుకొంటూ వాటితో పరవశించుట, గొప్ప వారిని, మిత్రులను కారణము లేకుండానే ద్వేషించుట మొదలగు యిటువంటి గుణములు దుర్మార్గులకు పుట్టుకతోనే వచ్చును.

ఇట్టి గుణములకు మనము దూరముగానుండి సజ్జనులమై ప్రవర్తించుతూ సుజనత్వాన్ని నిలుపుకొందామామరి?

జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.