గణనీయంబగు భాషలందు తెలుగున్ గాంచంగ మేల్మేలు.. తాన్ విన సొంపై , ప్రకటించు భావ సరళిన్ దృప్తిన్, విశేషించి పల్ ఘన కావ్యామృత సంవిధాన మహిమల్ గాంచంగ నాంధ్రామృతం బను యీ బ్లాగును గొల్పి యుంటి. కనుడీ ! ఆంధ్రామృతం బందుడీ ! .

24, నవంబర్ 2008, సోమవారం

సదయం హృదయం యస్య . . . మేలిమి బంగారం మన సంస్కృతి 13

కలి పురుషుడు కన్నెత్తైనా చూడడానికి వీలు పడని మహాపురుషులు:- 
సమాజంలో కలి ప్రభావానికి లొంగనివా రుండరనుకొంటాం. యిది చాలా నిజమే. ఐతే కలి ప్రభావానికి లొంగనివారు కూడా వున్నారట మనలో. ఎవరా కాలి కల్మష దూరులో తెలుసుకొందామా మనం. ఈ క్రింది శ్లోకాన్ని చూస్తే మనకా విషయం తెలుస్తుంది.
శ్లో. సదయం హృదయం యస్య భాషితం సత్య భూషితం
కాయః పర హితో యస్య కలిస్తస్య కరోతి కిం.

గీ. సదయ హృదయంబు కలవాని సన్నుతాత్ము
సత్య భాషా విభూషితు సరస మతిని
పర హితార్ధంబు వర్తించు భవ్యు నెపుడు
కలి సమీపింప నేరడు. కరుణ జూపు.

భావము:- ఎవని హృదయము దయా పూరితమో, ఎవని పలుకులు సత్య భూషితములో, ఎవని దేహము పర హితైక ప్రయోజనమో, అట్టీ వానిని కలి యేమియూ చేయలేడు.
కలి ప్రభావము మనపై కూడా పడకూడదనుకొంటే మనము కూడా పైన చెప్పిన మంచి లక్షణములను పెంపొందించుకోవలసి వుంది. కాబట్టి మనమూ ప్రయత్నిద్దమా ?
జైహింద్.
Print this post

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆంధ్రామృత బ్లాగ్ వీక్షకులకు ధన్యవాదములు.